Aprilia RS 457 Bike Full Review అప్రిలియా RS 457 బైక్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
భారత్‌లో స్పోర్టీ బైక్ శ్రేణిలో ఇటాలియన్ టూ వీలర్ తయారీదారు అప్రిలియా ప్రసిద్ధి చెందింది. రేసింగ్‌తో పాటు, సూపర్ బైక్‌లుగా ప్రసిద్ధి చెందడంతో పాటు మోటో జీపీలో కూడా అప్రిలియా బైక్‌లు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా అప్రిలియా RS 457(Aprilia RS 457) సూపర్ బైక్.. ఇటీవల జరిగిన శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్‌లో ప్రపంచానికి పరిచయం అయింది.
కాగా కొత్త అప్రిలియా RS 457 సూపర్ బైక్ ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో రేసింగ్, రైడింగ్ అభిమానులను ఉత్తేజపరిచింది. 2023 డిసెంబర్‌లో 'ఇండియా బైక్ వీక్(India Bike Week)'లో ధరతో పాటు RS 457 లాంచ్ అయింది. అంతకు ముందుగా మోటో జీపీ(MotoGP) ఇండియన్ రేసులో ఈ సూపర్ బైక్ అభిమానులకు జోష్‌నిచ్చింది.

ఈ క్రమంలో కోయంబత్తూరులోని కారీ మోటార్ స్పీడ్‌వేలో సరికొత్త RS 457ని పరీక్షించడానికి మా డ్రైవ్‌స్పార్క్ టీమ్‌ను అప్రిలియా ఆహ్వానించింది. దీంతో ఈ కొత్త మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్‌ను మేము ట్రాక్‌పై టెస్ట్ డ్రైవ్ చేశాం. ఈ బైక్ డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫామెన్స్ పూర్తి రివ్యూ ఈ కథనంలో..
డిజైన్: అప్రిలియా RS 457 సంస్థ యొక్క స్పోర్ట్స్ బైక్ శ్రేణిని ఎంట్రీ లెవెల్ మిడిల్ వెయిట్ పరిధిలోకి తీసుకువస్తుంది. ఇక డిజైన్ పరంగా RS 660, RSV4 నుంచి తీసుకుంది. కాగా ఈ బైక్ మరింత శక్తివంతమైన RS 660 స్పోర్ట్స్ బైక్‌కి చిన్న వెర్షన్‌గా కనిపిస్తుంది. ముందు వైపు టర్న్ ఇండికేటర్లను ఇంటిగ్రేటెడ్ LED DRL సెక్షన్‌లతో కూడిన సిగ్నేచర్ ట్రిపుల్ LED హెడ్‌లైట్ సెటప్‌తో చూడవచ్చు.

కొత్త అప్రిలియా RS 457 లో చెక్కిన ఇంధన ట్యాంక్ బైక్‌కు ఏరోడైనమిక్ రూపాన్ని అందిస్తుంది. స్ప్లిటింగ్ సీట్, షార్ప్ అండ్ పొట్టిగా ఉండే టెయిల్ సెక్షన్ LED టైల్‌లైట్ ద్వారా బైక్ రేసింగ్ లుక్‌కు తిరుగే లేనట్లుగా ఉంటుంది. కాగా అప్రిలియా RS 457 మూడు కలర్స్‌లో ప్రవేశపెట్టింది. ప్రిస్మాటిక్ డార్క్, ఒపలెసెంట్ వైట్, రేసింగ్ స్ట్రిప్స్.
ఫీచర్లు: కాగా మొదటి రెండు కలర్ బైక్‌లు రెడ్ వీల్స్‌తో ఉంటే.. మూడో కలర్ బైక్ రెడ్ రిమ్ టేప్‌తో బ్లాక్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. ఫీచర్ల పరంగా అప్రిలియా RS 457 లో అధునాతన ఫీచర్లను చూడవచ్చు. 5 అంగుళాల TFT డిస్‌ప్లే స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. డిస్‌ప్లేను అప్రిలియా యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు.

అప్రిలియా RS 457 డిస్‌ప్లే హ్యాండిల్‌బార్‌లపై రైడింగ్ మోడ్, గేర్, స్పీడ్, ఇంకా పలు వివరాలను ప్రదర్శిస్తుంది. ఇల్యుమినేటెడ్ కంట్రోల్ ద్వారా దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంజిన్ పరంగా అప్రిలియా RS 457 సరికొత్త 457cc సమాంతర ట్విన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. లిక్విడ్-కూల్డ్, ఫోర్-వాల్వ్ ఇంజిన్ డ్యూయల్-ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్‌లు మరియు ఫార్వర్డ్ ఫేసింగ్ సిలిండర్‌లను కలిగి ఉంటుంది.
అప్రిలియా RS 457 యొక్క సమాంతర-ట్విన్ ఇంజిన్ 9,400rpm వద్ద 46.93bhp మరియు 6,700rpm వద్ద 43.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా అప్రిలియా RS 457 రైడ్-బై-వైర్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లకు అనుమతివ్వడంతో పాటు ఆఫర్‌లో 4-వే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది.

