2025 KTM 390 Adventure Review: కేటీఎమ్ 390 అడ్వెంచర్ బైక్ అదరగొట్టిందా? ఫెర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కేటీఎమ్(KTM) దాని ప్రసిద్ధ 390 సిరీస్‌లో 390 అడ్వెంచర్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఇది రైడర్లకు అనుకూలంగా ఉండే డిజైన్‌తో రూపుదిద్దుకుంది. తక్కువ సీటు ఎత్తుతో సహా అనేక రకాల ఇతర ఆప్షన్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది. మొదటి తరం 390 అడ్వెంచర్ కొన్ని సమస్యలను కలిగి ఉంది. ఎందుకంటే ఇది స్ట్రీట్-స్పెక్ 390 డ్యూక్ ఆధారంగా ఉంటుంది. అందుకే ఈ సారి కంపెనీ KTM దాని 450 ర్యాలీ డాకర్-విజేత బైక్ నుంచి ప్రేరణ పొందింది. రెండవ తరం 390 అడ్వెంచర్‌తో హిట్ మోడల్ అనిపించుకోవాలని చూస్తుంది. తాజాగా KTM 390 అడ్వెంచర్‌ను గోవాలో మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ డ్రైవ్ చేసింది. రెండు రోజుల పాటు రెండు వేర్వేరు రైడ్‌ల చేయడం జరిగింది. దీన్ని నడిపిన సమయంలో మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

2025 KTM 390 అడ్వెంచర్ డిజైన్: కొత్త తరం 390 అడ్వెంచర్ డిజైన్ దాని డాకర్-విజేత 450 ర్యాలీ మోటార్‌సైకిల్ నుండి ప్రేరణ పొందిందని KTM పేర్కొంది. దీనికి ముందు భాగంలో ఎత్తైన ముక్కు లాంటి ఫ్రంట్ ఫెండర్, పొడవైన, నియర్-వర్టికల్ విండ్‌స్క్రీన్, గుర్రపునాడా ఆకారంలో ఉండేటటువంటి LED DRLలతో చుట్టు ఉన్నటువంటి డ్యూయల్-LED హెడ్‌లైట్ సెటప్‌ కలిగి ఉంది.

2025 KTM 390 Adventure Design

390 అడ్వెంచర్ బైక్ 14-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వచ్చింది. సైడ్ ప్యానెల్‌లకు కొత్త కలర్‌ను ఇంజెక్ట్ చేశారు. హై-మౌంటెడ్ (ర్యాలీ-స్టైల్) 5-అంగుళాల కలర్ TFT స్క్రీన్, సింగిల్-పీస్ సీటు, చిన్న LED టెయిల్‌లైట్‌లను ఇది కలిగి ఉంటుంది. ఇవి బైక్ డిజైన్‌ను అట్రాక్టివ్‌గా మార్చాయి.

ఇంజిన్, మెకానికల్ బిట్స్ & ఎలక్ట్రానిక్ వివరాలు: 2025 KTM 390 అడ్వెంచర్ ఇంజిన్‌ను 390 డ్యూక్ నుండి తీసుకున్నారు. ఇది 399cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. 45.3bhp పవర్, 39Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది బై-డైరెక్షనల్ క్విక్-షిఫ్టర్, స్లిప్పర్ క్లచ్ సహాయంతో ఉంటుంది.

2025 KTM 390 Adventure Review Riding Impressions Specifications

కొత్త KTM 390 అడ్వెంచర్ ముందు భాగంలో 41mm WP USD ఓపెన్ కార్ట్రిడ్జ్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనో-షాక్‌తో సస్పెండ్ చేయబడిన స్ప్లిట్ ట్రేల్లిస్ ఫ్రేమ్ సెటప్‌ను కలిగి ఉంది. ముందు 200mm ఫోర్క్క్‌తో పాటు 30 స్టెప్స్ కంప్రెషన్, రీబౌండ్ డంపింగ్‌ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో మోనో‌షాక్ 20 క్లిక్స్ రీబౌండ్ డంపింగ్, 10 స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్, 205mm వీల్ ట్రావెల్‌తో వచ్చింది.

2025 390 అడ్వెంచర్ ముందు 21-అంగుళాల, వెనుక 17-అంగుళాల స్పోక్డ్ వీల్స్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 90/90 x21 అపోలో ట్యూబ్‌లెస్ టైర్లు, వెనుక భాగంలో 130/80 x 17 టైర్లను ఇచ్చారు. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు 320mm డిస్క్, వెనుక 220mm డిస్క్ ఉన్నాయి. వీటిని ఫ్లోటింగ్ కాలిపర్‌ల ద్వారా గట్టిగా బిగించారు.

2025 KTM 390 Adventure Review Tail Light

ఈ బైక్ రైడ్-బై-వైర్, కార్నరింగ్ ABS,ఆఫ్‌రోడ్ ABS,ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, మూడు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది. ఇది 5-అంగుళాల కలర్ TFT బ్లూటూత్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. KTM కనెక్ట్ యాప్ సహయంతో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మ్యూజిక్ కంట్రోల్‌ను యాక్సెస్ చేయవచ్చు.

