షాంగైలో అందరినీ స్టన్ చేసిన 'ఐకోనా వొల్కానో' హైబ్రిడ్ కార్
ఇటలీకు చెందిన ప్రముఖ ఆటో డిజైనింగ్ సంస్థ ఐకోనా తమ హైపెర్ఫామెన్స్, హైపర్-రెడ్ 'వొల్కానో' హైబ్రిడ్ కారు చైనాలో జరుగుతున్న 2013 షాంగై ఆటో షోలో ఆవిష్కరించింది. ఇటీవల ముగిసిన 2013 జెనీవా మోటార్ షోలో ఫెరారీ ఆవిష్కరించిన లాఫెరారీ, పోర్షే అందిస్తున్న 918 స్పైడర్ హైబ్రిడ్ కార్ల మాదిరిగానే ఈ ఐకోనా వొల్కానో కూడా అత్యంత శక్తివంతమైన హైబ్రిడ్ కారు. ఐకానో ఇలాంటివి కేవలం 5 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది.
రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన వొల్కానో హైపర్ కారులో హెచ్-తురిస్మో ఫ్రంట్-మౌంటెడ్ వి12 ఇంజన్‌ను, అలాగే ఎలక్ట్రిక్ మోటార్లను అమర్చారు. ఈ రెండింటి ద్వారా ఇది 950 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఐకోనా వొల్కానో గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 3.1 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 9.2 సెకండ్ల వ్యవధిలోనే 0-200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
ఐకోనా వోల్కొనాలో మరొక వేరియంట్ 'హెచ్-కాంపిటీజివన్' ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో ట్విన్ టర్బో వి6 ఇంజన్‌లో లభిస్తుంది. ఇది గరిష్టంగా 550 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు వేరియంట్లు కూడా గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయని కంపెనీ పేర్కొంది. పెర్ఫామెన్స్ విషయంలో హెచ్-కాంపిటీజివన్ వేరియంట్ హెచ్-తురిస్మో వేరియంట్ కన్నా మెరుగ్గా ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని, 8.9 సెకండ్ల వ్యవధిలోనే 0-200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
హెచ్-తురిస్మో పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై ఇది 20 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, హెచ్-కాంపిటీజివన్ పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌పై 30 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణిస్తుంది. ఆంగ్లంలో వోల్కానో అంటే అగ్నిపర్వతం అని అర్థం. అగ్నిపర్వతం నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశారు. మరి ఈ అగ్నిపర్వతం వైపు మనం కూడా ఓ లుక్కేసొద్దాం రండి..!

షాంగై ఆటో షోలో సందడి చేసిన 'ఐకోనా వొల్కానో' హైబ్రిడ్ కార్

Click it and Unblock the Notifications