2013 జెనీవా మోటార్ షో: టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్
మానవుడిలోని సృజనాత్మకతకు టెక్నాలజీ తోడైతే అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. అలాంటి ఓ అద్భుతమే ఈ ఫొటోల్లో కనిపిస్తున్న టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ (Toyota i-ROAD). ఇదొక పర్సనల్ మొబిలిటీ వెహికల్. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని జనపనీస్ కార్ కంపెనీ టొయోటా అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ వాహనం ఇది. నేటి నుండి ప్రారంభమైన 83ల అంతర్జాతీయ జెనీవా మోటార్ షోలో టొయోటా మోటార్ కార్పోరేషన్ ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించనుంది.
టొయోటా ఐ-రోడ్ ఒక ఎలక్ట్రిక్ వాహనం. ఇందులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఈ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేస్తే 30 మైళ్ల (50 కిలోమీటర్లు) దూరం ప్రయాణించవచ్చు. 'యాక్టిల్ లీన్' టెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ను డ్రైవ్ చేయటం చాలా సులువు. ఇందులో ప్రయాణం కూడా చాలా సురక్షితంగాను, ఆహ్లాదంగాను ఉంటుంది. తక్కువ విద్యుత్ను, తక్కువ స్థలాన్ని ఉపయోగించుకుని, పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాలపై 40 ఏళ్లుగా టొయోటా చేస్తున్న పరిశోధనలకు ఫలితమే ఈ ఐ-రోడ్ కాన్సెప్ట్.
ఈ వాహనంలోని బ్యాటరీని కేవలం 3 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ద్విచక్ర వాహనాలతో పోల్చుకుంటే ఐ-రోడ్ కాన్సెప్ట్లో ఎలాంటి వాతావరణంలో అయినా (దుమ్ము, ధూళి, వర్షం, ఎండ, చలి మొదలైనవి) సౌకర్యవంతంగా, సురక్షితంగా ప్రయాణించవచ్చు. మూడు చక్రాలు కలిగిన ఈ టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్ 2350 మి.మీ. పొడవును, 1445 మి.మీ. ఎత్తును, 1700 మి.మీ. వీల్బేస్ను కలిగి ఉండి తక్కువ పార్కింగ్ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ముందు చక్రాల 2 కి.వా. సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి, ఇవి లిథియం అయాన్ బ్యాటరీల సాయంతో నడుస్తాయి. మరి ఈ టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్పై ఓ కన్నేస్కోండి.

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్

టొయోటా ఐ-రోడ్ కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








