2013 దుబాయ్ మోటార్ షో: జాగ్వార్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

By Ravi

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ తొలిసారి సెడాన్ల తయారీ నుంచి ఎస్‌యూవీల తయారీ దృష్టి సారించి రూపొందించిన మొట్టమొదటి కాన్సెప్ట్ ఎస్‌యూవీ 'జాగ్వార్ సి-ఎక్స్17'ను కంపెనీ దుబాయ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించింది.

జాగ్వార్ ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తొలిసారిగా తమ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌ను (బ్లూ కలర్ కారు) ప్రదర్శనకు ఉంచింది. కాగా.. జరుగుతున్న 2013 దుబాయ్ మోటార్ షో కోసం లిక్విడ్ అల్యూమినియం మెటల్ ఫినిష్‌తో కూడిన జాగ్వార్ సి-ఎక్స్17 కారును కంపెనీ తయారు చేసింది.

జాగ్వార్ తొలి ఎస్‌యూవీ కాన్సెప్ట్ సి-ఎక్స్17 మోడల్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

జాగ్వార్ సి-ఎక్స్17 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఫ్లెక్సిబల్ మరియు అత్యంత అధునాతనమైన మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

భవిష్యత్తులో జాగ్వార్ నుంచి రానున్న ఇతర అన్ని నెక్స్ట్-జెన్ ఎస్‌యూవీలకు/ఉత్పత్తుల తయారీకి ఇదే మాడ్యులర్ అల్యూమినియం ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించనున్నారు.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

పెద్ద హనీకోంబ్ ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌ చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఎయిర్ ఇన్‌టేక్స్ చుట్టూ బోల్డ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, మిర్రర్లపై ఎల్ఈడి ఇండికేటర్స్ వంటి అనేక కొత్త అంశాలను జాగ్వార్ సి-ఎక్స్17 కాన్సెప్ట్‌లో చూడొచ్చు.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

ఇది కాన్సెప్ట్ వెర్షన్ కాబట్టి, ప్రొడక్షన్ దశకు చేరుకునే వెర్షన్‌లో ఇందులోని కొన్ని ఫీచర్లు కోల్పోయే ఆస్కారం ఉంది.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

ఇది ల్యాండ్ రోవర్ అందిస్తున్న ఆఫ్-రోడింగ్ ఎస్‌యూవీల మాదిరిగా కాకుండా ఎవోక్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుందని అని తెలుస్తోంది. ప్రత్యేకించి అర్బన్ రోడ్ల కోసం తయారు చేసిన మోడల్‌గా అనిపిస్తుంది.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది గడచిన సెప్టెంబర్ నెలలో జరిగిన 2013 ఫ్రాంక్‌ఫార్ట్ మోటార్ షోలో జాగ్వార్ ఆవిష్కరించిన బ్లూ కలర్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న 2013 దుబాయ్ మోటార్ షోలో జాగ్వార్ ఆవిష్కరించిన లిక్విడ్ అల్యూమినియం కలర్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

జాగ్వార్ విడుదల చేయనున్న ఈ ఎస్‌యూవీలలో ఉపయోగించేందుకు గాను కంపెనీ సరికొత్త 2.0 లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

జాగ్వార్ సి-ఎక్స్17 ఎస్‌యూవీ కాన్సెప్ట్

ప్రస్తుతం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతుండటంతో జాగ్వార్ బ్రాండ్‌లో కూడా యుటిలిటీ వాహనాలను ఆఫర్ చేసేందుకు కంపెనీ సిద్ధమయ్యింది. వీలైనంత త్వరగా ఈ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకవచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, 2015లో ఇది మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Britsh luxury carmaker Jaguar has showcased its C-X17 compact SUV concept at the 2013 Dubai International Motor Show. The car was unveiled globally at the 2013 Frankfurt Motor Show and is a crossover concept.
Story first published: Tuesday, November 12, 2013, 12:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X