2013 షాంగై ఆటో షో: హోండా ఎమ్ కాన్సెప్ట్ విడుదల
జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా కార్స్ తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోవి శరవేగంగా విస్తరిస్తోంది. అధునాత డీజిల్ ఇంజన్ టెక్నాలజీతో కూడిన హోండా అమేజ్‌ను విడుదల చేసిన తర్వాత హోండా మరిన్ని డీజిల్ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను విడుదల చేసిన ప్రతి మార్కెట్లోను ఈ కారుకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో, ఆసియా మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని ఓ ఎమ్‌పివిని అభివృద్ధి చేయాలని కంపెనీ నిర్ణయించింది.
ఇందులో భాగంగానే, హోండా కార్స్ అభివృద్ధి చేసిన ఎమ్‌పివి కాన్సెప్ట్ 'హోండా ఎమ్'ను చైనాలో జరుగుతున్న 2013వ అంతర్జాతీయ షాంగై ఆటో షోలో ఆవిష్కరించింది. ప్రస్తుతానికి ఇది కాన్సెప్ట్ మాత్రమే అయినప్పటికీ, అతి త్వరలోనే ఇది ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 నాటికి ఇది రోడ్లపై పరుగులు పెట్టే అవకాశం ఉంది. తమ ఎమ్ కాన్సెప్ట్ గురించి హోండా ఎలాంటి సాంకేతిక వివరాలను ఇంకా వెల్లడించలేదు.
విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ఆకర్షనీయమైన మోడ్రన్ డిజైన్, మెరుగైన మైలేజీనిచ్చే ఇంజన్స్ వంటి ప్రధాన ఫీచర్లను మనం ఈ హోండా ఎమ్ కాన్సెప్ట్‌లో ఊహించుకోవచ్చు. హోండా ఎమ్ కాన్సెప్ట్ తొలుత చైనా మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది. అనంతరం భారత మార్కెట్లో కూడా ఈ ఎమ్‌పివి విడుదలయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ లోపుగా హోండా ఎమ్ కాన్సెప్ట్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

2013 షాంగై ఆటో షో: హోండా ఎమ్ కాన్సెప్ట్

2013 షాంగై ఆటో షో: హోండా ఎమ్ కాన్సెప్ట్

2013 షాంగై ఆటో షో: హోండా ఎమ్ కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








