టోక్యో మోటార్ షో 2013: నీటితో నడిచే హోండా కారు
నీటి ఆవిరితో నడిచే కార్లు త్వరలోనే నిజరూపం దాల్చనున్నాయి. వాస్తవానికి ఇది పురాతన కాన్సెప్టే అయినప్పటికీ, మోడ్రన్ టెక్నాలజీతో దీనిని మరింత మెరుగపరచారు. ఇకపై భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ఇంధన నిల్వలు పూర్తిగా ఖాలీ అయిపోయినా బాధ పడాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఫ్రీగా లభించే నీటిని ఉపయోగించుకొని వాహనాలను నడపొచ్చు.
ఈ దిశలో భాగంగా, జపనీస్ కార్ కంపెనీ హోండా ఓ సరికొత్త ఎఫ్‌సిఈవి (ప్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్) కాన్సెప్ట్‌ను రూపొందించిది. ప్రస్తుతం జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న 43వ అంతర్జాతీయ మోటార్ షోలో హోండా ఈ కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. సన్నగా, మోడ్రన్‌గా కనిపించే ఈ హోండా ఎఫ్‌సిఈవి కాన్సెప్ట్ కారు కేవలం కాన్సెప్ట్‌గానే మిగిలిపోకుండా, ఉత్పత్తి దశకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది.
ద్రవరూపంలో ఉండే హైడ్రోజన్ సాయంతో ఇది పనిచేస్తుంది. హోడ్రోజన్ పవర్డ్ కార్లను తయారు చేయటంలో అగ్రగామి అయిన హోండా తమ తొలి ఫ్యూయెల్ సెల్ కారును 1999లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

హోండా ఎఫ్‌సిఈవి 2015లో ఉత్పత్తి దశకు చేరుకోనుంది. తొలతగా ఇది అమెరికా, జపాన్ మార్కెట్లో విడుదలవుతుంది, ఆ తర్వాత యూరప్ మార్కెట్లో విడుదల కానుంది. హోండా తమ ఎఫ్‌సిఈవి మోడల్‌ను పూర్తిస్థాయి ప్రొడక్షన్ మోడల్ ఉత్పత్తి చేస్తుందో లేక తమ ఎఫ్‌సిఎక్స్ క్లారిటీ మాదిరిగా లీజ్ కోసం ఉత్పత్తిని పరిమితం చేస్తుందో వేచి చూడాలి.

హోండా రూపొందించిన ఇదివరకటి హోడ్రోజన్ వాహనాలతో పోల్చుకుంటే, హోండా ఎఫ్‌సిఈవి భిన్నంగా ఉంటుంది. పూర్తింగా ఇంజన్ రూమ్‌లోనే దీని ఫ్యూయెల్ సెల్ పవర్‌ట్రైన్ ఇమిడి ఉండటం ఇందులోని విశిష్టత.

దీని ఫలితంగా కారులో మరింత విశాలమైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఈ హైడ్రోజన్ కారు లోపల ఐదుగులు ప్యాసింజర్లు సౌకర్యంగా కూర్చునే వెసలుబాటు ఉంటుంది.

ఫ్యూయెల్ సెల్ విభాగంలో కూడా హోండా అనేక మార్పులు చేర్పులు చేసింది. దీని సాయంతో 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. అంటే సగటును లీటరు నీటికి 3 కి.వా. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

హోండా ఎఫ్‍సిఈ రేంజ్, రీఫ్యూయెలింగ్ కెపాసిటీలు కూడా ఇందులో ప్రత్యేకమైనవి. ఈ హైడ్రోజన్ కారులో సుమారు 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ కారులోని హైడ్రోజన్ ట్యాంక్‌ను లిక్విడ్ హైడ్రోజన్‌తో నింపొచ్చు.

ఫ్యూయెల్ సెల్ వాహనాల అభివృద్ధిలో తమ సత్తా ఏంటో ఈ కొత్త హోండా ఎఫ్‌సిఈవి చూపిస్తుందని, ఇది కాన్సెప్ట్ కారు అయినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది వాస్తవ రూపం దాల్చుతుందని అమెరికన్ హోండా మోటార్ కో ప్రెసిడెంట్, సీఈఓ టెట్సుయో ఇవామురా చెప్పారు.

ఈ హోండా ఎఫ్‌సిఈవి కాన్సెప్ట్ కారు కేవలం తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూయెల్ సెల్ వాహనాల తయారీలో భాగమే కాకుండా, భవిష్యత్తులోని ఎలక్ట్రిక్ డ్రైవ్ టెక్నాలజీలో మరిన్ని కొత్త విప్లవాలకు నాంది అవుతుందని అమెరికన్ హోండా మోటార్ కో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ అకావిటి అన్నారు.


Click it and Unblock the Notifications








