2024 TVS Apache RR 310 Review టీవీఎస్‌ అపాచీ బైక్‌ అదరగొట్టిందా? ఫర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

2017 వరకు BMW భాగస్వామ్యంతో టీవీఎస్‌ కంపెనీ అపాచీని బైక్‌ని విడుదల చేసింది. ఆ తర్వాత TVS సొంతంగా ఈ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ని డెవలప్‌ చేసి మార్కెట్‌లో విడుదల చేస్తూ వస్తోంది. 2024 లోనూ అపాచీ RRని సరికొత్త అప్‌డేట్స్‌తో తీసుకువచ్చింది. ఈ 2024 TVS Apache RR 310 సరికొత్త అవతార్‌లో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. దీనిని కోయంబత్తూరులోని CoastTT హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో టెస్ట్‌డ్రైవ్‌ చేసేందుకు మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌కి ఆహ్వానం లభించింది. ఈ టెస్ట్‌డ్రైవ్‌లో బైక్‌ ఫర్పామెన్స్‌ ఎలా ఉంది? ఈ బైక్‌లో కొత్తగా ఏముంది అనే అంశాలను ఈ ఫుల్‌ రివ్యూపై ఓ లుక్కేయండి.

మార్పులు ఏంటి: కొత్త 2024 TVS Apache RR 310 దాని మునుపటి అవతార్ కంటే అంతగా భిన్నంగా కనిపించ లేదు. ఇందులో కనిపించే ఏకైక మార్పు కొత్త బాంబర్ గ్రే కలర్‌వే (Bomber Grey Colourway) అని చెప్పవచ్చు. కొత్త కలర్‌వేని ఇష్టపడని వారికి సైడ్‌లో కాస్మెటిక్ మార్పులను కూడా గమనించవచ్చు. ఇప్పుడు బైక్‌కి ఇరు వైపులా 'అపాచీ' డీకాల్స్(అక్షరాలు) పెద్దగా వస్తాయి.

2024 TVS Apache RR 310 Review

కొత్త Apache RR 310 వింగ్‌లెట్స్‌ ఇరువైపులా కూల్‌గా కనిపిస్తాయి. ఇవి అదనంగా 3 కిలోల డౌన్‌ఫోర్స్‌ను అందజేస్తాయని TVS పేర్కొంది. అయితే ఇది ఏ వేగంతో (ట్రాక్‌లో) అనేది మాత్రం పేర్కొనలేదు. ఇక దీనిలోని అతిపెద్ద మార్పు అప్‌గ్రేడ్ చేయబడిన పవర్‌ప్లాంట్ అలాగే ఎలక్ట్రానిక్ భాగం అని చెప్పవచ్చు. ఇవేవి బయటి వ్యక్తులకు కనిపించవు కావున ఈ స్పోర్ట్స్ బైక్‌ అదనపు లుక్‌ని కలిగి ఉంటుంది.

ఈ 2024 TVS Apache RR 310 312.2cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ 7 సంవత్సరాలలో ఇదే అత్యంత పవర్‌ఫుల్‌ ఇంజిన్‌ అని చెప్పవచ్చు. RR 310 ఇంజిన్ 10% తేలికైన పిస్టన్, థొరెటల్ బాడీ, హై కంప్రెషన్‌ రేషియోను కలిగి ఉంది. అలాగే 13% పెద్ద ఎయిర్‌బాక్స్ ఇంజిన్‌లోకి గాలి ఎక్కువగా వెళ్లేలా చేయడం ద్వారా ఇది మెరుగ్గా పనిచేస్తుంది.

2024 TVS Apache RR 310 Review

పైన చెప్పిన విధంగా దీని ఫర్పామెన్స్‌ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇది స్పోర్ట్‌ అండ్‌ ట్రాక్‌ మోడ్‌లో 9,800rpm వద్ద 37.5bhp గరిష్ట అవుట్‌పుట్ (4bhp ద్వారా 100rpm ఎక్కువగా అందించబడుతుంది) అలాగే 29Nm టార్క్ (1.7Nm ద్వారా 200rpm ఎక్కువ)ని విడుదల చేస్తుంది. ఇక ఇంజిన్ అవుట్‌పుట్‌ని పరిమితం చేసే అర్బన్, రెయిన్ మోడ్‌లలో కూడా ఫర్ఫామెన్స్‌ పెంచారు.

ఈ మోడ్స్‌లో 7,600rpm వద్ద 29.5bhp (4bhp ద్వారా), 6,700rpm వద్ద 26.5Nm (1.5Nm పెరిగింది). ఇప్పుడు ఎంట్రీ-లెవల్ ట్రిమ్ నుంచి అన్ని వేరియంట్లలో బై-డైరెక్షనల్‌ క్విక్‌ షిఫ్టర్‌తో కూడాని 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ కలదు.

