Ather Rizta Family E-Scooter Full Review ఏథర్ రిజ్టా ఫీచర్లు, డిజైన్, బ్యాటరీ ఫర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
బెంగుళూరుకు చెందిన ఏథర్ ఎనర్జీ 2011లో స్థాపించబడింది. అప్పటి నుంచి దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ల అమ్మకాల్లో టాప్ కంపెనీలలో ఒకటిగా కొనసాగుతోంది. అధిక రేంజ్‌తో పాటు మెరుగైన పనితీరుతో ఏథర్ సంస్థ తయారు చేసే స్కూటర్లు భారతీయ మార్కెట్‌లో మంచి గుర్తింపుని సంపాదించాయి.
ఈ సంస్థకు చెందిన ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లు మంచి పనితీరుతో కస్టమర్లకు మరింత చేరువ అయ్యాయి. ఈ స్కూటర్లు ఫుల్ పవర్-ప్యాక్డ్ టూ-వీల్ గా పేరుగాంచాయి. తాజాగా ఏథర్ ఇప్పుడు స్కూటర్ ప్రేక్షకుల కోసం కుటుంబంతో సులభంగా ప్రయాణించేలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.

దాని పేరే ఏథర్ రిజ్టా. ఈ స్కూటర్ ప్రత్యేకంగా ఫ్యామిలీల కోసం ప్రత్యేకంగా సంస్థ రూపొందించింది. ఈ స్కూటర్‌ను మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్ రైడ్ చేసింది. ఈ స్కూటర్ పనితీరు ఎలా ఉంది? ఫ్యామిలీలకు ఇది బెస్ట్ స్కూటరా లేదా అనే విషయాన్ని ఈ రివ్యూలో తెలుసుకుందాం..
డిజైన్ & ఫీచర్స్: రిజ్టా కంటే ముందు ఉన్న ఏథర్ స్కూటర్‌లు దీనికంటే భిన్నమైన డిజైన్‌లను కలిగి ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న స్కూటర్లు పరిమాణంలో కొద్దిగా చిన్నదిగా ఉండటం గమనించవచ్చు. అయితే ఏథర్ రిజ్టా పొడవు ఎక్కువ ఉండనుంది. 450 సిరీస్‌లతో పోలిస్తే డిజైన్‌లో దీని డిజైన్‌లో చాలా మార్పులు చూడవచ్చు. ముఖ్యంగా ఈ స్కూటర్‌లో సీటింగ్ సామర్థ్యం ఎక్కువ కల్పించారు.

రోడ్డుపై తిరిగే ఇతర సంప్రదాయ స్కూటర్‌లాగా ఈ రిజ్టా కనిపిస్తుంది. ప్రత్యేకించిన స్టైల్‌తో ఉన్న దీనిని క్షుణ్ణంగా పరిశీలించినట్లైతే మీకు కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీని ముందు భాగంలో పూర్తిగా వైట్ కలర్‌తో వస్తుంది.
ఇక రిజ్టా ఫ్రంట్‌లో ప్రత్యేక లైటింగ్ సెటప్‌ను కలిగి హైలైట్ చేయబడిన స్ట్రిప్‌ను గమనించవచ్చు. ఈ పొడవాటి బార్ ఇంటిగ్రేటెడ్ DRLలు మరియు టర్న్ ఇండిగేటర్‌లతో హెడ్‌లైట్ సెటప్‌ను కలిగి ఉంది. ఫుట్‌బోర్డ్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక భాగంలో చుట్టబడిన బాడీ కలర్‌లో సైడ్ ప్యానెల్‌లు ఉంటాయి. దీని సీటు చాలా పొడవుగా ఉండటం గమనించవచ్చు. పిలియన్ రైడర్ కూడా దీనిపై హాయిగా ప్రయాణించ్చు.

900mm పొడవైన సీటు కింద 32-లీటర్ బూట్ స్పేస్ ఉంది. ఇక ఫుట్‌బోర్డ్ వద్ద ఫ్లెక్సిబుల్ ఫ్రంక్ (22-లీటర్లు)తో కలిపి మొత్తం ఈ స్కూటర్‌లో మీరు 54 లీటర్ల లగేజీ స్పేస్‌ని పొందవచ్చు. ఇక Rizta Z వేరియంట్‌లో 7-అంగుళాల TFT స్క్రీన్‌ను కలిగి ఉండగా, Rizta Sలో 450S మాదిరిగా 'డీప్‌వ్యూ' LCDని పొందుపరచారు.
ఈ స్కూటర్‌లో నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్, థెఫ్ట్ నోటిఫికేషన్‌లు, అలెక్సా మరియు మరిన్ని ఇతర అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. 'ప్రో' ప్యాకేజీ స్కూటర్‌లో డ్యూయల్ డిస్‌ప్లేలు ప్రత్యేకించి అనేక ఫీచర్లకు అనుమతిస్తాయి. Z వేరియంట్‌లో ప్రయాణం చేసేటప్పుడు Google Maps, WhatsApp ప్రివ్యూలు మరియు కాల్ అలర్ట్స్ వంటివి ప్రత్యేకంగా అందించారు.