రైడింగ్ ఇంప్రెషన్స్: 2025 KTM అడ్వెంచర్ 390 కీలకమైన కొత్త అప్‌డేట్‌లతో వచ్చింది. మునుపటి వెర్షన్‌తో పోలిస్తే యాక్సెసిబిలిటీ దీనిలో మరింత మెరుగైంది. ప్రధానంగా ఆఫ్‌రోడ్ రైడింగ్‌ను మరో కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. 830mm తగ్గిన సీటు ఎత్తు ద్వారా రైడర్లకు బైక్‌పై బలమైన గ్రిప్ లభిస్తుంది. సీటు మధ్య భాగంలో కూర్చున్నప్పుడు ఎత్తు తక్కువ ఉండటం వలన కాళ్లు కింది వరకు అందుతాయి.

2025 KTM 390 Adventure

ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. బైక్ నిలిపిన సమయంలో తమ పాదాలను నేల భాగానికి సులభంగా తాకించి కంట్రోల్ చేయవచ్చు. అయితే, KTM కుషనింగ్‌ను మరింత మెరుగ్గా అందించే ఉంటే బాగుండేదని మాకు అనిపించింది. ముఖ్యంగా పిలియన్ రైడర్ కోసం ఇవ్వాల్సి ఉంది.

కొత్త, పొడవైన విండ్‌స్క్రీన్ హైవేలపై రైడింగ్ చేస్తున్న సమయంలో ఎదురుగా వచ్చే గాలి నుంచి మెరుగైన రక్షణను అందిస్తుంది. అయితే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు హ్యాండిల్‌బార్లు, ఫుట్‌పెగ్‌లపై చిన్న వైబ్రేషన్‌లు రావడం గమనించాం. మీరు లేచి నిలబడి ఆఫ్-రోడింగ్ చేసే సమయంలో ఆ పెగ్‌లు, హ్యాండిల్‌బార్ మీకు రైడింగ్‌‌లో మరింత కాన్ఫిడెన్స్‌ను అందిస్తాయి.

2025 KTM 390 Adventure Review Riding Impressions

2025 390 అడ్వెంచర్ ఇంజిన్‌ను 390 డ్యూక్ నుండి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ 399cc ఇంజిన్ ఆకట్టుకునే లో-ఎండ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్‌లో 25 కిమీ/గం నుండి వెళ్తున్నప్పుడు మూడవ గేర్‌ నుంచి కిందికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దీనిలోనే సాఫీగా ప్రయాణిస్తుంది. ఇది 390 డ్యూక్‌తో పోలిస్తే కొద్దిగా భిన్నమైన గేరింగ్‌ను కలిగి ఉంది

KTM పేర్కొన్న దాని ప్రకారం, 390 అడ్వెంచర్ 6.2 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు అందుకుంటుందని తెలిపింది. దీనిని వంపులు తిరగకుండా స్ట్రెయిట్‌గా ఉన్న మార్గంలో తీసుకెళ్లినప్పుడు అదే వేగంతో దూసుకుపోతుందని అనిపించింది. తక్కువ వేగంతో కూడా సజావుగా వెళ్లడానికి క్విక్ షిఫ్టర్ మరింతగా ఉపయోగపడుతుంది.

2025 KTM 390 Adventure Review Riding

ఇది ఆఫ్-రోడ్, స్ట్రీట్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌లకు అనుగుణంగా యాక్సలరేషన్ డైనమిక్‌లను అడ్జస్ట్ చేసుకుంటుంది. ఆఫ్-రోడ్ మోడ్ అత్యంత శక్తివంతమైన అనుభవాన్ని అందిస్తుంది. రెయిన్ మోడ్ ద్వారా నీరు ఉన్న లేదంటే తడిగా ఉన్న రోడ్లపై కూడా మెరుగైన నియంత్రణను కలిగిస్తుంది. ఆఫ్-రోడ్ మోడ్‌లో థ్రోటిల్ వేగవంతమైన ప్రతిస్పందన మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది.

2025 KTM 390 అడ్వెంచర్ సస్పెన్షన్ సెటప్ చాలా ఆకట్టుకుంటుంది, సర్దుబాటు చేయగల ముందు ఫోర్క్స్, వెనుక మోనో-షాక్ బంప్‌లు నగరంలోని గుంతల రోడ్లపై మొదలుకుని కఠిన రోడ్లపై కూడా బైక్‌ను సులభంగా రైడ్ చేసేలా చూస్తాయి. బ్రేకింగ్ సెటప్ బాగానే ఉంది. హైవే రోడ్లపై, కఠినమైన ఆఫ్‌రోడ్లపై కూడా డిస్క్‌లు కొత్త 390 అడ్వెంచర్‌ను సమర్థంగా కంట్రోల్ చేస్తాయి.

2025 KTM 390 Adventure Review In Telugu

చివరగా: 2025 KTM 390 అడ్వెంచర్‌ను ఆఫ్‌రోడర్ కోసం ఆస్ట్రియన్ సంస్థ కీలకంగా దృష్టి సారించినట్లు అర్థం అవుతుంది. ఇది అడ్వెంచర్స్ కోరుకునే ప్రతి రైడర్‌కు కావలసిన వాటన్నింటిని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. సీటు, మరింత శక్తివంతమైన ఇంజిన్, సస్పెన్షన్ సెటప్ అన్ని కూడా దాని పాతతరం మోడల్‌ను అప్‌గ్రేడ్ అయింది. రైడర్లు ఇది అనుకూలంగా ఉంటుందని మేము సిఫార్స్ చేస్తున్నాం.

More from DriveSpark

Article Published On: Tuesday, February 25, 2025, 10:00 [IST]
English summary
2025 ktm 390 adventure review riding impressions specifications and features in telugu
Read more on: #ktm #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+