Husqvarna Svartpilen 401 Review హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్‌ 401 డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

టూ వీలర్‌ ప్రపంచంలో ప్రస్తుత యువత కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. స్టైలిష్‌ లుక్‌, అడ్వెంచరస్‌ రైడింగ్‌, అందరినీ తమ వైపునకు తిప్పుకునేలా గర్జించే ఇంజిన్‌ సౌండ్‌ ఉన్న బైక్‌లంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్‌ 401(Husqvarna Svartpilen 401) సరికొత్త విప్లవం సృష్టించిందనే చెప్పాలి. రైడర్లకు ఫేవరెట్‌గా మారిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

2018లో అంతర్జాతీయ మార్కెట్‌లో Husqvarna Svartpilen బైక్‌ అరంగేట్రం చేసింది. రెండేళ్ల తర్వాత అంటే 2020లో ఈ బైక్‌ భారత మార్కెట్లో ప్రవేశించింది. ఈ స్వీడిష్ స్ట్రీట్ మార్వెల్ తన నియో-రెట్రో లుక్‌తో 2024 Husqvarna Svartpilen 401 ఇటీవల లాంచ్‌ అయింది. ఈ క్రమంలో Husqvarna పూణేలో వారి కొత్త Svartpilen 401ని టెస్ట్‌ రైడ్‌ చేసేందుకు మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ను ఆహ్వానించింది. పూర్తి రివ్యూ ఈ కథనంలో..

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

డిజైన్‌ విషయానికొస్తే Husqvarna Svartpilen 401 చూడగానే ఆకట్టుకునేలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్థూలమైన ఫెయిరింగ్‌లు మరియు ఓవర్‌డోన్ బాడీవర్క్‌లపై అనవసర వాటిని తొలగిస్తూ, ఈ నియో-రెట్రో స్క్రాంబ్లర్ క్లీన్ లైన్‌లు, ఎక్స్‌పోజ్డ్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. రోడ్డు పైనే కాకుండా ఆఫ్‌ రోడింగ్‌లోనూ అనువుగా ఉండేలా టైర్‌లను ఈ బైక్‌కు అమర్చారు.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్‌ 401 వృత్తాకార LED హెడ్‌లైట్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో సింగిల్ రౌండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా రెట్రో లుక్‌ను కలిగి ఉంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మరియు నాబీ టైర్ల ద్వారా రైడర్లు ఆహ్లాదకరమైన రైడింగ్‌ను పొందవచ్చు. సొగసైన ఇండికేటర్లు, చిన్న విండ్‌షీల్డ్ ఈ బైక్‌కు మరింత లుక్‌ను జోడిస్తాయి.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్‌ 401లో ట్యాంక్‌పై బోల్డ్‌ షేప్‌లో 401 బ్యాడ్జింగ్‌ను చూడవచ్చు. దానితో పాటు నియాన్ పసుపు రంగు స్ట్రిప్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. Husqvarna Svartpilen 401 యొక్క పొడుగు సీటు దాని ట్యాంక్‌పైకి విస్తరించి ఉండటంతో పాటు వెనుకవైపు ఒక కఠినమైన గ్రాబ్ రైల్‌ను చూడవచ్చు.

అయితే Svartpilen 401 కేవలం చూడగానే ఆకట్టుకనే బైక్‌ మాత్రమే కాదు.. దీనిని కఠినమైన రోడ్లపై సైతం సులభంగా నడిపేలా రూపొందించారు. సైడ్స్‌ నుంచి చూస్తే Svartpilen 401 ఒక నేక్డ్ ప్రొవ్లర్‌ను పోలి ఉండగా.. బాడీ వర్క్‌ కొంచెం వేరుగా ఉంటుంది. సింపుల్‌ డిజైన్‌.. ఈ బైక్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది. నియాన్ పసుపు రంగు స్ట్రిప్ ద్వారా మరింత ప్రత్యేకంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

ఇక Svartpilen 401 ఇంజిన్‌ విషయానికొస్తే ఇందులో 399cc, సింగిల్-సిలిండర్, DOHC ఇంజన్‌ను ఉపయోగించడంతో.. 45.6bhp మరియు 39Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడటం ద్వారా మరింత మృదువుగా, కచ్చితత్వాన్ని కలిగి ఉంటుంది. కాగా ఈ బైక్‌ బరువు 171 కిలోలు ఉండటంతో.. దాని లైనప్‌లో ఇదే బరువైన మోటార్‌ సైకిల్‌గా చెప్పవచ్చు.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

హస్క్‌వర్నా Svartpilen 401 రేజర్-షార్ప్ హ్యాండ్లింగ్‌ను కలిగి ఉండటంతో.. రైడింగ్‌లో చురుగ్గా పనిచేయడాన్ని గమనించవచ్చు. దీని ద్వారా మీకు మంచి రైడింగ్‌ అనుభూతి కలుగుతుంది. పిరెల్లి స్కార్పియన్ ర్యాలీ STR టైర్‌లతో కూడిన 17-అంగుళాల వీల్స్‌ను ఇందులో అమర్చారు. దీని ద్వారా ఆన్-రోడ్ గ్రిప్ మరియు ఆఫ్-రోడ్ సామర్ధ్యాల మధ్య బ్యాలెన్సింగ్‌ను మెయింటెన్‌ చేస్తుంది.