ఇక సేఫ్టీ పరంగా చూస్తే Ather Rizta సంస్థ కొత్త స్కిడ్ కంట్రోల్ టెక్నాలజీతో వచ్చింది. దీని వల్ల వెనుక చక్రం స్లిప్ అయ్యే సమయంలో సెన్సార్‌లు యాక్టివేట్ అవుతాయి. స్కూటర్ జారిపోయే సమయంలో పవర్ అవుట్‌పుట్‌ను మాడ్యులేట్ చేస్తుంది. ఎమర్జెన్సీ బ్రేకింగ్ సమయంలో బ్రేక్ లైట్‌ను ఫ్లాష్ చేసే సిస్టమ్ అలర్ట్ మరియు స్కూటర్ పడిపోయినప్పుడు మోటారును కత్తిరించే ఏథర్ ఫాల్ సేఫ్ ఫీచర్ కూడా ఉంది.
స్పెసిఫికేషన్స్ రేంజ్ & డైమెన్షన్స్: బిగ్గర్ & బెటర్ అనే రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో Ather Rizta అందుబాటులో ఉంది. 2.9kWh (S & Z) మరియు 3.7kWh (Z మాత్రమే)గా ఉన్నాయి. బేస్ 2.9kWh బ్యాటరీ ప్యాక్ 123km రేంజ్‌ని అందిస్తుంది. పోర్టబుల్ ఛార్జర్‌తో దీని పూర్తి ఛార్జ్ చేయడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.

ఇక మరో బ్యాటరీ ప్యాక్ ఒకే ఛార్జ్‌పై 159 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీనికి Ather Duo ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6:10 నిమిషాలు మాత్రమే సయం పడుతుంది. రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు (10 నిమిషాల్లో 15 కి.మీ) సపోర్ట్ చేస్తాయి. ఇవి IP67 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌తో రానున్నాయి.
ఇక రిజ్టా బ్యాటరీ ప్యాక్‌లు 5 ఏళ్ల స్టాండర్డ్/60,000కిమీ వారంటీతో వస్తాయి. 5.76bhp వద్ద 22Nm గరిష్ట అవుట్‌పుట్ అందించే ఎలక్ట్రిక్ మోటారుకు అనుసంధానించబడి ఉంటాయి. కొత్త ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్‌ను 0-40కిమీ/గం చేరుకోవడానికి కేవలం 4.7 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ.

ఏథర్ రిజ్టా 90/90-12 (ముందు), 100/80-12 (వెనుక) MRF ట్యూబ్‌లెస్ టైర్‌లతో 12-అంగుళాల చక్రాలతో నడుస్తుంది. ముందు 200mm డిస్క్ మరియు వెనుక 130mm డ్రమ్ మరియు కాంబి-బ్రేకింగ్ సెటప్ ఉంది. Ather Rizta 1,850mm పొడవు, 750mm వెడల్పు, 1,140mm ఎత్తు, 1,285mm పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 400mm వాటర్-వేడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
రైడింగ్ ఇంప్రెషన్స్: ఏథర్ రిజ్టా స్మార్ట్ ఎకో మరియు జిప్ అనే రెండు రైడింగ్ మోడ్‌లతో అందించబడుతుంది. స్మార్ట్ ఎకో మోడ్ స్కూటర్ స్టార్టింగ్ మోడ్‌లో ఉంటుంది. అయితే మీరు అధిక వేగంతో వెళ్లే కొద్దీ అది మారిపోతుంది. పట్టణాల్లో వినియోగానికి ఇది చాలా మంచిది. రిజ్టాపై ఉత్తమంగా ప్రయాణించాలంటే జిప్ మోడ్‌లో మాత్రమే సాధ్యం. స్మార్ట్ ఎకో కూడా మంచి పవర్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంటుంది.
మీరు గరిష్టంగా 80కిమీ/గం వేగంలో ప్రయాణిస్తున్నప్పుడు రిజ్టా వేగం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ స్పీడ్ తగ్గుముఖం పడుతుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వెనుక భాగంలో ఉన్న సెటప్ కంటే కొంచెం మెత్తగా ఉంది. అయితే మొత్తంగా రిజ్టా బంప్‌లు, ఎత్తు పల్లాలు మరియు గుంతలను ఎదుర్కోవడంలో తేలికగా ఉంది. జారే పరిస్థితులలో, స్కిడ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేసింది.

దీని కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ బాగా పని చేస్తుంది. హార్డ్ బ్రేకింగ్‌లో కూడా, వెనుక చక్రం లాక్ చేయబడినప్పుడు కూడా రిజ్టాను అక్కడికక్కడే నిలిచిపోతుంది. ఇద్దరు రైడర్‌లతో వెళ్తున్నప్పుడు రిజ్టా బ్రేక్‌లు కొద్దిగా బలహీనంగా అనిపించాయి. పట్టణాల్లోని వీధుల్లో ఫ్యామిలీతో ప్రయాణించే సమయంలో మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
చివరగా: ఏథర్ రిజ్టా బెంగుళూరు సంస్థ మొదటిసారిగా కుటుంబ స్కూటర్ల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మీ రోజువారీ కుటుంబ స్కూటరింగ్ అనుభవాన్ని ఎలక్ట్రిక్‌గా మార్చుకోవడానికి ఇది సరైన స్కూటర్. ఈ స్కూటర్ అధిక రేంజ్‌తో పాటు మరిన్ని స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఇక కుటుంబ అవసరాల కోసం తగినంత బూట్ స్పేస్ కల్పించారు. మీ కుటుంబాలకు ఏథర్ రిజ్టా ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








