డెట్రాయిట్ మోటార్ షో: టాటా ఎలక్ట్రిక్ కారు 'ఈమో'
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరో సరికొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ప్రస్తుతం అమెరికాలోని డెట్రాయిట్‌లో జరుగుతున్న మోటార్ షోలో "ఈమో" అనే ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ ఆవిష్కరించింది. అక్కడి మార్కెట్లో ఇదే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారని కంపెనీ పేర్కొంది. అమెరికన్ మార్కెట్లో ఈమో ఎలక్ట్రిక్ కారు ధర జస్ట్ 20,000 డాలర్లు మాత్రమే.
అంటే మన దేశ కరెన్సీలో సుమారు పది లక్షల రూపాయల పైమాటే. ఈ బుజ్జి ఎలక్ట్రిక్ కారులో నలుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. టాటా గ్రూపుకు చెందిన టాటా టెక్నాలజీస్ ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది. విశిష్టమైన ఎలక్ట్రిక్ డ్రైవ్, ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఈమో ఎలక్ట్రిక్ కారు 900 కిలోల బరువును కలిగి ఉంటుంది.
భవిష్యత్తులో పట్టణ ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు కోసం కంపెనీ ఈ మోడల్‌ను అభివృద్ధి చేసింది. అయితే, దీన్ని భారత మార్కెట్లో విడుదల చేసేది లేనిదీ మాత్రం కంపెనీ వెల్లడించలేదు. దీని చూడగానే ఇదేదో టాటా నానో ఎలక్ట్రిక్ వేరియంట్ అనిపించడం ఖాయం. అయితే, టాటా నానోకు ఈమో ఎలక్ట్రిక్ కారు ఎలాంటి సంబంధం లేదు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన మార్కెట్ల కోసం కంపెనీ ఈ మోడల్‌ను రూపొందించింది.


Click it and Unblock the Notifications









