హోండా వెజెల్ ఎస్‌యూవీ విడుదల: 2014లో భారత్‌కు రాక
ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 2013 టోక్యో మోటార్ షో అనేక కొత్త మోడళ్ల ఆవిష్కరణకు వేదిక కానుంది. భారత మార్కెట్‌కు రానున్న కొన్ని రకాల మోడళ్లను కూడా ఈ షోలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా జపనీస్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కార్పోరేషన్ ప్రొడక్షన్‌కు సిద్దంగా ఉన్న తమ అధునాతన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'హోండా వెజెల్' (Honda Vezel)ను ఆవిష్కరించింది.
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు ధీటుగా హోండా తమ వెజెల్‌ను ప్రవేశపెట్టనుంది. హోండా ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వెర్షన్లతో పాటుగా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఓ హై-అవుట్‌పుట్ ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన హైబ్రిడ్ వేరియంట్‌ను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హోండా వెజెల్ డిజైన్‌ను గమనిస్తే దీనిని ఎస్‌యూవీ, కూపే, మినీ వ్యాన్‌లను కలగపి తయారు చేసినట్లుగా అనిపిస్తుంది. అంటే, ఇది ఎస్‌యూవీ లాంటి లక్షణాలను, కూపే లాంటి లుక్‌ను, మినీ వ్యాన్ లాంటి ఫంక్షనాలిటినీ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా వెజెల్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, సరికొత్త హెడ్‌ల్యాంప్స్, ఆకర్షనీయమైన గ్రిల్, షార్ప్ ఫ్లోటింగ్ బాడీ లైన్స్, స్టయిలిష్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ రియర్ టెయిల్ ల్యాంప్, స్లోపింగ్ రూఫ్ లైన్, సి-పిల్లర్ డోర్ హ్యాండిల్స్ (కొత్త చెవర్లే బీట్ మాదిరిగా), రియర్ రూఫ్ స్పాయిలర్ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు.

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, హోండా వెజెల్‌లో క్యాబిన్ హైక్వాలిటీ కూపే మాదిరిగా అనిపిస్తుంది.

మినీ వ్యాన్ మాదిరి విశాలమైన ఇంటీరియర్ స్పేస్, ఎస్‌యూవీ మాదిరి రగ్గడ్‌తో లుక్‌తో కనిపిస్తుంది. ఇదొక 5-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ.

హోండా వెజెల్‌కు మరిన్ని వివరాలను కంపెనీ వచ్చే నెల 19న వెల్లడించనుంది.

జపాన్ మార్కెట్లో హోండా వెజెల్ డిసెంబర్ 20, 2013వ తేది నుంచి వాణిజ్య పరంగా విక్రయం కానుంది.

ఇదే ఎస్‌యూవీని హోండా భారత మార్కెట్లో కూడా విడుదల చేసే ఆస్కారం ఉంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హోండా తమ వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.

హోండా వెజెల్ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








