మోటార్‌సైకిల్ విభాగాన్ని ప్రారంభించిన క్యాటర్‌హామ్ గ్రూప్

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రేస్ కార్ల తయారీ కంపెనీ క్యాటర్‌హామ్ ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించింది. క్యాటర్‌హామ్ గ్రూప్ చరిత్రలోనే తొలిసారిగా, ఈ సంస్థ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించి. ఎఫ్1 కార్ల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను దక్కించుకున్న క్యాటర్‌హామ్ ఇప్పుడు అదే తరహాలో మోటార్‌సైకిళ్లను తయారు చేయనుంది.

మిలాన్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ఎగ్జిబిషన్ (ఈఐసిఎమ్ఏ)లో క్యాటర్‌హామ్ మూడు కొత్త కాన్సెప్ట్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. అవి - బ్రూటస్ 750 (మోటార్‌సైకిళ్ల యొక్క ఎస్‌యూవీని అని పిలుస్తారు), క్లాసిక్ ఈ-బైక్ (పురాతన స్టయిల్‌తో కూడిన ఆల్-ఎలక్ట్రిక్ బైక్) మరియు కార్బన్ ఈ-బైక్ (ఎఫ్1 టెక్నాలజీ నుంచి స్ఫూర్తి పొంది తయారు చేసిన ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్).

క్యాటర్‌హామ్ ఆఫర్ చేయనున్న ఈ సాలిడ్, సూపర్ డూపర్ మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

బ్రూటస్ 750

బ్రూటస్ 750

క్యాటర్‌హామ్ తమ బ్రూటస్ 750 బైక్‌ను మోటార్‌సైకిళ్ల యొక్క ఎస్‌యూవీగా అభివర్ణిస్తుంది. ఇది పెద్ద టైర్లతో భారీ రూపాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, కంపెనీ ఇలా చెబుతోంది.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

క్యాటర్‌హామ్ బ్రూటస్ 750 మోటార్‌సైకిల్‌ను స్ట్రీట్ బైక్‌గా, ఆఫ్-రోడ్ మెషీన్‌గా లేదా స్నోమొబైల్‌గా (నాలుగు గంటల కన్నా తక్కువ సమయంలోనే స్నోమొబైల్‌గా మార్చుకోవచ్చు) వాడుకోవచ్చు.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

బ్రూటస్ 750 మోటార్‌సైకిల్‌కు తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. దీని ఇంజన్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ కలిగిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే. దీనిని టూవీల్ ఎస్‍‌యూవీ అనొచ్చు.

క్లాసిక్ ఈ-బైక్

క్లాసిక్ ఈ-బైక్

పురాతన మోటార్‌సైకిల్ డిజైన్‌ను తలపించేలా ఈ క్లాసిక్ ఈ-బైక్‌ను డిజైన్ చేశారు.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

సింగిల్‌ ఛార్జ్‌తో క్లాసిక్ ఈ-బైక్‌పై 40-80 కిలోమీటర్ల రేంజ్ వరకూ ప్రయాణించచ్చు.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

క్యాటర్‌హామ్ క్లాసిక్ ఈ-బైక్‌ను నడపటానికి లైసెన్స్ కూడా అవసరం లేదు (యూరోపియన్ యూనియన్ దేశాల్లో).

కార్బన్ ఈ-బైక్

కార్బన్ ఈ-బైక్

స్వతహాగా ఫార్ములా వన్ కార్ల తయారీలో పాపులర్ అయిన క్యాటర్‌హామ్, ఎఫ్1 టెక్నాలజీ నుంచి స్ఫూర్తి పొంది ఈ కార్బన్ ఈ-బైక్‌ను తయారు చేశారు.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

ఈ క్యాటర్‌హామ్ కార్బన్ ఈ-బైక్‌ ఓ లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్. దీని తయారీలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎఫ్ ఇన్‌పుట్‌ను మరియు పరికరాలను ఉపయోగించనున్నారు.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

ఇదిలా ఉండగా, కొత్తగా ప్రారంభించిన ఈ టూ-వీలర్ డివిజన్ క్యాటర్‌హామ్ ఎఫ్1 టీమ్, క్యాటర్‌హామ్ రేసింగ్ (జిపి2), క్యాటర్‌హామ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, క్యాటర్‌హామ్ కాంపోసైట్స్ మరియు తాజా విభాగం క్యాటర్‌హామ్ మోటో రేసింగ్ బృందాల్లో చేరనుంది.

క్యాటర్‌హామ్ మోటార్‌సైకిల్ విభాగం

కంపెనీ రూపొందించిన ఈ మోటార్‌సైకిళ్లలో క్యాటర్‌హామ్ డిఎన్ఏ స్పష్టంగా కనిపిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2013, 9:10 [IST]
English summary
Caterham Group has today launched its first ever motorcycle division - Caterham Bikes -at the International Motorcycle Exhibition (EICMA) in Milan. Three prototype products - the Brutus 750 (dubbed the ‘SUV of motorcycles’), Classic E-Bike (an all-electric, bike with retro styling) and the Carbon E-Bike (a premium electric bike inspired by F1 technology) - have been unveiled for launch throughout 2014 as part of the Group’s strategy of growth through intelligent partnerships.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+