న్యూయార్క్ ఆటో షో 2012లో ఫ్లయింగ్ కార్ ఆవిష్కరణ
ఇప్పటికే ఈ కారను రోడ్లపై నడపటానికి అమెరికా ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది. రోడ్డుపై గంటకు 65 మైళ్ల వేగంతో ప్రయాణించే టెర్రాఫుజియా, గాలిలో 115 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. 'ట్రాన్సిషన్ రోడబుల్ లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్'గా పిలిచే ఎగిరే కారు కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే తన రూపాన్ని మార్చుకొని పక్షిలా రెక్కలు విప్పుకొని గాల్లోకి రివ్వున ఎగిరిపోగలదు.
ఈ కారును ట్యాంక్ ఫుల్ చేయించుకుని 110 మైళ్ల వేగంతో గాల్లో ప్రయాణించినట్లయితే, సుమారు 460 మైళ్ల దూరం వరకూ వెళ్లవచ్చు. దాదాపు 2,50,000 అమెరికన్ డాలర్ల ఖరీదు చేసే ఈ టెర్రాఫుజియా కారు రెండు సీట్లు కలిగిన తేలికరకం ఎయిర్ క్రాఫ్ట్. ఈ ఫ్లయింగ్ కారును గాల్లో నడపటానికి కేవలం 20 గంటల ఫ్లయింగ్ శిక్షణ తీసుకుంటే సరిపోతుంది. 2012 న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో ఏప్రిల్ 6 నుండి 15 వరకూ జరగనుంది.


Click it and Unblock the Notifications