TVS Apache RR 310

RR 310 క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. అలాగే రేస్ ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీని ఎంచుకోవచ్చు. (Race Tuned Dynamic Stability Control, RT-DSC) ఆప్షన్‌ కోసం కస్టమర్లు అదనంగా రూ. 16,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో IMU, ABS, ట్రాక్షన్ కంట్రోల్‌, వీలీ కంట్రోల్‌, క్రూయిజ్ కంట్రోల్‌, వెనుక చక్రాల లిఫ్ట్-ఆఫ్ కంట్రోల్‌ వంటివి ఉంటాయి.

రైడింగ్‌ ఎలా ఉంది: పవర్ అప్‌గ్రేడ్, క్విక్‌షిఫ్టర్, వింగ్‌లెట్స్‌తో పాటు కొత్త ఎలక్ట్రానిక్ ఎయిడ్‌ వల్ల ఇంజిన్ ఫర్ఫామెన్స్‌ మోస్తరుగా అనిపించింది. అయితే ఇది రేస్‌ని పెంచుతున్న కొద్ది రేంజ్‌ కూడా పెరుగుతుంది. 5,000rpm మార్కు వద్ద మునుపటి వలె వైబ్రేషన్స్‌ ఉండవు. ఈ సమస్య తొలగిపోనుంది. ఇక మీరు 7,500rpm పరిమితిలో ఉన్నప్పుడు పవర్‌ప్లాంట్‌ ఉత్తేజకరంగా పనిచేస్తుంది.

2024 TVS Apache RR 310 Review

కొత్త 2024 RR 310 0-100km/h వేగాన్ని కేవలం 6.74 సెకన్లలో అందుకుంటుంది. కొత్త ఫెయిర్డ్ అపాచీలో CoastTT ట్రాక్‌లో ఇది గంటకు 150 కి,మీ వేగంతో పరుగెత్తింది. ఒకానొక సమయంలో 164km/h గరిష్ట వేగాన్ని అందుకుంది. అంతకు మించిన వేగాన్ని అందుకోలేకపోయాము. ఇక బ్రేకింగ్‌ బైబ్రే కాలిపర్‌ల (Bybre Calipers) ద్వారా బిగించబడిన 300mm (ముందు) మరియు 240mm (వెనుక) డిస్క్స్‌ ఉన్నాయి.

దీని బ్రేకింగ్‌ చాలా మెరుగ్గా పనిచేసింది. మీరు మూలల వద్ద కూడా వేగాన్ని సెకన్లలో నియంత్రించవచ్చు. వంపుల వద్ద కూడా నియంత్రణ కోల్పోకుండా ఉండేలా బ్రేకులు చక్కగా పనిచేస్తున్నాయి. అయితే ABS అంతంగా అనిపించలేదు. వెనుక ABSని ఆఫ్ చేయడం ద్వారా చాలా ఉల్లాసభరితమైన ఫర్పామెన్స్‌ని పొందాము. ఇక ఇందులో సస్పెన్షన్ సెటప్ మారలేదు. రేస్ ట్రాక్‌పై ఈ బైక్‌ సస్పెన్షన్స్‌ మంచిగా పనిచేశాయి.

2024 TVS Apache RR 310 Review

కొత్త క్విక్‌షిఫ్టర్ ఉపయోగించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. ఖచ్చితమైన, ప్రత్యక్ష, సున్నితమైన ఇన్‌పుట్‌లను అందిస్తుంది. ఇంతకు ముందు క్విక్‌షిఫ్టర్‌ని ఉపయోగించని రైడర్‌లు దీనిని అలవాటు చేసుకోవాలి. అలాగే కొత్త Apache RR 310లో రైడింగ్ పొజిషన్ మునుపటిలా దూకుడుగా అనిపించదు. అయితే స్ట్రెయిట్‌ లైన్‌ లేదా పక్కకు కదులుతున్నప్పుడు మీరు సులభంగా కదలడానికి సీటుపై తగినంత స్సేస్ కలదు.

చివరగా: 2024 TVS Apache RR 310 బైక్ కొన్ని అప్‌గ్రేడ్‌లతో మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇందులోని మార్పులు ఎక్కువగా కనిపించనప్పటికీ.. అపాచీ బైక్స్‌లోనే ఓ ఫెయిర్డ్ బైక్‌గా నిలుస్తుంది. ఇది దాని మునుపటి బైక్స్‌ కంటే అద్భుతమైన అప్‌గ్రేడ్స్‌తో వచ్చింది. దాని , సాఫ్ట్‌ ఇంజిన్, షార్ప్ హ్యాండ్లింగ్ సెటప్‌ మిమ్మల్ని అదుపులో ఉంచుతుంది. థ్రిల్‌ రైడింగ్‌ అనుభూతి, క్రేజీ లుక్‌ కోసం కొత్త Apache RR 310ని కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, September 27, 2024, 12:00 [IST]
English summary
2024 tvs apache rr 310 review riding impressions specifications and features in telugu
Read more on: #tvs #bike review #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+