కాన్సెప్ట్ నుంచి రియాల్టీకి.. లెక్సస్ ఆర్‌సి కూపే
టొయోటాకు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ గతంలో ఓ ఆటో షోలో ఆవిష్కరించిన లెక్సస్ ఆర్‌సి కూపే కాన్సెప్ట్ కారు ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ప్రొడక్షన్ వెర్షన్ లెక్సస్ ఆర్‌సి కూపే కారును ఈనెల 20న జరగనున్న టోక్యో మోటార్ షోలో కంపెనీ విడుదల చేయనుంది.
ఈ కారు మొత్తం రెండు వెర్షన్లలో లభ్యం కానుంది అందులో 3.5 లీటర్ వి6 ఇంజన్ కలిగిన ఆర్‌సి 350, మరొకటి 2.5 లీటర్ ఇంజన్ కలిగి ఆర్‌సి 300హెచ్ హైబ్రిడ్ కారు. లెక్సస్ తమ కార్లకు ఎమోషన్ అప్పీల్‌ను ఇవ్వాలనుకోవటానికి ఈ కొత్త ఆర్‌సి జీవం పోసినట్లు అనిపిస్తుంది.
మరి ఈ లెక్సస్ ఆర్‌సి కూపే కార్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

ఫ్రంట్ డిజైన్
ఆకర్షనీయమైన స్పిండల్ గ్రిల్, ట్రయాంగిల్ హెడ్‌ల్యాంప్స్ (త్రీ-ల్యాంప్ ఎల్ఈడి కాన్ఫిగరేషన్)తో ఇది ముందు వైపు నుంచి ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.

రియర్ డిజైన్
వెనుక వైపు షార్ప్ అండ్ థిన్ అప్పీరెన్స్ కోసం డిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఇందులో ఎల్ఈడి బ్రేక్ లైట్లు ఎల్ ఆకారంలో వెలుగుతూ లెక్సస్ బ్రాండ్‌ను ప్రతిభింభింపజేస్తాయి.

ఇతర ఫీచర్లు
ఇంకా 10-స్పోక్ 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, అలాగే 5-స్పోక్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది రెడ్ కలర్‌లో లభిస్తుంది. దీని పొడవు 4695 మి.మీ., వెడల్పు 1840 మి.మీ., ఎత్తు 1395 మి.మీ. మరియు వీల్‌బేస్ 2730 మి.మీ.

ఇంటీరియర్ ఫీచర్లు
నలుగురు ప్రయాణికులు హాయిగా కూర్చుని ప్రయాణించేలా అత్యంత విలాసలంతమైన ఫీచర్లతో దీనిని ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. లెక్సస్ ఆర్‌సి కూపే కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈనెల 20వ తేది నుండి ప్రారంభం కానున్న 2013 టోక్యో మోటార్ షోలో కంపెనీ వెల్లడించే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








