2024 TVS Jupiter 110 Review ఆల్‌రౌండింగ్‌ స్కూటర్‌ కోసం చూస్తున్నారా? దీనిని ఎందుకు ట్రై చేయకూడదు!

టీవీఎస్‌ జూపిటర్ (TVS Jupiter) భారతదేశంలో అత్యంత ఎక్కువగా ఇష్టపడే కమ్యూటర్ స్కూటర్‌లో ఒకటిగా ఉంది. తాజాగా ఆ కంపెనీ జూపిటర్‌ 110ని సరికొత్త అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లో విడుదల చేసింది. దీనిలోని కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, హై ఫర్ఫామెన్స్‌ స్కూటర్‌ని మార్కెట్‌లో మరింత బలోపేతం చేయనుంది. ఇతర స్కూటర్లకంటే ధీటుగా మార్కెట్‌లో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు టీవీఎస్‌ దీనిని ప్రవేశ పెట్టింది. ఈ జూపిటర్ 110ని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్ టెస్ట్‌డ్రైవ్‌ చేసింది. ఈ స్కూటర్‌లోని ప్రధాన అంశాలు, దాని డిజైన్‌, ఫీచర్లు, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ తదితర విషయాలకు సంబంధించిన పూర్తి రివ్యూ మీ కోసం..

డిజైన్ & స్టైలింగ్: సరికొత్త డిజైన్‌తో రైడర్లకు మెరుగైన హ్యాండ్లింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇందులోని హ్యాండిల్‌బార్, ఫ్లోర్‌బోర్డ్, సులభంగా యాక్సెస్ చేసేలా సీట్ ఎత్తు వంటి ఇతర అంశాలు కస్టమర్లకు విపరీతంగా నచ్చుతాయి. అంతే కాకుండా ఈ స్కూటర్‌లో ఆధునిక పూర్తి డిజిటల్ కలర్ LCD స్పీడోమీటర్ అమర్చబడి ఉంటుంది. ఇది స్మార్ట్ అలర్ట్స్‌, రియల్‌టైమ్‌ మైలేజ్ ఇండికేటర్‌లను సూచిస్తుంది. రైడర్లు ఇతర సమాచారన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

2024 TVS Jupiter 110 Review in Telugu

స్పెసిఫికేషన్లు : TVS జూపిటర్ 110 113.3 సీసీ, సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 6500 rpm వద్ద 5.9 kW పవర్ అవుట్‌పుట్ మరియు 5000 rpm వద్ద 9.8 Nm (iGO అసిస్ట్‌తో) గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. iGO అసిస్ట్ లేకుండా, టార్క్ అవుట్‌పుట్ 5000 rpm వద్ద 9.2 Nm వద్ద కొద్దిగా తక్కువగా ఉంటుంది.

110 సీసీ విభాగంలో iGO అసిస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక స్కూటర్‌ ఇదే కావడం విశేషం. దీని ద్వారా స్కూటర్ మైలేజీలో 10% మెరుగుదలని సాధిస్తుంది. అంతే కాకుండా ఈ టెక్నాలజీ ఆటో స్టార్ట్-స్టాప్ ఫంక్షనాలిటీ మరియు ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్)తో కూడిన ఇంటెలిజెంట్ ఇగ్నిషన్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది నిర్దిష్ట డ్రైవింగ్ పరిస్థితులలో బ్యాటరీ పవర్‌ని ఉపయోగించడం ద్వారా మెరుగైన పనితీరును అందిస్తుంది.

2024 TVS Jupiter 110 Price

దీనిలోని ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్, గ్లోవ్ బాక్స్ (ఫోన్‌ లేదా ఇతర వస్తువులు పెట్టుకోవడానికి), USB మొబైల్ ఛార్జర్, పేటెంట్ పొందిన E-Z సెంటర్ స్టాండ్ (సులభంగా పార్క్ చేయవచ్చు) వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, LED హెడ్‌ల్యాంప్ రాత్రుల్లో రైడర్లకు మెరుగైన వెలుతురును అందిస్తుంది. ఇది డ్రైవర్లకు హైవేలు, ఇతర రోడ్లలో సేఫ్టీని అందిస్తుంది. ఇందులో హజార్డ్ లైట్స్‌ కూడా ఉన్నాయి.

