టోక్యో మోటార్ షో: 2014 హోండా వాల్కైర్ విడుదల

ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 2013 టోక్యో మోటార్ షో అనేక కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణకు వేదికగా మారుతోంది. జపనీస్ మోటార్‌సైకిల్ కంపెనీ హోండా ఈ ఆటో షోలో తమ సరికొత్త 2014 హోండా వాల్కైర్ 'Honda Valkyrie' క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

హోండా నుంచి అత్యంత పాపులర్ అయిన లీజర్ మోటార్‌సైకిల్ గోల్డ్ వింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని దీనిని డిజైన్ చేశారు. శక్తివంతమైన పెద్ద ఇంజన్, మోన్‌‌స్టర్ లుక్, డ్యూయెల్ సైలెన్సర్, డూయ్యెలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు కొత్త హోండా వాల్కైర్ సొంతం.

మరి ఈ పవర్‌ఫుల్ క్రూయిజర్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

2014 హోండా వాల్కైర్

కొత్త 2014 హోండా వాల్కైర్ మోటార్‌సైకిల్‌లో పవర్‌‌ఫుల్ 1832సీసీ ఫ్లాట్ సిక్స్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. హోండా గోల్డ్ వింగ్ లీజర్ మోటార్‌సైకిల్‌లో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

2014 హోండా వాల్కైర్

ఈ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 117 బిహెచ్‌పిల శక్తిని, 4000 ఆర్‌పిఎమ్ వద్ద 166 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గోల్డ్ వింగ్ మాదిరిగా వాల్కైర్‌కు ఎక్కువ ఫెయిరింగ్స్ లేవు కాబట్టి దీని బరువు 340 కేజీలుగా ఉంటుంది. (గోల్డ్ వింగ్ బరువు 410 కేజీలు).

2014 హోండా వాల్కైర్

ఎక్కువ పవర్, తక్కువ బరువు ఉంటే యాక్సిలరేషన్ కూడా మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా, హోండా గోల్డ్ వింగ్‌తో పోల్చుకుంటే, కొత్త 2014 హోండా వాల్కైర్ కూడా మెరుగైన యాక్సిలరేషన్‌తో మంచి పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

2014 హోండా వాల్కైర్

హోండా తమ వాల్కైర్ బరువును తగ్గించడంతో పాటుగా, దీని సీట్ హైట్‌ను తగ్గించేందుకు (28.8 ఇంచ్‌లు) కూడా అల్యూమినియం సబ్‌ఫ్రేమ్‌లో కూడా మార్పులు చేశారు. ఫలితంగా వేగంగా వెళ్తున్నప్పుడు బైక్ హ్యాండ్లింగ్ చక్కగా ఉంటుంది.

2014 హోండా వాల్కైర్

వాల్కైర్‌లో వెనుక వైపు అల్యూమినియం స్వింగ్ఆర్మ్ ఓవైపు మాత్రమే ఉంటుంది. కానీ ముందు వైపు మాత్రం 30.5° రేక్, 12.5మి.మీ. ట్రైల్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా వీల్‌బేస్‌ను 67.2 ఇంచ్‌ల వరకు తీసుకురావటం సాధ్యమైంది.

2014 హోండా వాల్కైర్

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బహ్రేకింగ్ సిస్టమ్) ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుంది. ఇందు కోసం ఉపయోగించే డిస్క్‌లు గోల్డ్ వింగ్‌లో ఉపయోగించిన డిస్క్‌ల కన్నా పెద్దవి.

ట్రాక్‌పై హోండా వాల్కైర్ పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2013, 15:01 [IST]
English summary
Meet the 2014 Honda Valkyrie, a big, bad beast from Honda resulting from Honda Gold Wing that's been stripped off its panniers and fairings, resulting in a naked cruiser that looks like a brand new motorcycle. In fact, in many ways it is a brand new motorcycle.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+