2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ డేవిడ్సన్ కొన్ని సంవత్సరాల నుండి సాఫ్టెయిల్ మోడళ్లను తరచూ అప్‌డేట్ చేస్తూ వచ్చింది. అందులో ఒకటి 2018 స్ట్రీట్ బాబ్. దీనిని టెస్ట్ రైడ్ చేసి, దీని గురించి మా అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు హ

By Anil Kumar

సాఫ్టెయిల్ అనేది మోటార్ సైకిల్, ఇందులో వెనుక సస్పెన్షన్ సిస్టమ్ సరిగ్గా రైడర్ సీటు క్రింది అందివ్వబడి ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఎందుకని అనుకుంటున్నారా...?

ఇటీవల మేము టెస్ట్ డ్రైవ్ చేసిన సరికొత్త 2018 హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ బైక్‌ను హ్యార్లీ 2018 సాఫ్టెయిల్ ప్రొడక్ట్ కెటగిరీ క్రిందకు చేర్చింది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ డేవిడ్సన్ యొక్క మొట్టమొదటి సాఫ్ట్‌టెయిల్ FXST, దీనిని తొలుత 1984లో పరిచయం చేసింది. ఈ మోడల్ అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా హ్యార్లీ-డేవిడ్సన్‌కు వెన్నెముకగా నిలిచింది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ డేవిడ్సన్ కొన్ని సంవత్సరాల నుండి సాఫ్టెయిల్ మోడళ్లను తరచూ అప్‌డేట్ చేస్తూ వచ్చింది. అందులో ఒకటి 2018 స్ట్రీట్ బాబ్. దీనిని టెస్ట్ రైడ్ చేసి, దీని గురించి మా అనుభవాలను పాఠకులతో పంచుకునేందుకు హ్యార్లీ డేవిడ్సన్ డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

డిజైన్ మరియు ఫీచర్లు

దీని స్ట్రిప్డ్ డౌన్ డిజైన్ కారణంగా తొలి చూపులోనే ప్రతి ఒక్కరూ దీనిని కస్టమ్ బిల్ట్ మోటార్ సైకిల్ అనుకుంటారు. చూడటానికి భారీ పరిమాణంలో ఉంటుంది. అయితే, ఇందులో ఉన్న ఎత్తైన హ్యండిల్ బార్ కారణంగా మరింత పెద్దదిగా కనిపిస్తుంది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ బైకులో అధునాతన సాఫ్టెయిల్ ట్యూబులర్ ఫ్రేమ్ ఉంది. మునుపటి సాఫ్టెయిల్ మరియు డైనా మోడళ్లతో పోల్చుకుంటే ఈ ఫ్రేమ్ తేలికగా మరియు మరింత ధృడంగా ఉంది. స్వింగ్ ఆర్మ్ డిజైన్ కారణంగా చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ బైకులో ముందు వైపున డ్యూయల్ బెండింగ్ వాల్వ్స్ గల షోవా ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి మరియు వెనుక వైపున మెకానికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న మోనోషాక్ అబ్జార్వర్లను కంటికి కనిపించకుండా చాలా చక్కగా సీటు క్రిందకు అమర్చేశారు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

స్ట్రీట్ బాబ్ సాఫ్టెయిల్ బైకులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న సరికొత్త ఎల్ఇడి హెడ్‌లైట్ క్లస్టర్ ఫ్రంట్ ఫోర్క్స్ మధ్య ఫిక్స్ చేశారు. హెడ్‌ల్యాంప్ మీద చిన్న పరిమాణంలో ఉన్న ఎల్‌సిడి స్క్రీన్ అందివ్వడం జరిగింది. పగటి పూట ప్రకాశవంతమైన వెలుగులో కూడా ఈ డిస్ల్పేలో బైకు గురించిన సమాచారాన్ని చదవచ్చు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

