ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో: 'ఫార్ములా ఈ' ఎలక్ట్రిక్ రేస్ కారు
ఈ కారును చూడగానే మన టక్కుమని ఫార్ములా వన్ రేసింగ్ కారు గుర్తుకు వస్తుంది. అయితే, ఇది ఆషామాషీ ఫార్ములా వన్ కారు కాదు. ఇది సాధారణ ఎఫ్1 రేస్ కార్ల మాదిరిగా కనిపించే ఎలక్ట్రిక్ రేస్ కారు. దీని పేరు 'ఎస్ఆర్‌టి_01ఈ' (SRT_01E). ఇది స్పార్క్-రెనో జట్టుకు చెందినది. అంతేకాదు, ఇది ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి రేస్ కార్ కావటం కూడా విశేషం.
సెప్టెంబర్ నెలలో తొలిసారిగా ప్రారంభం కానున్న 'ఫార్ములా ఈ' (Formula E) అనే ఎలక్ట్రిక్ మోటార్‌స్పోర్ట్ రేస్ కోసం ఈ కారును రూపొందించారు. ఈ రేస్‌లో పాల్గొనే కార్లన్నీ కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచేవే. ఈనెల 10వ తేదీన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఎఫ్ఐఏ ప్రెసిడెంట్ జీన్ టోడ్ట్, ఫార్ములా వన్ సీఈఓ అలెజాండ్రో అగగ్‌లు ఈ కారును ఆవిష్కరించారు.
స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి_01ఈ ఎలక్ట్రిక్ రేస్ కారుకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి_01ఈ ఫుల్లీ-ఎలక్ట్రిక్ సింగిల్-సీటర్ రేస్ కారును స్పార్క్ రేసింగ్ టెక్నాలజీస్ ద్వారా అనేక ఇతర సాంకేతిక భాగస్వామ్యుల సహకారంతో రూపొందించారు.

ఈ కారులో ఉపయోగించిన కార్బన్ మరియు అల్యూమినియం మోనోకాక్ ఛాస్సిస్‌ను ఇటాలియన్ సంస్థ డల్లారా అభివృద్ధి చేసింది. మోటార్‌స్పోర్ట్‌ల కోసం ఛాస్సిస్‌లను అభివృద్ధి చేయటంలో ఈ సంస్థ మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంది. ఎస్ఆర్‌టి_01ఈ ఛాస్సిస్ పూర్తిగా 2014 ఎఫ్ఐఏ సేఫ్టీ నిబంధనలను పాటిస్తుంది.

ఫార్ములా ఈ రేస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ఇతర రేస్ బృందాలలో మెక్‌లారెన్, విలియం గ్రూప్‌లు ప్రధానమైనవి. స్పష్టంగా చెప్పాలంటే, ఈ రెండు సంస్థలకు చెందిన సర్వీసెస్ డివిజన్ మెక్‌లారెన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మరియు విలియం అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్.

మెక్‌లారెన్ ఎలక్ట్రిక్ మోటార్, గేర్‌బాక్స్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను సరఫరా చేస్తుండగా, బ్యాటరీల సరఫరా మరియు బ్యాటరీ మేనేజ్‌మెంట్ సర్వీసులను విలియమ్స్ ఆఫర్ చేస్తుంది.

ఈ సింగిల్ సీటర్ రేస్ కార్లలో ఉపయోగించే బ్యాటరీలు గరిష్టంగా 200 కిలోవాట్ల (270 బిహెచ్‌పిల) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కానీ ఈ బ్యాటరీలు పూర్తి రేస్ వరకు రావు.

ఈ ఎలక్ట్రిక్ కార్లతో నిర్వహించనున్న ఫార్ములా ఈ రేస్‌లో మొత్తం 10 బృందాలు పాల్గొననున్నాయి. ప్రతి బృందంలో ఇద్దరు డ్రైవర్లు (ఎఫ్1 మాదిరిగా) ఉండనున్నారు. గంట పాటు సాగే ఈ రేస్‌లో బ్యాటరీలు ఎక్కువ సేపు ఛార్జ్ ఉండవు కాబట్టి, మధ్యలో డ్రైవర్లు తమ కార్లను మార్చుకుంటుంటారు.

స్పార్క్-రెనో ఎస్ఆర్‌టి_01ఈ ఎలక్ట్రిక్ రేస్ కారులో ఉపయోగించే టైర్లను, ఇందుకు అధీకృత టైర్ భాగస్వామి అయిన మిచెలిన్ సరఫరా చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 18 ఇంచ్ పరిమాణంలో ఉండే ఈ టైర్లు అన్ని ట్రాక్ కండిషన్లకు ఒక్కసారి మాత్రమే ఉపయోగపడే రకానికి చెందినవి.

ఫార్ములా ఈ సాంకేతి భాగస్వామి రెనో సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, పెర్ఫామెన్స్ ఆప్టిమైజేషన్ మరియు పవర్‌ట్రైన్ ఎలక్ట్రికల్ సేఫ్టీని మేనేజ్ చేస్తుంది.

ఈ సింగిల్ సీటర్ ఫార్ములా ఈ రేస్ కారులో రెగ్యులర్ ఎఫ్1 కార్లలో ఉపయోగించే భాగాలనే కాకుండా, అనేక సాంకేతికతలను కూడా ఉపయోగించారు.

ఈ రేసింగ్ సీజన్ సెప్టెంబర్‌లో ప్రారంభమై జూన్ 2015 వరకు నడుస్తుంది. బీజింగ్, బ్యాంకాక్, బ్యూనస్ ఎయిర్స్, లండన్, రోమ్, లాస్ ఏంజిల్స్, మియామి, పుట్రాజయ, రియో డె జానెరియో, బెర్లిన్ ప్రాంతాలలో ఈ రేస్ జరిగే అవకాశం ఉంది.

ఫార్ములా ఈ ఛాంపియన్‌షిప్ గురించి కొన్ని వాస్తవాలు
ఫార్ములా ఈ రేసర్లు గరిష్టంగా గంటకు 217 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రిక్ రేస్ కార్లను నడపగలరు.

ప్రతి ఎలక్ట్రిక్ రేస్ కారు 25 నిమిషాల పాటు నడుస్తుంది. కానీ ప్రతి రేస్ దాదాపు గంటపాటు జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి డ్రైవరుకు రేసుకు రెండు కార్ల చొప్పున ఇస్తారు.

క్వాలిఫైయింగ్, రేస్ డే రెండింటినీ ఒకే రోజున నిర్వహిస్తారు. రెగ్యులర్ ఎఫ్1 రేసులను ప్రాక్టీస్ సెషన్. క్వాలిఫైయింగ్, రేస్ డే అని మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.
వీడియో
ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ రేస్ కారు పనితీరును ఈ వీడియోలో వీక్షించండి.


Click it and Unblock the Notifications








