హైబ్రిడ్ కాన్సెప్ట్ స్కూటర్‌ను ఆవిష్కరించిన హీరో మోటోకార్ప్
ప్రపంచపు నెంబర్ వన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (గతంలో హీరో హోండా) ఓ సరికొత్త హైబ్రిడ్ కాన్సెప్ట్ స్కూటర్‌ను దేశీయ వినియోగదారులకు పరిచయం చేసింది. ఇటు బ్యాటరీ పవర్‌తోనూ అటు పెట్రోల్ ఇంజన్‌తోనూ పనిచేసే "లీప్" అనే కాన్సెప్ట్ హైబ్రిడ్ స్కూటర్‌ను హీరో మోటోకార్ప్ అధినేత పవన్ ముంజాల్ భారత మార్కెట్లో ఆవిష్కరించారు.

న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ లీప్ హైబ్రిడ్ కాన్సెప్ట్ స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచింది. దీనితోపాటుగా కంపెనీ అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. కాగా.. లీప్ హైబ్రిడ్ స్కూటర్‌ను వాణిజ్యపరంగా ఎప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చేది, ధర మరియు ఇతర సాంకేతిక వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








