ఈ బైక్ ముందు సూపర్ కార్లు కూడా బలాదూర్.. రాయల్ ఎన్‌ఫీల్డ్‎లో సరికొత్త విస్ఫోటనం

భారతీయ రోడ్లపై రాయల్ లుక్ కోసం పాకులాడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గెరిల్లా 450 మోడల్‌లో 2026 కోసం సరికొత్త అపెక్స్ (Apex) వేరియంట్‌ను లాంచ్ చేసింది. అస్సాంలోని గౌహతి ఘాట్ రోడ్లు, హైవేలపై ఈ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత తేలిన విశేషాలు, ఇందులో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అసలు అపెక్స్‎లో కొత్తగా ఏముంది ?
గెరిల్లా 450 సిరీస్‌లో డాష్ (Dash), ఫ్లాష్ (Flash) వేరియంట్ల కంటే అపెక్స్ వేరియంట్ చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన మార్పు రైడర్ ట్రయాంగిల్. కొత్తగా అందించిన అల్యూమినియం హ్యాండిల్‌బార్ మునుపటి కంటే కొంచెం కిందకు, ముందుకు వంగి ఉంటుంది. దీనివల్ల బైక్ నడిపేటప్పుడు మీరు కొంచెం ముందుకు వంగి అగ్రెసివ్‌గా నడపవచ్చు.

2026 Royal Enfield Guerrilla 450 Apex First Ride Review Sportier Stickier and Faster

అంతేకాకుండా, ఈ బైక్‌కు వ్రెడెస్టెయిన్ సెంటారో ST (Vredestein Centauro ST) టైర్లను వాడారు. ఇవి ఈ సెగ్మెంట్లోనే అత్యంత వెడల్పైన, గ్రిప్ ఇచ్చే టైర్లు అని కంపెనీ చెబుతోంది. ఇక లుక్స్ విషయానికి వస్తే, హెడ్‌లైట్ పైన కొత్త కౌల్ (Cowl), వెనుక సీటుకు రిమూవబుల్ కౌల్ ఇచ్చారు. మీరు ఒంటరిగా వెళ్లేటప్పుడు దీన్ని సీటుకు ఫిక్స్ చేస్తే బైక్ సింగిల్ సీటర్ స్పోర్ట్స్ బైక్‌లా కనిపిస్తుంది.

టెక్నాలజీ, రైడింగ్ మోడ్స్
2026 గెరిల్లా 450 అపెక్స్‌లో రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి - స్ట్రీట్ (Street), స్పోర్ట్ (Sport). ఇందులో ఒక మంచి ఫీచర్ ఏంటంటే మెమరీ ఫంక్షన్. అంటే మీరు బైక్ ఆపేటప్పుడు ఏ మోడ్‌లో ఉన్నారో, మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అదే మోడ్‌లో బైక్ ఉంటుంది. ప్రతిసారి సెట్ చేసుకోవాల్సిన పనిలేదు. అప్‌డేటెడ్ ట్రిప్పర్ డ్యాష్ (Tripper Dash) ద్వారా గూగుల్ మ్యాప్స్ వాడుకోవచ్చు. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ అన్‌లాక్ చేయకుండానే నావిగేషన్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

2026 Royal Enfield Guerrilla 450 Apex First Ride Review Sportier Stickier and Faster

ఇంజిన్ పవర్ - పెర్ఫార్మెన్స్
మెకానికల్ గా చూస్తే పాత ఇంజినే కొనసాగిస్తున్నారు. ఇందులో 452cc సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజిన్ ఉంది. ఇది 39bhp పవర్, 40Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల గేర్లు మార్చడం చాలా స్మూత్ గా ఉంటుంది. 3,000 RPM దాటిన తర్వాత ఈ బైక్ ఇచ్చే పికప్ మామూలుగా ఉండదు. హైవేలపై వంద దాటించినా ఇంజిన్ చాలా హ్యాపీగా, వైబ్రేషన్లు లేకుండా ముందుకు సాగుతుంది.

రైడింగ్ అనుభవం ఎలా ఉంది?
గౌహతి ఘాట్ రోడ్లపై ఈ బైక్ నడుపుతున్నప్పుడు ఆ కొత్త టైర్ల పవర్ ఏంటో అర్థమవుతుంది. మలుపుల్లో బైక్ చాలా కాన్ఫిడెంట్‌గా తిరుగుతుంది. హ్యాండిల్‌బార్ పొజిషన్ మార్చడం వల్ల అగ్రెసివ్ గా రైడ్ చేసే వారికి ఇది బాగా నచ్చుతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, వెనుక ఉన్న మోనోషాక్ సెటప్ మునుపటి కంటే కొంచెం మెత్తగా (Plush) అనిపిస్తుంది. దీనివల్ల దూర ప్రయాణాల్లో కూడా నడుము నొప్పి రాకుండా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) పక్కాగా పనిచేస్తుంది.

2026 Royal Enfield Guerrilla 450 Apex First Ride Review Sportier Stickier and Faster

కొన్ని లోపాలు కూడా ఉన్నాయ్
బైక్ అంతా బాగున్నా, ఫ్యూయల్ ట్యాంక్ సైజ్ కొంచెం పెద్దదిగా ఉంటే బాగుండేది. లాంగ్ ట్రిప్పులు వెళ్ళే వారికి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అలాగే ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్ బదులు యూఎస్‌డీ (USD) ఫోర్క్స్ ఇచ్చి ఉంటే బైక్ లుక్, పెర్ఫార్మెన్స్ మరో లెవల్లో ఉండేది.

ఫైనల్లీ
మొత్తానికి 2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 అపెక్స్ ఒక అద్భుతమైన ప్యాకేజీ. ఎంట్రీ లెవల్ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ బైక్ కావాలనుకునే వారికి, ముఖ్యంగా స్పోర్టీ రైడింగ్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీకు కేవలం మంచి గ్రిప్ మాత్రమే కావాలనుకుంటే డాష్ లేదా ఫ్లాష్ వేరియంట్లను కూడా ఎంచుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 31, 2026, 12:00 [IST]
English summary
2026 royal enfield guerrilla 450 apex first ride review sportier stickier and faster
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+