వెస్పా ఎల్ఎక్స్ మోడళ్లను రీప్లేస్ చేసేందుకు వెస్పా ప్రైమావెరా

By Ravi

ఇటాలియన్ టూవీలర్ మేకర్ వెస్పా తమ క్లాసిక్ స్టైల్ స్కూటర్లకు మోడ్రన్ స్టయిల్ జోడించి, ప్రీమియం లైఫ్ స్టైల్ స్కూటర్ సెగ్మెంట్లో మంచి ప్రజాదరణను సొంతం చేసుకున్న సంగతి తెలిసినదే. వెస్పా తాజాగా మరో స్కూటర్‌ను ఆవిష్కరించింది.

పురాతన క్లాసిక్ డిజైన్‌కు నేటి ఆధునికతను జోడించి అభివృద్ధి చేసిన '2014 వెస్పా ప్రైమావెరా' (2014 Vespa Primavera) మోడల్‌ను మిలాన్‌లో జరుగుతున్న ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్‌లో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

ప్రపంచ వ్యాప్తంగా వెస్పా అందిస్తున్న ఎల్ఎక్స్ మోడళ్లను ఈ కొత్త 2014 ప్రైమావెరా మోడళ్లతో రీప్లేస్ చేయనుంది. మనదేశంలో కూడా వెస్పా అందిస్తున్న ఎల్ఎక్స్/విఎక్స్ మోడళ్లను ఈ కొత్త మోడల్‌తో రీప్లేస్ చేయటం లేదా దీనిని అలాగనే ఓ సరికొత్త మోడల్‌గా విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ కొత్త వెస్పా స్కూటర్‌కు సంబంధించిన వివరాలేంటో తెలుసుకుందాం రండి..!

వెస్పా ప్రైమావెరా స్కూటర్

ఇటాలియన్ భాషలో ప్రైమావెరా అంటే వసంత రుతువు అని అర్థం. వెస్పాకు ఈ పేరు కొత్తదేమీ కాదు. 1968లో తయారు చేసిన వెస్పా స్కూటర్లకు ఈ పేరును ఉపయోగించారు.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

కొత్త వెస్పా ప్రైమావెరా స్కూటర్‌ను మూడు ఇంజన్ వేరియంట్లలో (50సీసీ, 125సీసీ, 150సీసీ) విడుదల చేయనున్నారు. 50సీసీ ఇంజన్ వేరియంట్ టూ-స్ట్రోక్, త్రీ-స్ట్రోక్ వేరియంట్లతో లభిస్తుంది.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

వెస్పా తమ ప్రైమావెరా స్కూటర్ లీటరుకు 64 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని పేర్కొంది. అయితే, ఏ ఇంజన్ వేరియంట్ అనేది మాత్రం స్పష్టం చేయలేదు. బహుశా అది 50సీసీ ఇంజన్ వేరియంట్ అయి ఉండొచ్చని మా అంచనా.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

కొత్త 2014 వెస్పా ప్రైమావెరా డిజైన్‌ను గమనిస్తే, ఇందులో కొన్ని ఎల్ఎక్స్ మోడల్ డిజైన్ ఫీచర్లు కనిపిస్తాయి. ఉదాహరణకు స్కూటర్ బేసిక్ ఫ్రంట్ డిజైన్. అలాగే, వెస్పా 946 స్కూటర్ నుంచి స్పూర్తి పొంది కూడా దీనిని డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

రీడిజైన్ చేయబడిన సీట్, ఎగ్జాస్ట్ మఫ్లర్, ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ మొదలైన డిజైన్ మార్పులను కొత్త వెస్పా ప్రైమావెరాలో చూడొచ్చు. ఇందులో సీట్ క్రింద స్టోరేజ్ స్పేస్‌ను కూడా పెంచారు.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

సమర్థవంతమైన బ్రేకింగ్ ఎక్స్‌పీరెయన్స్ కోసం వెస్పా ప్రైమావెరా 2014 ముందు వైపు 200 మి.మీ. డిస్క్ బ్రేక్స్‌ను జోడించారు.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

కొత్త 2014 వెస్పా ప్రైమావెరా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే, ఇది డిజిటల్ మరియు అనలాగ్ మీటర్లను కలిగి ఉంటుంది.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

కొత్త వెస్పా ప్రైమావెరా స్కూటర్ 2014 భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌‌పోలో పియాజ్జియో ఈ స్కూటర్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది.

వెస్పా ప్రైమావెరా స్కూటర్‌

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Vespa has reached into its rich past to resurrect a name for a modern scooter. That name is Primavera or ‘Spring' in Italian. The 2014 Vespa Primavera is a mixture of classic design and modernity, as is always the case with Vespa scooters. 2014 Vespa Primavera unveiled at the 2013 EICMA show in Milan, Italy will make its way around the globe where it will replace the Vespa LX models. 
Story first published: Saturday, November 9, 2013, 16:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X