2025 Ather 450X Review కింగ్ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది? దీన్ని కొనాలా.. వద్దా ?

దేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వాహన తయారీ కంపెనీలు వరుసగా అధునాతన ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ టూవీలర్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ కుటుంబ వినియోగదారుల కోసం 450 లైనప్‌ను విస్తరిస్తూ అప్‌డేటెడ్ 2025 ఏథర్ 450 ఎక్స్(2025 Ather 450X)ను తీసుకొచ్చింది. ఇది సరికొత్త అప్‌డేటెడ్ ఫీచర్లతో వచ్చింది. అయితే ఇటీవల బెంగుళూరులో మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేసింది. అప్‌డేట్ చేయబడిన స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ పెర్ఫామెన్స్ ఏ విధంగా ఉందో క్రింది కథనంలో అందిస్తున్నాము

2025 Ather 450X కొత్త మార్పులు ఏంటంటే: Ather 450 లైనప్ 2025 మోడల్‌లో చాలా కొత్త అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ హైపర్ శాండ్, స్టెల్త్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని టైర్లు సరికొత్తగా ఉంటాయి. MRF జాపర్ N e-tred టైర్‌లను ఇది కలిగి ఉంది. దీంతో టైర్ల పనితీరు 24 శాతం పెరుగుదల ఉంటుంది. స్కూటర్ పెర్ఫామెన్స్ మరింత పెరగడానికి ఇవి ఉపయోగపడుతాయి.

2025 Ather 450X Full Review Riding Impressions

అపెక్స్ వేరియంట్‌కు హెల్మెట్‌ స్టాండర్డ్‌గా వస్తుంది. అయితే 450X ఇప్పుడు అపెక్స్‌లో మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్‌ను పొందుతుంది. అపెక్స్, 450X స్కూటర్లు రెండూ ఇప్పుడు మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌తో స్టాండర్డ్‌గా వస్తాయి. ఇది రెయిన్, రోడ్, ర్యాలీ అనే మూడు ట్రాక్షన్ ఇంటర్వెన్షన్ మోడ్‌లను కలిగి ఉంటుంది.

450X,అపెక్స్‌లు సరికొత్త AtherStack6 సాఫ్ట్‌వేర్ సిస్టంను కలిగి ఉన్నాయి. ఇవి అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి.ఇది పింగ్ మై స్కూటర్, వాట్సాప్ ఆన్ డ్యాష్‌బోర్డ్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి వివిధ అలెక్సా స్కిల్స్ ఫీచర్లను రైడర్లకు అందిస్తుంది. ఇవే కాకుండా రైడర్లకు అవసరమయ్యే ఆప్షన్లు కూడా ఉన్నాయి.

2025 Ather 450X Full Review

2025 ఏథర్ 450X స్పెసిఫికేషన్స్ అండ్ రేంజ్: మొత్తం 450 లైనప్‌లో ప్రయాణించే దూరం పరిధి దాదాపు 24 శాతం పెరిగినట్లు ఏథర్ పేర్కొంది. 450X బేస్ వేరియంట్ 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో 60 కి.మీల నుంచి 70 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

అయితే స్పోర్ట్‌లో ఇది (70 కి.మీల పైనే) 80 కి.మీల వరకు రేంజ్ అందిస్తుంది. రైడ్ మోడ్‌లో రేంజ్ 75 కిమీ నుండి 90 కిమీకి పెరిగింది. ఎకో, స్మార్ట్ ఎకోలో 85కిమీ, 90 కిమీల నుంచి 105 కిమీలకు పెరిగింది.

