కొత్త గోల్ఫ్ జిటిఐ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన ఫోక్స్‌వ్యాగన్
జర్మన్ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తమ అధునాత 496 బిహెచ్‌పి వెర్షన్, సెవన్త్ జనరేషన్ గోల్ఫ్ జిటిఐ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. ఫోక్స్‌వ్యాగన్ డిజైన్ విజన్ జిటిఐగా పిలిచే ఈ కాన్సెప్ట్ కారులో ట్విన్-టర్బోఛార్జ్‌డ్ 3.0 లీటర్ విఆర్6 ఇంజన్‌ను ఉపయోగించారు. పాపులర్ ఫోక్స్‌వ్యాగన్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో రానున్న గోల్ఫ్ జిటిఐ వంటి మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తారు.
భవిష్యత్తులో ఫోక్స్‌వ్యాగన్ నుంచి రానున్న ఎంపిక చేసిన మోడళ్లలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న డైరెక్ట్ ఇంజక్షన్ సిస్టమ్‌ను రీప్లేస్ చేస్తూ గోల్ఫ్ జిటిఐ టర్బోఛార్జ్‌డ్ 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించే ఆస్కారం ఉంది. ఈ ఇంజన్ సామర్థ్యాన్ని దాదాపు 129 శాతం (279 బిహెచ్‌పిల నుంచి 496 బిహెచ్‌పిలకు) పెంచారు. అలాగే టార్క్‌ను అధికంగా 21.4 కెజిఎమ్‌లను పెంచారు (35.7 కెజిఎమ్‌ల నుంచి 57.1 కెజిఎమ్‌లకు).
ఈ విఆర్6 ఇంజన్‌కు సంబంధించి మరిన్ని వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్టాండర్డ్ గోల్ఫ్ జిటిఐ ఫ్రంట్ వీల్ డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉండే ఈ విజన్ జిటిఐ మాత్రం మల్టీ-ప్లేట్ క్లచ్‌ను ఉపయోగించుకొని ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో లభిస్తుంది. దీని ఫలితంగా ఇది కేవలం 3.9 సెకండ్ల సమయంలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ పెర్ఫామెన్స్ ఇంచు మించు బుగాటి, ఫెరారీ వంటి సూపర్ కార్ల పెర్ఫామెన్స్‌తో సమానమని చెప్పవచ్చు.
స్టాండర్డ్ వెర్షన్ గోల్ఫ్ జిటిఐతో పోల్చుకుంటే డిజైన్ విజన్ జిటిఐ గరిష్ట వేగాన్ని అదనంగా 61 కిలోమీటర్లు పెంచారు. దీని ప్రస్తుత గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. మరి కాన్సెప్ట్‌పై ఓ కన్నేద్దాం రండి..!

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ

ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ డిజైన్ విజన్ జిటిఐ



Click it and Unblock the Notifications