స్క్రీన్ మీద మొదట స్పీడ్, ఫ్యూయల్ లెవల్స్ మరియు గేర్ పొజిషన్ వంటి వివరాలను గమనించవచ్చు. హ్యాండిల్‌బార్‌కు ఎడమవైపున ఉన్న బటన్‌లను ఉపయోగించి మెనూలో క్రిందకు వెళితే ఓడో మీటర్, ట్రిప్ మీటర్ మరియు టాకో మీటర్ వివరాలను డిస్ల్పే చేస్తుంది. ఈ బైకులో కీలెస్ ఇగ్నిషన్ మరియు యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

కన్నీటి బిందువు రూపంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్, ఆలివ్ గోల్డ్ కలర్‌లో బైకు ఓవరాల్ డిజైన్‌లో ప్రధాన హైలెట్‌గా నిలిచింది. నెమ్మదిగా వెళ్లే రైడింగ్ పొజిషన్‌లో మంచి లుక్ కనబరుస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ అంచును మరియు సింగల్ సీటును అద్భుతంగా జోడించారు. బకెట్ తరహా రైడర్ సీట్ రైడర్‌కు మరింత సౌకర్యాన్నిస్తుంది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

నిరాశపరిచిన అంశం ఏమిటంటే... హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ సాఫ్టెయిల్ బైకులో సింగల్ సీట్ మాత్రమే ఉంది. నిజానికి ఇది బాబర్ శైలిని ప్రతిబింబిస్తుంది, కానీ రియల్ లైఫ్ విషయానికి వస్తే లక్షలు పోసి కొనుగోలు చేసే బైకులో ఒక్కటే సీటు ఉండటం ఒకరకంగా బాధాకరం. అయితే, ఇతర యాక్ససరీలు మంచి లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ సాఫ్టెయిల్ బైకులో డ్యూయల్-కౌంటర్‌బ్యాలెన్సెంగ్ ఉన్న మిల్వాకీ 8, 1750సీసీ కెపాసిటి గల వి-ట్విన్ ఇంజన్ కలదు. ఎప్పటిలాగే హ్యార్లీ డేవిడ్సన్ దీని పవర్ వివరాలను వెల్లడించలేదు. కానీ, రైడ్ చేస్తున్నపుడు 1900ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్దనే 140ఎన్ఎమ్‌ కంటే పైగానే టార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇంజన్‌కు మృదువుగా గేర్లు మారగలిగే 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

ఇందులో 5,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద రెడ్ లైన్ ఉంటుంది. కానీ, ఈ లిమిట్ రైడర్‌ను అస్సలు ఆపలేదు. ఏ గేర్ అయినా... ఏ స్పీడ్ అయినా... ఎలాంటి సందర్భమైనా యాక్సిలరేషన్ చేసేకొద్దీ గర్జిస్తూ రోడ్లను అధిగమిస్తుంది. గంటకు 200కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

శక్తివంతమైన భారీ ఇంజన్ ఉంది కాబట్టి ప్రతి రైడర్ అత్యధిక పవర్ మరియు టార్క్ ఆశిస్తాడు. దీనికి తగ్గట్లుగానే ఎన్నో అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటాయని భావిస్తారు. కానీ, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మినహాయిస్తే మరెలాంటి ఫీచర్లు రాలేదు.

హ్యార్లీ తమ బైకుల్లో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందివ్వదనే సంగతి తెలిసిందే... కానీ, ఇలాంటి కొత్త మోడళ్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అందివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ సాఫ్టెయిల్ మొత్త బరువు 300కిలోలుగా ఉంది. బరువు భారీగా అనిపించినప్పటికీ బ్యాలెన్సింగ్ అద్భుతంగా ఉంది. దీంతో హెవీ ట్రాఫిక్‌లో కూడా సునాయసంగా హ్యాండిల్ చేయవచ్చు. బరువు ఎక్కువగా ఉండటంతో మలుపుల్లో చాలా సులభంగా క్రిందకు వంగుతుంది. అయితే, ఫుట్ పెడల్స్ వంటి రోడ్డు మీద గీరుకు పోకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

