2024 Hero Destini 125 Full Review సరికొత్త హీరో డెస్టినీని కొనవచ్చా, లేదా? ఫుల్ రివ్యూ చూసి డిసైడ్ అవ్వండి
125సీసీ స్కూటర్ విభాగంలో నమ్మదగిన స్కూటర్లలో హీరో డెస్టినీ (Hero Destini 125) ఒకటిగా ఉంది. ఈ స్కూటర్ మంచి ఫర్పామెన్స్‌తో సిటీ, ఇతర కఠినమైన రోడ్లలోనూ రైడర్లకు అనువుగా ఉంటుంది. 2024లో ఈ హీరో డెస్టినీని కొత్త అవతారంలో హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) తీసుకువచ్చింది. ఇందులో ముఖ్యంగా దాని డిజైన్, ఫీచర్లు, రైడింగ్ డైనమిక్స్‌ని పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మార్పులతో కస్టమర్ల ఎక్స్‌పీరియన్స్‌ని మరింత మెరుగుపరచాలని హీరోమోటోకార్ప్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా తాజాగా విడుదల చేసిన ఈ కొత్త స్కూటర్‌ని గోవా వీధుల్లో మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్ చేసింది. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ ఈ కథనంలో..
డిజైన్ & ఫీచర్లు: కొత్త హీరో డెస్టినీ ఆధునిక డిజైన్‌తో మార్కెట్‌లో విడుదల అయ్యింది. పూర్తిగా రిఫ్రెష్ చేయబడిన డెస్టినీ 125 LED హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. దీని హెడ్‌లైట్ ఇప్పుడున్న దానికంటే రాత్రి వేళల్లో 3 రెట్లు ఎక్కువ లైటింగ్‌ని అందిస్తుంది. ఇక టెయిల్‌లైట్ సొగసైన రూపాన్ని కలిగి అదనపు ఆకర్షణగా ఉంటుంది.

ఫ్రంట్ ఫెండర్, సైడ్ ప్యానెల్స్, మఫ్లర్ కవర్‌పై క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి. టాప్ వేరియంట్ ZX+లో పూర్తిగా సిల్వర్ కోటెడ్ క్రోమ్ ఉంటుంది. ఇది చూడటానికి ప్రీమియం లుక్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో స్ట్రాంగ్ మెటల్ బాడీ, క్రోమ్ బార్ ఎండ్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, H-షేప్డ్ LED టెయిల్ ల్యాంప్ వంటివి మరింత ప్రీమియం అనుభూతిని పెంచుతాయి.
ఇందులోని పొడవైన సీటు కలదు. దీనితో పాటు పిలియన్ రైడర్ కోసం బ్యాక్‌రెస్ట్‌ని అందించారు. ఇది ప్రయాణీకుల సౌకర్యానికి మరింత ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ హీరో డెస్టినీ 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని డిజిటల్ డిస్ప్లేలో డిజిటల్ స్పీడోమీటర్, ఇండికేటర్స్, ఫ్యూయల్ ఇండికేటర్లను చూపిస్తుంది. ఇందులో USB ద్వారా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది.

ఈ ఫీచర్స్ నేటి రైడర్‌ల అనువుగా ఉంటాయి. ఈ స్కూటర్ ఏడు వైబ్రెంట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. కొనుగోలుదారులు వారి స్టైల్‌కు సరిపోయేలా కలర్ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఈ స్కూటర్ ముఖ్యంగా సిటీ ప్రయాణీికులకు సరిపోతుంది. అదిరిపోయే ప్రీమియం డిజైన్ లుక్ కస్టమర్లను చూడగానే దాని వైపు చూపు తిప్పేలా చేస్తుంది.
ఇంజిన్ & స్పెక్స్: హీరో డెస్టినీ 125 అదే 124.6cc ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 7,000 rpm వద్ద 9hpని మరియు 5,500 rpm వద్ద 10.4Nm టార్క్‌ను అందిస్తుంది. పవర్ అవుట్‌పుట్ మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉన్నప్పటికీ.. సాఫ్ట్ ఫర్ఫామెన్స్, మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం CVT ట్రాన్స్‌మిషన్‌తో అందించారు. ఇది లీటర్‌కి 59 km మైలేజీని (ICAT Test) సాధించింది.

2024 మోడల్ కొత్త 12-అంగుళాల వీల్స్, విశాలమైన వెనుక టైర్‌తో పాటు ఇప్పుడు 57mm పొడిగించిన పొడవైన వీల్‌బేసస్‌ని కలిగి ఉంది. ఈ మార్పులు ఉన్నప్పటికీ, కొత్త స్కూటర్ దాని ఫర్పామెన్స్‌లో ఈ డైమెన్షన్స్‌కి ఎక్కడా ఇబ్బందికి గురిచేయవు. ఆప్టిమైజ్ చేయబడిన రేక్ యాంగిల్, రీపోజిషన్ చేయబడిన స్వింగార్మ్ పైవట్ సిటీ ట్రాఫిక్‌లో నావిగేట్ చేయడానికి అద్భుతంగా అనిపిస్తుంది.
ZX, ZX+ వేరియంట్‌లు మెరుగైన స్టాపింగ్ పవర్ కోసం 190mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉన్నాయి. అయితే బేస్ VX వేరియంట్ 130mm డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంది. అన్ని వేరియంట్‌లు CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్‌తో వస్తాయి. Hero యొక్క i3S టెక్నాలజీ (ఇడిల్ స్టాప్-స్టార్ట్) ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది.

రైడింగ్ ఇంప్రెషన్స్: హీరో డెస్టినీ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా నగర రోడ్లకు సరిపోతుంది. మృదువైన సస్పెన్షన్ సెటప్ బంప్‌లను సమర్థవంతంగా ఉంటుంది. ఖరీదైన సీటు రైడర్, పిలియన్ ఇద్దరికీ తగినంత సౌకర్యాన్ని అందిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ బాగానే పనిచేస్తుంది. ముందు బ్రేకింగ్ అంతగా అనిపించలేదు. అయితే వెనుక బ్రేక్ మెరుగైన పట్టును అందిస్తుంది.
ఇంజిన్ స్మూత్‌గా ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, మరింత ఉత్సాహభరితమైన పనితీరు కోసం వెతుకుతున్న రైడర్‌లకు ఇది కొద్దిగా బలహీనంగా అనిపించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, మృదువైన, వైబ్రేషన్-రహిత రైడ్అద్భుతమైన ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల హీరో డెస్టినీ 125 రోజువారీ ప్రయాణికులకు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారుతుంది.

చివరగా: కొత్త హీరో డెస్టినీ 125 అనేది స్టైల్, సౌలభ్యం, ప్రాక్టికాలిటీని కంబైన్డ్ చేసే ఓ చక్కటి స్కూటర్‌గా అభివర్ణించవచ్చు. దాని ఆధునిక డిజైన్, ఉపయోగకరమైన ఫీచర్స్, రైడర్-ఫోకస్డ్ అప్‌డేట్స్ పట్టణ ప్రయాణికులకు మంచి ఆప్షన్‌గా ఉపయోగపడుతుంది. హై ఫర్పామెన్స్ కోరుకునే వారు కొద్దిగా నిరాశ చెందవ్చచు. అయితే సాఫ్ట్ రైడింగ్, మైలేజీకి ప్రాధాన్యం ఇచ్చే వారికి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది.


Click it and Unblock the Notifications








