సరికొత్త 'సఫారీ స్టోర్మ్'ని ఆవిష్కరించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సఫారీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)లో ఓ సరికొత్త వేరియంట్ "సఫారీ స్టోర్మ్" ఎట్టకేలకు తన పరదాలను తొలగించుకుంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న 2012 ఆటో ఎక్స్‌పోలో టాటా సంస్థల అధినేత రతన్ టాటా మరియు ఆయన వారసుడు సైరస్ మిస్త్రీలు సరికొత్త సఫారీ ఎస్‌యూవీని ఆవిష్కరించారు.

సరికొత్త స్టయిల్‌, ఫీచర్లతో వస్తున్న కొత్త సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కలిగి ఉండి, 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 140 పిఎశ్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. సరికొత్త గ్రిల్, క్రోమ్ కోటింగ్ చేయబడిన ఎగ్జాస్ట్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఎన్నో మార్పులు కొత్త సఫారీ సొంతం.

అంతేకాకుండా కొత్త సఫారీ స్ట్రోమ్‌ ఇంటీరియర్లలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, కొత్త విలాసవంతమైన బీజ్ సీట్స్, సీట్ కలర్‌కి సరిపోయే విధంగా రూపొందింటిన స్టీరింగ్ వీల్ లెథర్ కవర్, వుడ్ ఫినిష్డ్ డ్యాష్‌బోర్డ్ అండ్ డోర్ ట్రిమ్స్ వంటి మరోన్నో సదుపాయాలు కొత్త సఫారీ స్టోర్మ్ సొంతం. త్వరలోనే ఈ కొత్త సఫారీ వాణిజ్య పరంగా మార్కెట్లో లభ్యం కానుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2012, 17:01 [IST]
English summary
Auto major Tata Motors has unveiled its all-new Safari Storme at the 11th International Auto Expo at Pragathi maidan, New Delhi. The new Safari Storme powered with a 2.2-liter 16-valve common rail (DiCOR) engine, mated with a 5-speed manual transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+