అట్టహాసంగా జరగనున్న '2023 ఆటో ఎక్స్‌పో'.. పాల్గొనే దేశాలు & కంపెనీలు
సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు మరో కొన్ని రోజులలో '2023 ఆటో ఎక్స్‌పో' అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ 'ఆటో ఎక్స్‌పో'లో ఇందులో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఇందులో పాల్గొనటానికి సిద్దమైపోతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
నివేదికల ప్రకారం, ఈ 16 వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో జనవరి 12 నుంచి 15 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరగనున్నట్లు మరియు ఇందులో దాదాపు 15 దేశాలకు చెందిన 800 కంపెనీలు ఈ ఏడాది ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయని 'ఆటోమోటీవ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చురీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (ACMA) తెలిపింది. 2020 తరువాత జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్‌లో అనేక కొత్త ఉత్పత్తులు మరియు కొత్త మోడల్స్ కనిపించనున్నాయి.

ఈ నెల జనవరిలో జరగనున్న '2023 ఆటో ఎక్స్‌పో' ను ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఇందులో పెట్రోల్ మోడల్స్, ఎలక్ట్రిక్ మోడల్స్ మొదలైనవన్నీ కూడా దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ తో చూడచక్కగా ఉంటాయి.
'టెక్నోవేషన్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్స్' థీమ్ తో నడిచే ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్, ఇన్నోవేషన్ అండ్ స్టార్ట్-అప్స్, ఏసీఎంఏ సేఫ్ డ్రైవ్స్, ఆర్ఈఏ, గుజరాత్ స్టేట్ పెవిలియన్ వంటి వాటిపై దృష్టి సారించే పెవిలియన్లు ఉండనున్నాయి. అయితే ఈ కాంపోనెంట్స్ షో మునుపటి ఎడిషన్స్ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది దాదాపు 60,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది.
త్వరలో జరగనున్న ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, పోలాండ్, దక్షిణ కొరియా, యూకే వంటి 15 దేశాలకు చెందిన 800 కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో ఆరు దేశాల పెవిలియన్లు ప్రదర్శించబడతాయి. ఈ ఏడాది చైనా పాల్గొనే అవకాశం లేకపోవడం గమనార్హం. ఈ ఆటో ఎక్స్‌పోలో చాలా రోజులు వ్యాపార సిబ్బందికి కేటాయించబడినప్పటికీ, సాధారణ ప్రజల సందర్శనార్థం 15 న 13:30 నుండి 17:00 వరకు సమయం కేటాయించబడి ఉంటుంది.
2023 ఆటో ఎక్స్‌పోలో 40 కి పైగా దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియాతో సహా దాదాపు ఒక లక్ష మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉంది. 2023 ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్స్ 16 వ ఎడిషన్ బాగా రూపుదిద్దుకున్నందుకు చాలా సంతోషంగా ఏసీఎంఏ ప్రెసిడెంట్, సోనా కామ్ స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ అన్నారు. 800 కంపెనీలు ఈ నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం చేయనున్నాయి.
ఫ్యూచర్ మొబిలిటీ అండ్ బ్యాటరీ స్టోరేజీపై సిఐఐ నేషనల్ కమిటీ చైర్మన్ విపిన్ సోంధి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఆటోమోటివ్ ఎకో సిస్టమ్ లో గణనీయమైన మార్పులు ఏర్పడ్డాయి. కావున 2023 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎడిఎఎస్, బయోఫ్యూయెల్ & ఫ్లెక్స్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజిన్ టెక్నాలజీలు, వెహికల్ సేఫ్టీ టెక్నాలజీ మొదలైనవన్నీ కూడా ఇక్కడ ప్రతి బింబిస్తాయి. ఇవన్నీ కూడా ఆధునికతను తెలియజేస్తాయి.
త్వరలో జరగనున్న ఈ '2023 ఆటో ఎక్స్‌పో' లో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న అనేక కొత్త కొత్త ఉత్పత్తులు అడుగుపెట్టనున్నాయి. 2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే ఆధునిక వాహనాలను (బైకులు, కార్లను మరియు ఇతర వాహనాలు) గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి. ఆటో ఎక్స్‌పో లో విడుదలయ్యే వాహనాలు గురించి మీకు కావాల్సిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








