కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ "పల్స్"ని విడుదల చేసిన రీనాల్ట్

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రీనాల్ట్ భారతీయ వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా రూపొందించిన చిన్న (కాంపాక్ట్) కారు "రీనాల్ట్ పల్స్"ను కంపెనీ దేశీయ విపణిలో అధికారికంగా విడుదల చేసింది. రీనాల్ట్ పల్స్ హ్యాచ్‌బ్యాక్ విడుదలకు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటో ఎక్స్‌పోలో ఒకటైన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోను కంపెనీ వేదికగా ఎంచుకుంది.

ప్రస్తుతం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 11వ అంతర్జాతీయ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రీనాల్ట్ తమ పల్స్ కారును అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ బుజ్జి కారు డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుందని, బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. గడచిన అక్టోబర్ నెలలో భారత్‌లో తొలిసారిగా జరిగిన ఫార్ములా వన్ రేస్ ఇండియన్ గ్రాండ్ ప్రిలో పల్స్ కారును రీనాల్ట్ ఆవిష్కరించింది.

ప్రస్తుతం రీనాల్ట్ పల్స్ చిన్న కారును చెన్నైలోని ఓరగడంలో ఉన్న రీనాల్ట్-నిస్సాన్ ప్లాంటులో అభివృద్ధి చేస్తున్నారు. జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ అందిస్తున్న మైక్రా ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే పల్స్ కారును కూడా రూపొందించడం జరిగింది. అయితే, ప్రస్తుతానికి రీనాల్ట్ పల్స్ కేవలం డీజిల్ వేరియంట్లో మాత్రమే లభ్యమవుతుందని, దేశీయ విపణిలో దీని ధరలు రూ.5.77 లక్షల నుండి 6.25 మధ్య ఉన్నట్లు రీనాల్ట్ ఇండియా వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Saturday, January 7, 2012, 1:17 [IST]
English summary
Renault has just launched its cheapest model till date in INdia, the Pulse hatchback at the Delhi Auto Expo. Priced at Rs.5.77 lakhs for the entry level variant, the Pulse is now available only with a diesel engine.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+