హైడ్రోజన్‌తో నడిచే ఆటోరిక్షాను ఆవిష్కరించిన మహీంద్రా
దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా హైడ్రోజన్‌తో నడిచే త్రిచక్ర వాహనం 'హైఆల్ఫా'ను ఆవిష్కరించింది. ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ తమ హై ఆల్ఫా ఆటోరిక్షాను ప్రదర్శిచింది.

ప్రస్తుతం ఈ హై ఆల్ఫా ఆటోనూ ప్రగతి మైదాన్‌లో పరీక్షిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఓ హైడ్రోజన్ రీఫ్యూయలింగ్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశామని కంపెనీ పేర్కొంది. ఇండియా ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రమోషన్ (ఐటిపిఒ) ఆధ్వర్యంలో ఈ ఆటోలను పైలట్ ప్రాజెక్టుగా నడిపిస్తున్నారు.
ఐక్య రాజ్య సమితి పారిశ్రామికాభివృద్ది సంస్థ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రోజన్ ఎనర్జీ టెక్నాలజీస్, మహీంద్ర అండ్ మహీంద్రా, ఐఐటి-ఢిల్లీ మరియు కేంద్ర ప్రత్యామ్నాయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖల సహకారంతో హైఅల్ఫాకు రూపకల్పన చేయడం జరిగింది.
ఈ వాహనంలో ఉపయోగించే హైడ్రోజన్ కారణంగా పర్యావరణానికి హాని కలిగించేటటువంటి కర్బన ఉద్గారాలు వెలువడవని మహీంద్ర అండ్ మహీంద్ర అధ్యక్షుడు (ఆటోమోటివ్ విభాగం) పవన్ గోయెంకా తెలిపారు. దీని ధర సిఎన్‌జి వేరియంట్ త్రీవీలర్ ధర కన్నా రూ.20-25 వేలు అధికంగా వుంటుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








