ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో 'ఫార్ములా ఈ' ఎలక్ట్రిక్ కారు
ఈ కారును చూడగానే మన టక్కుమని ఫార్ములా వన్ రేసింగ్ కారు గుర్తుకు వస్తుంది. అయితే, ఇది ఆషామాషీ ఫార్ములా వన్ కారు కాదు. ఇది సాధారణ ఎఫ్1 రేస్ కార్ల మాదిరిగా లీటర్ల కొద్దీ పెట్రోలును గుటగుటగా మింగేయదు. దీని పేరు 'ఫార్ములా ఈ' (Formula E).
ఫార్ములా ఈ ఒక ఎలక్ట్రిక్ రేసింగ్ కారు. ఇది బ్యాటరీ పవర్‌తో అత్యంత వేగంతో పరుగులు పెడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువననున్న కార్లలో ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ రేస్ కారు కూడా ఉండనుంది.
ఎఫ్ఐఏ ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్‌లో కూడా పెట్రోల్ రేస్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ రేస్ కార్లను ఉపయోగించనున్నారు. ఈ ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌లో కొన్ని ప్రముఖ ఫార్ములా వన్ జట్లు కూడా పాల్గొనున్నాయి.
ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ రేస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫార్ములా ఈ ఛాస్సిస్‌ను రెనో మరియు స్పార్క్ రేసింగ్ టెక్నాలజీస్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

రెనో ఛాస్సిస్ అభివృద్ధిలోనే కాకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంలో కూడా భాగం పంచుకుంది.

ఫార్ములా ఈ రూపకల్పనలో భాగం పంచుకున్న మరొక పెద్ద సంస్థ పేరు మెక్‌లారెన్. ఈ కారులో ఉపయోగించిన 300 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్లను మెక్‌లారెన్ అందించింది.

ఈ సింగిల్ సీటర్ ఫార్ములా ఈ రేస్ కారులో రెగ్యులర్ ఎఫ్ కార్లలో ఉపయోగించే భాగాలనే కాకుండా, అనేక సాంకేతికతలను కూడా ఉపయోగించారు.

ఈ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించనున్న రేస్‌లో మొత్తం 10 బృందాలు పాల్గొననున్నాయి. కాగా.. వీటితో రేస్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే 18 బృందాలు ఆసక్తి చూపినట్లు సమాచారం. ప్రతి బృందంలో ఇద్దరు డ్రైవర్లు (ఎఫ్1 మాదిరిగా) ఉండనున్నారు.

ఇప్పటికే ఈ రేస్ కోసం రెండు బృందాలు ఖరారు అయ్యాయి. అందులో ప్రధానంగా ఇండికార్ రేసింగ్ టీమ్, ఆండ్రెట్టి ఆటోస్పోర్ట్ జట్లు ఉన్నాయి.

ఈ రేసింగ్ సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభమై జూన్ 2015 వరకు నడుస్తుంది. బీజింగ్, బ్యాంకాక్, బ్యూనస్ ఎయిర్స్, లండన్, రోమ్, లాస్ ఏంజిల్స్, మియామి, పుట్రాజయ, రియో డె జానెరియో, బెర్లిన్ ప్రాంతాలలో ఈ రేస్ జరిగే అవకాశం ఉంది.

ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ గురించి కొన్ని వాస్తవాలు
ఫార్ములా ఈ రేసర్లు గరిష్టంగా గంటకు 217 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ రేస్ కార్లను నడపగలరు.

ప్రతి ఎలక్ట్రిక్ రేస్ కారు 25 నిమిషాల పాటు నడుస్తుంది. కానీ ప్రతి రేస్ దాదాపు గంటపాటు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి డ్రైవరుకు రేసుకు రెండు కార్ల చొప్పున ఇస్తారు.

క్వాలిఫైయింగ్, రేస్ డే రెండింటినీ ఒకే రోజున నిర్వహిస్తారు. రెగ్యులర్ ఎఫ్1 రేసులను ప్రాక్టీస్ సెషన్. క్వాలిఫైయింగ్, రేస్ డే అని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.

స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి_01ఈ ఫార్ములా ఈ ఛాస్సిస్‌ను సెప్టెంబ్ 10న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ జీన్ టోడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు.


Click it and Unblock the Notifications