Husqvarna Svartpilen 401 బైక్‌ సీట్‌ ఎత్తు 820mm గా ఉంది. దీని ద్వారా మీరు ఒకవేళ అడ్వెంచరస్‌ రైడింగ్‌ చేయాలనుకుంటే.. 820ఎమ్ఎమ్ సీట్ ఎత్తు వివిధ ఎత్తుల రైడర్‌లకు అనుకూలంగా ఉంటుంది. Svartpilen 401 స్థిరత్వం కోసం 1,354mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

177mm గ్రౌండ్ క్లియరెన్స్, గ్రిప్పీ 110/70 ఫ్రంట్ మరియు 150/60 వెనుక టైర్లు 17 అంగుళాలతో ఉండగా.. సామర్థ్యం గల ఛాసిస్‌ను కలిగి ఉంది. దీని ద్వారా గరుకు రోడ్లు, కఠినమైన భూభాగాలపై సైతం హస్క్‌వర్నా స్వార్ట్‌పైలెన్‌ 401 సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇంకా ఇందులో 13.5-లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇక ఫ్రంట్‌ డిస్క్‌ 320mm, రియర్ డిస్క్‌ 240mm ను కలిగి ఉంది.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

Svartpilen 401లో ఇంజిన్‌ సౌండ్‌ ఈ బైక్‌కు ప్రత్యేకతను జోడిస్తుంది. ఇక తేలికైన చట్రం మీ రైడింగ్ స్టైల్‌కు అనుకూలంగా ఉంటుంది. తద్వారా మీరు టర్నింగ్‌ల్లోనూ సునాయాసంగా వెళ్లిపోవచ్చు. ఇంకా మీ రైడ్ థ్రిల్లింగ్‌గా ఉండటంతో పాటు సౌకర్యవంతంగా ఉండేలా ఎటువంటి సమస్య లేకుండా సస్పెన్షన్ సెటప్‌లు బంప్‌లు మరియు లోపాలను తట్టుకుంటుంది.

బ్రేకింగ్‌ విషయానికొస్తే Svartpilen బ్రేక్‌లు చాలా పదునుగా ఉంటాయి. ఒత్తిడి లేకుండా త్వరగా, సులభంగా Svartpilen 401 బ్రేక్‌ తీసుకుంటుంది. స్లిప్పర్ క్లచ్ దూకుడుగా డౌన్‌షిఫ్ట్‌ల సమయంలో భద్రతను ఇస్తుంది. ఇంకా వెనుక చక్రాల లాకప్‌ను నివారించడంతో మీ రైండిగ్‌ స్టంట్‌ షోగా మారకుండా కాపాడుతుంది.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

ఇక Svartpilen 401 రైడర్ ట్రయాంగిల్ కూడా సౌకర్యవంతంగా ఉండటంతో అలా దూకుడుగా కాకుండా.. ఇలా స్లోగా కాకుండా సరిగ్గా సరిపోతుంది. కాగా ట్యాంక్‌తో సజావుగా చేరిన సీటు ఫ్రంట్ వీల్‌కి బరువును జోడించడంలో రైడర్‌కు దోహదపడుతుంది. ఇంకా ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌లో Svartpilen 401ని మీకు మంచి కిక్‌ రైడింగ్‌ను ఇస్తుంది. వదులుగా ఉండే ఉపరితలాలపై నాబీ టైర్లు సులభంగా పనిచేస్తాయి.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

చివరిగా Husqvarna Svartpilen 401 మోటార్ సైకిల్ కంటే కొంచెం ఎక్కువ. ఇది టూ వీల్స్‌పై మీకు అద్భుతమైన రైడింగ్‌ అనుభూతిని ఇస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు అందరి దృష్టి మీ బైక్‌పై ఉండేలా చేస్తుంది. మీరు రైడ్‌ చేసిన ప్రతిసారి మీ ముఖంపై చిరునవ్వు ఖచ్చితంగా ఉంటుంది. దీని మినిమలిస్టిక్‌ డిజైన్‌ మిమ్మల్ని ఇట్టే ఆకట్టుకుంటుంది.

Svartpilen 401 యొక్క ఉల్లాసభరితమైన స్పిరిట్, పంచ్ పెర్ఫార్మెన్స్ మరియు చురుకైన హ్యాండ్లింగ్, సైరన్‌ సాంగ్‌, స్టైలిష్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండే బైక్‌ను కోరుకునే రైడర్‌లకు మంచి ఆప్షన్‌. మోటార్ సైకిళ్ల ప్రపంచంలో, Husqvarna Svartpilen 401 ఇది ఒక విప్లవంగా కూడా నిలుస్తుంది.

2024 Husqvarna-Svartpilen-401-Design-Features-Performance-Full Review

కేవలం లుక్స్‌ పరంగా మాత్రమే కాకుండా.. ఎక్స్‌పీరియన్స్‌, థ్రిల్‌ పరంగా కూడా రైడర్‌కు మంచి అనుభూతిని ఇస్తుంది. థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్, సరదాగా ఉండే హ్యాండ్లింగ్ మరియు చూపు తిప్పుకోనివ్వని డిజైన్‌ లుక్‌ సమ్మేళనాన్ని కోరుకునే రైడర్ల అయితే.. మీ కోసం మిడిల్‌ వెయిట్‌ మోటార్‌సైకిల్‌ Husqvarna Svartpilen 401 సిద్ధంగా ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, January 29, 2024, 10:00 [IST]
English summary
2024 husqvarna svartpilen 401 design features engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+