ప్రభాస్‌ సూపర్‌ లగ్జరీ కారు కలర్‌ ఛేంజ్‌.. మతి పోగొడుతున్న కొత్త లుక్‌..!

పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. ఇటీవల విడుదలైన సలార్‌ భారీ విజయంతో ఫుల్‌ జోష్‌తో ఉన్నాడు. ప్రాజెక్ట్‌ K షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. డార్లింగ్‌ గ్యారేజ్‌లో ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. కాగా ప్రభాస్‌కు చెందిన ఓ లగ్జరీ కారు గురించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది.

డార్లింగ్‌ ప్రభాస్‌ 2021లో రూ. 5.8 కోట్ల విలువైన సరికొత్త లంబోర్ఘిని అవెంటడార్ S రోడ్‌స్టర్ సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిదే. ఈ సూపర్‌ కారు పూర్తిగా ఆరెంజ్ కలర్‌లో ఫినిష్‌ అయి ఉండగా.. ఇటీవల ప్రభాస్‌ తన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌ను శాటిన్ బ్లాక్ కలర్‌లోకి మార్చినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Prabhas-Lamborghini-Aventador-S-Roadster

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలను పరిశీలిస్తే.. ప్రభాస్‌కు చెందిన సరికొత్త Lamborghini Aventador S రోడ్‌స్టర్ U-టర్న్ తీసుకోవడాన్ని చూడవచ్చు. ఈ కారు శాటిన్‌ బ్లాక్‌ కలర్‌లో కనిపిస్తుంది. ఇంతకు ముందు ఈ కారు అరాన్సియో అట్లాస్ క్లాస్సీ షేడ్‌లో ఆకర్షణీయంగా ఉండేది. కాగా ఇప్పుడు ఈ సరికొత్త కలర్ ఆప్షన్ కోసం ప్రభాస్ అదనంగా చెల్లించాడనే దానిపై సమాచారం అందుబాటులో లేదు.

అయితే అవెంటడార్ SV (సూపర్ వెలోస్) లాంచ్ తర్వాత లంబోర్ఘిని అవెంటడార్ S రోడ్‌స్టర్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ మోడల్‌ను స్టాండర్డ్‌ Aventador యొక్క ఫేస్‌లిఫ్ట్‌గా పరిగణించబడుతుంది. అయితే ఇందులోని చాలా ఫీచర్లు.. లిమిటెడ్‌ ఎడిషన్ ట్రాక్-ఫోకస్డ్ SV మోడల్ నుండి తీసుకున్నారు. కాగా ప్రభాస్‌ వద్ద ఉన్న అవెంటడార్ S రోడ్‌స్టర్ వేరియంట్ ఓపెన్‌ రూఫ్‌టాప్‌తో కూడా వస్తుంది.

Prabhas-Lamborghini-Aventador-S-Roadster

ప్రభాస్‌ కొనుగోలు చేసిన లంబోర్ఘిని అవెంటడార్ S రోడ్‌స్టర్ భారీ నేచురల్లీ అస్పిరేటెడ్‌ V12 పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇందులోని ప్రత్యేకతలేంటంటే. 6.5-లీటర్ V12 ఇంజిన్. ఇది గరిష్ఠంగా 740 hp పవర్ అవుట్‌పుట్ మరియు 690 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Prabhas-Lamborghini-Aventador-S-Roadster

మొత్తం నాలుగు చక్రాలకు సింగిల్-క్లచ్ 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తి సరఫరా అవుతుంది. Aventador రోడ్‌స్టర్ గరిష్ఠంగా 300 kmph వేగాన్ని అందుకుంటుంది. కేవలం 9 సెకన్లలో 0 నుండి 200 కి.మీ వేగానికి చేరుకుంటుంది. ప్రభాస్‌కు అత్యంత ఇష్టమైన కార్లలో ఈ కారు కూడా ఒకటి.

వీటితో పాటు ప్రభాస్ మరికొన్ని ప్రముఖ లగ్జరీ కార్లను కలిగి ఉన్నాడు. వాటిలో ఒకటి ఏడవ తరానికి చెందిన అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్. ఈ కారు ముత్యాల తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. 6.75-లీటర్ V12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

Prabhas-Lamborghini-Aventador-S-Roadster

ఈ భారీ V12 ఇంజిన్ గరిష్ఠంగా 460 PS శక్తిని మరియు 720 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది క్లౌడ్ లాంటి హ్యాండ్లింగ్‌కు బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా జాగ్వార్ XJL లగ్జరీ సెడాన్ ఇంకా ఓల్డ్‌ జెన్‌ BMW X5ని కూడా ప్రభాస్‌ గ్యారేజ్‌లో చూడవచ్చు. వీటితో పాటు డార్లింగ్‌ శాంటోరిని బ్లాక్ నాల్గవ తరం లాంగ్-వీల్‌బేస్ రేంజ్ రోవర్‌ను కలిగి ఉన్నాడు.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 15:10 [IST]
English summary
Prabhass lamborghini aventador s roadster super luxury car wrapped with satin black
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+