నెక్లెస్ రోడ్డులో చిత్ర విచిత్రమై కార్లను ప్రదర్శించనున్న సుధాకర్

డైనింగ్ టేబుల్ కార్, సోఫాసెట్ కార్, కంప్యూటర్ కార్, హెల్మెట్ కార్, క్రికెట్ బాల్ కార్, సిగరెట్ బైక్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే అవుతుంది. తాను రూపొందించిన ఈ వినూత్నమైన డిజైన్లను, హైదరాబాద్‌లోని నక్లెస్ రోడ్‌లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో రేపటి నుండి రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఓ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఫిబ్రవరి 4, 5వ తేదీలలో 'సుధా వాకీ కార్స్ షో" పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఈ షోను నిర్వహించనున్నామని, ఇక్కడ దాదాపు 30 చిత్ర విచిత్రమైన కార్లను ప్రదర్శనకు ఉంచుతామని సుధాకార్స్ అధినేత సుధాకర్ వెల్లడించారు. ప్రపంచంలోనే ఈ తరహా ప్రదర్శన ఇదే మొట్టమొదటిదని సుధాకార్ తెలిపారు. ఈ షోలో వివిధ బంతుల ఆకారంలో ఉండే కార్లు, ఫార్ములా వన్ డిజైన్ కలిగిన కారు, కాఫీ మగ్ ఆకారంలో ఉండే కారు వంటి ఎన్నో డిజైన్లను తిలకించవచ్చు.


Click it and Unblock the Notifications








