సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆవిష్కరణ
మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అభివృద్ధి చేస్తున్న 'ఐవి-4' (iV-4) కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ను ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరుగుతున్న 65వ అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది సుజుకి ఎక్స్ఏ ఆల్ఫా మాదిరిగా కాన్సెప్ట్ రూపానికే పరిమితం కాకుండా, అతి త్వరలోనే ఉత్పత్తి దశకు చేరుకోనుంది. ప్రస్తుతం కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని వాహనాలకు గిరాకీ బాగా ఉండటంతో, సుజుకి వీలైనం త్వరగా దీనిని ఉత్పత్తి దశకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది.
సుజుకి గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న జిమ్నీ, గ్రాండ్ విటారా మోడళ్లకు మధ్యలో ప్రవేశపెట్టనున్నారు. దీనిని ఇండియాలో ప్రవేశపెట్టే విషయం గురించి సుజుకి అధికారకంగా ఎలాంటి ప్రకటన చేయలదు, కానీ ఇది ఇండియాలో కూడా విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
సుజుకి ఐవి-4 గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి ఐవి-4 ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీ. ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ కన్నా పెద్దదిగా ఉంటుంది. దీని కొలతలు క్రింది విధంగా ఉన్నాయి:
పొడవు - 4,215 (mm)
వెడల్పు - 1,850 (mm)
ఎత్తు - 1,665 (mm)
వీల్‌బేస్ - 2,500 (mm)
టైర్ సైజు - 235/55R20

'గ్రాబ్ యువర్ ఫీల్డ్' అనే థీమ్‌ను ఆధారంగా చేసుకొని సుజుకి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిజైన్ చేసింది. సాధారణ అర్బన్ క్రాసోవర్‌కు భిన్నంగా రగ్గడ్ అండ్ టఫ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం దీనిని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

ఈ వాహనం పేరుకు తగినట్లుగానే దీని బాడీ క్యారెక్టర్ ఉంటుంది. ఐవి-4 (iV-4) పేరులో ఐ అంటే ఇడివిడ్యువాలిటీ, వి అంటే వెహికల్, 4 అంటే ఫోర్-వీల్ డ్రైవ్ అని అర్థం. ఈ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను సుజుకి ఆల్‌గ్రిప్ టెక్నాలజీతో రూపొందించారు.

స్ట్రైట్, స్లీక్ లైన్స్, క్లామ్‌షెల్ హుడ్, ఫైవ్ స్లాటెడ్ ఫ్రంట్ గ్రిల్, రూఫ్‌పై లేజర్ సెన్సార్లతో కూడిన ఫాగ్ ల్యాంప్స్, ఇల్యుమినేటెడ్ గ్రిల్ వంటి కొన్ని డిజైన్ ఫీచర్లు ఈ సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీలో ప్రత్యేక ఆకర్షణలు.

పర్సనలైజ్డ్ కలర్స్, ఎక్స్టీరియర్స్ మరియు ఎక్స్టీరియర్ పార్ట్‌లతో కస్టమర్లు తమ అభిరుచికి అనుగుణంగా ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీని కస్టమైజ్ చేసుకోవచ్చునని సుజుకి పేర్కొంది.

సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఉత్పత్తి 2015లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇది తొలుత యూరప్ మార్కెట్లోల లభ్యమయ్యే ఆస్కారం ఉంది.


Click it and Unblock the Notifications








