2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి
ఈ ఫోటోలలో కనిపిస్తున్న కారును గుర్తుపట్టారా? ఇది కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 'హ్యుందాయ్ ఐ20'. అయితే, ఇది రేస్ కార్ వెర్షన్ ఐ20, అంటే రెగ్యులర్ వెర్షన్ ఐ20 కన్నా విశిష్టమైనది. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ పాల్గొనేందుకు హ్యుందాయ్ ఉరకలు వేస్తోంది.
ఇందుకు గాను ఐ20 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందించిన 'హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి' (వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్)కారును ప్రస్తుతం జెనీవాలో జరుగుతున్న 83వ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది. హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి (Hyundai i20 WRC)ని తొలిసారిగా 2012 ప్యారిస్ మోటార్ షోలో హ్యుందాయ్ ఆవిష్కరించింది. అనంతరం ఈ కారుకు మరిన్ని అదనపు హంగులను చేర్చి తాజాగా జెనీవాలో ప్రదర్శనకు ఉంచుంది.
రేస్ ట్రాక్‌కు సరిపోయేలా ఈ కారుకు కాస్మోటిక్, సస్పెన్షన్, ఏరోడైనమిక్స్ వంటి మార్పులు చేయటమే కాకుండా ఇంజన్ పరంగా కూడా మార్పులు చేయనున్నారు. ప్రస్తుతానికి హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఈ కారుకు సంబంధించిన సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది నాటికి ఇది పూర్తిస్థాయిలో సిద్ధం కావచ్చని తెలుస్తోంది. ఈ కారులో 300 హెచ్‌పి దిగువన శక్తిని ఉత్పత్తి చేసే 1.6 లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని అంచనా.

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

2013 జెనీవా మోటార్ షో: హ్యుందాయ్ ఐ20 డబ్ల్యూఆర్‌సి

Click it and Unblock the Notifications