రైడింగ్ ఇంప్రెషన్స్: 2024 జూపిటర్ 110 సౌకర్యవంతంగా ఆనందదాయకంగా ప్రయాణానికి అనవుగా ఉంటుంది. దీని సస్పెన్షన్ సిస్టమ్ ఎత్తు పల్లాల వద్ద అలవోకగా దూసుకెళ్తుంది. ఇతర గుంతల రోడ్లలోనూ మీరు ఎటువంటి అసౌకర్యానికి లోనవకుండా మీ ప్రయాణాన్ని సాఫీగా సాగేలా చేస్తుంది. ఇందులోని ఎర్గోనామిక్ డిజైన్ రైడర్ల ఎత్తుకి తగినట్లుగా సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్‌ను అందిస్తుంది.

2024 TVS Jupiter 110 Design

ఇంజిన్ సజావుగా పనిచేస్తుంది. పట్టణ ప్రయాణాలకు ఇది అనువుగా ఉంటుంది. స్కూటర్ హ్యాండ్లింగ్ బాగుంది. ఇది సిటీ ట్రాఫిక్‌లోనూ ఎలాంటి అసౌకర్యానికి గురిచేయదు. ఎందుకంటే ఇది లో-స్పీడ్‌లో వెళ్తుంటే బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 మీ ప్రయాణ సజావుగా సాగేలా చేస్తుంది. ఇది ట్రాఫిక్‌, ఇతర గుంతల రోడ్లలో మీ ప్రయాణాల్లో రైడర్ విశ్వాసాన్ని మరింత పెంచుతుంది.

చివరగా: జూపిటర్ 110 అప్‌డేట్ చేయబడిన సరికొత్త డిజైన్‌ని కలిగి ఉంది. దీని డిజైన్‌కి మీరు ఫిదా అవుతారు. ఇందులో కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా 6 కలర్‌ ఆప్షన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో చెప్పుకోవాల్సింది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లర్ ఫీచర్‌. దీంతో మీరు ఇకపై సీటును ఎత్తకుండానే రీఫ్యూయలింగ్ చేసుకోవచ్చు.

2024 TVS Jupiter 110 Front Design

ఇది ఒక చిన్న ప్యాకేజీలో భారీ స్టైలింగ్‌, అద్భుతమైన ఫర్ఫామెన్స్‌, ప్రాక్టికాలిటీని అందించే చక్కటి ఆల్‌రౌండర్‌ స్కూటర్ అని చెప్పవచ్చు. దీనిని అప్‌డేట్ చేసిన డిజైన్, ఇతర స్మార్ట్ ఫీచర్లు భారతీయ వినియోగదారులకు వారి రోజువారీ ప్రయాణంలో మరింత నమ్మకాన్ని పెంచుతాయి. ఇదొక గొప్ప ఆప్షన్‌ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

మీరు పెట్టే డబ్బుకు ఇది మంచి వ్యాల్యూని అందిస్తుంది. మంచి మైలేజీ, ఆల్‌రౌండ్‌ కమ్యూటర్ స్కూటర్ కోసం వెతుకుతున్నట్లయితే, జూపిటర్ 110 పరిగణనలోకి తీసుకోండి. ఎందుకంటే 110 సీసీలో ఈ బైక్‌లో బెస్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. ఈ సరికొత్త జూపిటర్ బేస్ వేరియంట్ ధర రూ. 73,700 (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండగా.. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 87,250 (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 24, 2024, 12:00 [IST]
English summary
2024 tvs jupiter 110 review riding impressions specifications and features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+