మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కూపే కాన్సెప్ట్ స్కెచ్‌లు లీక్!

By Ravi

వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న 2013 అంతర్జాతీయ ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో అనేక కొత్త కార్ల ఆవిష్కరణకు వేదికగా మారనుంది. అత్యంత ప్రముఖ అంతర్జాతీయ మోటార్ షోలలో ఒకటైన ఈ ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో దేశ విదేశాలకు చెందిన కార్ల తయారీ కంపెనీలు తమ సరికొత్త ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా కొత్త ఉత్పత్తులతో సిద్ధంగా ఉంది. 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మెర్సిడెస్ బెంజ్ తమ సరికొత్త సి-క్లాస్ కూపే కారును ఆవిష్కరించనుంది. మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కూపేకు సంబంధించిన అఫీషియల్ స్కెచ్‌లను కంపెనీ ఇంటర్నెట్‌లో విడుదల చేసింది. ఒరిజినల్ కారును సెప్టెంబర్ 9న ఆవిష్కరించనుంది.

S Calss Coupe Concept

ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న సిఎల్-క్లాస్ కూపేకు సక్సెసర్‌గా ఈ ఎస్-క్లాస్ కూపే కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు. ఎస్-క్లాస్ లీమోలో ఉపయోగించిన అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఫీచర్లను ఈ ఎస్-క్లాస్ కూపేలోను ఉపయోగించినట్లు సమాచారం. ఈ కాన్సెప్ట్ డిజైన్‌ను బట్టి చూస్తే, ఇది ఎస్-క్లాస్ సెడాన్ కన్నా ఎస్ఎల్ఎస్ ఏఎమ్‌జి డిజైన్‌ను తలపిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ కూపే కాన్సెప్ట్ వివరాల కోసం మనం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మరో వారం రోజుల్లో ఈ కారుకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కానుంది. ఈ ఎస్-క్లాస్ కూపేలో వి8 లేదా వి12 ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఇందులో మరింత శక్తివంతమైన ఏఎమ్‌జి వేరియంట్ కూడా భవిష్యత్తులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Mercedes Benz S Calss Coupe

More from DriveSpark

Article Published On: Saturday, September 7, 2013, 9:41 [IST]
English summary
Soon after sketches of the Mercedes-Benz S-Class coupe concept got leaked on the internet, the automaker has come out with an official image and the revelation that the said car in concept form will indeed debut at the Frankfurt Auto Show next week.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+