2025 Ather 450X Full Review Riding

3.7kWhతో 450X ఇప్పుడు స్మార్ట్ ఎకో, ఎకో మోడ్‌లలో గరిష్టంగా 130కిమీల నిజమైన రేంజ్‌ను అందిస్తుంది, ఇది వరుసగా 110కిమీ, 105కిమీల నుండి పెరిగింది. రైడ్ మోడ్‌లో, రేంజ్ 20 కిమీ నుండి 110 కిమీ వరకు పెరిగింది, అయితే స్పోర్ట్ మోడ్‌లో రేంజ్ 15 కిమీ నుండి 100 కిమీ వరకు పెరిగింది. చివరగా, వార్ప్ మోడ్‌లో, రేంజ్ 10 కిమీ నుండి 85 కిమీ వరకు పెరిగింది.

ఛార్జింగ్ విషయానికి వస్తే, 2.9kWh బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 3 గంటల్లో 0 నుంచి 80 శాతం ఫాస్ట్‌గా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఇంట్లో పూర్తి ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ను 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది, అయితే పూర్తి ఛార్జింగ్ చేయాలంటే మాత్రం 5 గంటల 45 నిమిషాలు పడుతుంది.

2025 Ather 450X Full Testing

పెర్ఫామెన్స్ పరంగా చూసినట్లయితే 2025 ఏథర్ 450X కేవలం 3.3 సెకన్లలో 0 నుండి 40 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 90 కిమీ/గంటగా ఉంది. దీనిలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 8.58 bhp పవర్, 26 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది.

రైడ్ అనుభూతి: కొత్త 2025 ఏథర్ 450X రైడింగ్ రైడర్లకు సరికొత్తగా అనిపిస్తుంది. గతంలో మాదిరిగానే ఇది వేగంగా కదులుతుంది. సగటు వేగంతో ప్రయాణించే భారతీయ వినిమయోగదారులకు ఇది సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రధానంగా కొత్త MRF జాపర్ N e-tred టైర్లు నగరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ వేగాన్ని పెంచడంతో పాటు, రోడ్లపై సురక్షితమైన పట్టును కలిగి ఉంటాయి.

2025 Ather 450X Full Review Testing

మూడు ట్రాక్షన్ మోడ్‌లు 450Xని పూర్తిగా ఆస్వాదించేలా మంచి అనుభూతిని ఇస్తాయి. వర్షం లేదా తడిగా ఉన్న రోడ్లపై కూడా జారిపోకుండా ఉండటానికి టైర్లు తగినంత రక్షణ అందిస్తాయి. Ather 450X సస్పెన్షన్ చాలా మెరుగ్గా ఉంటుంది. హ్యాండిల్‌ సులభంగా అటూ ఇటూ తిరుగుతుంది. రోడ్డు సరిగ్గా లేని ఏరియాల్లో కూడా సస్పెన్షన్ సెటప్ బాగా ఉపయోగపడుతుంది.

ఇక బ్రేకుల విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో .డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. దీంతో రైడింగ్ సమయంలో కంట్రోలింగ్ చాలా ఈజీ అవుతుంది. ఎక్కడ కూడా స్కిడ్ కాకుండా చాలా స్మూత్‌గా స్కూటర్‌ను ఆపడానికి బ్రేకులు అనువుగా ఉంటాయి. కొత్త మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్ ఏథర్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను 450Xకి తీసుకువస్తుంది. మ్యాజిక్ ట్విస్ట్ ఫీచర్‌ని ఆన్ చేసి రైడ్ చేసినట్లయితే సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించడం చాలా ఈజీ అవుతుంది.

2025 Ather 450X Full Review In Telugu

కింగ్ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్: ఏథర్ 450X దాని పెర్ఫామెన్స్‌తో, సులభమైన రైడింగ్‌తో ఆకట్టుకుంటుంది. 2025కి సంబంధించి,న కొత్త అప్‌డేట్‌తో, మ్యాజిక్ ట్విస్ట్ రీజెన్ ఫీచర్‌‌ను కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఛార్జింగ్ సమయం కొంచెం తగ్గించడంతో పాటు రేంజ్ మరికాస్త ఎక్కువ వస్తే బాగుంటుంది. చివరగా కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2025, 12:00 [IST]
English summary
2025 ather 450x full review riding impressions specifications and features in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+