కొత్త అప్రిలియా RS 457 ట్విన్- స్పార్ అల్యూమినియ్ ఫేమ్ సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రేం ముందు వైపున 41mm తో తలక్రిందులుగా ఉండే ఫోర్క్ మరియు వెనుకవైపు మోనోషాక్‌తో సస్పెండ్ చేయబడి ఉంటుంది. ముందు మరియు వెనుక సస్పెన్షన్ భాగాలు రెండింటినీ ప్రీలోడ్ కోసం సర్దుబాటు చేసుకోవచ్చు. ముందువైపు ఉన్న USD ఫోర్క్ 120mm, వెనుక మోనోషాక్ 130mm వీల్ ట్రావెల్‌తో వస్తుంది.
బ్రేకింగ్: అప్రిలియా RS 457 లో బ్రేకింగ్ విషయానికొస్తే ముందు వైపున 320 mm డిస్క్ మరియు వెనుక వైపు 220mm డిస్క్ బ్రేక్ ద్వారా నిర్వహించబడతాయి. యాంటీ-రోల్‌ఓవర్ సిస్టమ్‌తో డ్యూయల్-ఛానల్ ABS ద్వారా బ్రేక్‌లు పనిచేస్తాయి. అయితే ABS కూడా రెండు మ్యాప్‌లను కలిగి ఉంది. ఒకటి రెండు చక్రాలకు మరియు మరొకటి ముందు చక్రానికి మాత్రమే ఉంటుంది.

అప్రిలియా RS 457 TVS యూరోగ్రిప్ యొక్క ప్రోగ్రిప్ టైర్‌లతో కూడిన 17-అంగుళాల తేలికపాటి అల్యూమినియం అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. ఈ టైర్లు ముందు 110/70 మరియు వెనుక 150/60 కొలతలను కలిగి ఉంది. లో పెగ్స్, సున్నితంగా సెట్ చేయబడిన క్లిప్- ఆన్ హ్యాండిల్ బార్‌లతో రోజువారీ రైడింగ్ కోసం సెట్ చేశారు.
అప్రిలియా RS 457లో సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌తో పాటు బాడీ వర్క్ కారణంగా టర్నింగుల్లో సులభంగా మలుపులు తీసుకోవచ్చు. సమాంతర ట్విన్ ఇంజిన్ చాలా ట్రాక్టబుల్, చాలీ లీనియర్ పవర్ డెలివరీని కలిగి ఉంది. అయితే పవర్ చాలా తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. కాగా మీ రైడింగ్ స్టైల్‌తో మోడ్ వర్క్‌ను మీరు సులభంగా తెలుసుకోవచ్చు.

సస్పెన్షన్ సెటప్: అప్రిలియా RS 457 లో సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే ఇందులో సస్పెన్షన్ సెటప్ చాలా బాగా ట్యూన్ చేయబడింది. ట్రాక్‌పై అటు కఠినంగా, ఇటు మృదువుగా అనిపించదు. అయితే బ్రేక్‌ల విషయానికొస్తే మీరు మొదట పెడల్‌ను కిందికి నెట్టినప్పుడు లేదా లివర్‌ను లాగినప్పుడు బైట్ పాయింట్‌ను కనుగొనడానికి కొంత సమయం పట్టింది. అయితే గట్టిగా బ్రేక్ వేసిన ప్రతిసారి ABS సెటప్ ప్రారంభమవడాన్ని గమనించవచ్చు.

చివరగా రేసింగ్ అభిమానులను ఆకట్టుకుంటున్న KTM RC 390, Yamaha R3 మరియు కవాసకి నింజా 400 లాంటి సూపర్ బైక్‌లున్న సెగ్మెంట్‌లోకి అప్రిలియా RS 457 ప్రవేశించింది. అయితే బ్రేకుల విషయంలో కొంచెం మార్పులు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ పనితీరు విషయంలో రాజీ పడదు. వీధుల్లో సైతం RS 457 బ్రేకింగ్ పనితీరు సరిగానే ఉంటుంది. అయితే ఈ ధర వద్ద స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు అప్రిలియాను పరీక్షించాల్సిన అవసరముంది.


Click it and Unblock the Notifications








