బ్యాంకాక్ మోటార్ షోలో మిత్సుబిషి జి4 కాన్సెప్ట్ ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి 2011 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించిన చిన్న కారు మిరాజ్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఓ సరికొత్త కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేసింది. మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ గడచిన సంవత్సరం థాయ్‌లాండ్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తయారు చేసిన సరికొత్త 'మిత్సుబిషి జి4' కాన్సెప్ట్‌ను ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతున్న మోటార్ షోలో కంపెనీ విడుదల చేసింది.
మిత్సుబిషి మిరాజ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇదే గనుక సక్సెస్ అయితే, ఈ మిత్సుబిషి జి4 సెడాన్ కూడా ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. హోండా బ్రయో హ్యాచ్‌బ్యాక్, అమేజ్ సెడాన్‌ల మాదిరిగానే మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్, జి4 సెడాన్‌లను కూడా కంపెనీ ఒకే ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేసింది. మిత్సుబిషి జి4 కాన్సెప్ట్‌ను చిన్నపాటి ఫ్రంట్ గ్రిల్, అధునాతన హెడ్‌లైట్స్, డేటైమ్ రన్నింగ్ ఎల్ఈడి లైట్స్, క్రోమ్ ఫినిషింగ్, విశాలమైన ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో అభివృద్ధి చేశారు.
మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించిన ఇంజన్లనే (1 లీటర్, 1.2 లీటర్) ఈ జి4 సెడాన్‌లోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్లను తక్కువ బరువును కలిగి ఉండి, మెరుగైన మైలేజ్‌ని ఆఫర్ చేస్తాయి. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కలిగిన వేరియంట్ కూడా లభించే అవకాశం ఉంది. మైలేజ్‌ను పెంచేందుకోసం ఇందులో ఆటో స్టార్ట్, ఆటో స్టాప్ ఆప్షన్ కూడా ఉండనుంది. మరి మిత్సుబిషి మరాజ్ బిగ్ బ్రదర్ మిత్సుబిషి జి4 సెడాన్‌పై ఓ లుక్కేసొద్దాం రండి..!

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్

మిత్సుబిషి జి4 కాన్సెప్ట్



Click it and Unblock the Notifications