పవర్ హ్యాండ్లింగ్ మరియు పటిష్టమైన రోడ్ గ్రిప్ కలిగి ఉండేందుకు హ్యార్లీ ఇందులో గ్రిప్ లెవల్స్ అధికంగా ఉన్న టైర్లను అదించింది. ముందు వైపున 100/90B19, 57H, బిడబ్ల్యూ టైరు మరియు వెనుక వైపున 150/80B16, 77H బిడబ్ల్యూ టైర్లు ఉన్నాయి. రెండు కూడా డనలప్ కంపెనీ నుండి సేకరించినవే.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

బ్రేకింగ్ విధులను నిర్వర్తించడానికి ముందు మరియు వెనుక చక్రాని సింగల్ డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది. అయితే, మునుపటి మోడల్‌తో పోల్చితే బ్రేకింగ్ పనితీరు ఇందులో మెరుగుపడింది. మెరుగైన బ్రేకింగ్ ఫీల్ కలిగించే నూతన సస్పెన్షన్ సిస్టమ్‌కు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

ముందుగా భావించినట్లుగానే ఈ బైకులో వైబ్రేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి, అయితే మితిమీరిన వైబ్రేషన్స్ హైస్పీడులో ఉన్నపుడు మాత్రమే వస్తాయి. కానీ, గంటకు 120కిలోమీటర్ల వేగంతో రైడింగ్ చేస్తున్నపుడు ఎలాంటి వైబ్రేషన్ దరిచేరలేదు. లాంగ్ క్రూయిజింగ్ చేయాలనుకునే రైడర్లకు ఇందులో బ్యాక్ రెస్ట్ మిస్సయ్యింది.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

డిజైన్ మరియు పనితీరు ప్రక్కన పెట్టి బైకు విషయానికి వస్తే, క్లచ్ లీవర్ కాస్త హార్డ్‌గా ఉంది. కానీ, భారీ కెపాసిటి ఉన్న ఇంజన్‌కు ఆ కాస్తంత హార్డ్ తేలికగా ఉంటుంది. స్టాప్ అండ్ గో ట్రాఫిక్‌లో క్లచ్ లీవర్ కారణంగా చేతి వేళ్లకు ఇబ్బంది కలుగుతుంది. ఓవర్ టేకింగ్ చేసేటపుడు ఎలాంటి మార్గంలోనైనా గేర్లను క్రిందకు మార్చకుండానే అధిగమించవచ్చు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ సిటీ మైలేజ్ లీటరుకు 15కిలోమీటర్లు మరియు హైవే రైడింగ్‌లో లీటరుకు 21కిలోమీటర్ల మైలజ్‌నిస్తుంది. ఇందులోని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 14-లీటర్లుగా ఉంది. దీనిని ఒక్కసారి ఫుల్ చేస్తే 225కిమీలు ప్రయాణించవచ్చు.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సాఫ్టెయిల్ మోడల్స్ ప్రత్యేకించి స్ట్రీట్ బాబ్ హ్యార్లీ-డేవిడ్సన్‌కు అత్యంత కీలకమైన మోడల్. చూడటానికి చాలా చక్కగా అట్రాక్టివ్‌గా ఉంటుంది, అదే సమయంలో పెద్దదిగా కూడా కనబడుతుంది. కానీ, అన్నింటిని కలుపుకుంటే దీని ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధర రూ. 12 లక్షలుగా ఉంది. ఒక రకంగా ఇది ఖరీదైన బైకులను ఎంచుకునే కస్టమర్లకు భారమనే చెప్పాలి.

2018 హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ రివ్యూ

కాబట్టి, సోలో రైడింగ్ ఎక్కువ ఇష్టపడే కస్టమర్లు, హై వే మీద పవర్ క్రూయిజర్ రైడింగ్ ప్రేమించే వారు ఈ 12 లక్షల ధర మ్యాటర్ కాదనుకుంటే, 2018 హ్యార్లీ-డేవిడ్సన్ స్ట్రీట్ బాబ్ సాఫ్టెయిల్ బైకును నిశ్చింతగా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Harley-Davidson Street Bob Review — A Badass Power-Packed Solo Cruiser
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X