సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar), ఈ పేరు అందరికి సుపరిచయమే. ఎందుకంటే దేశీయ మార్కెట్లో ఒకప్పటి నుంచి కూడా అత్యంత ఆదరణ పొందుతున్న బైకులలో ఈ 'బజాజ్ పల్సర్' బైకులు కూడా ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 70 దేశాలలో ఈ బైకులు విక్రయించబడుతున్నాయి. అయితే పల్సర్ బ్రాండ్‌లో అనేక రకాలు మరియు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ (Bajaj Pulsar) భారతీయ మార్కెట్లో 20 సంత్సరాల క్రితం అంటే సరిగ్గా 2001 అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. ఈ బైకులు మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అద్భుతమైన స్పందనను పొందుతున్నాయి. విడుదలైనప్పటి నుంచి ఇప్పటికి వరకు ఈ బైకులో అనేక అప్డేట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

అయితే ఇటీవల, అంటే 2021 అక్టోబర్ 28 న దేశీయ విఫణిలో సరికొత్త బజాజ్ పల్సర్ 250 మోటార్‌సైకిళ్లు విడుదలయ్యాయి. ఇందులో N250 మరియు F250 అనే రెండు బైకులున్నాయి. అయితే ఈ బైకులు మునుపటి పల్సర్ బైకులకంటే కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉన్నాయి.

ఇప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త Bajaj Pulsar N250 ఎలాంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది, ఎలాంటి పర్ఫామెన్స్ అందిస్తుంది అని తెలుసుకోటానికి మేము ఇటీవల పూణేలోని చకాన్ వద్ద బజాజ్ ప్లాంట్ లో కొత్త Pulsar N250 బైక్ రైడ్ చేసాము. కావున ఈ బైక్ గురించి మరింత సమాచారం ఇప్పుడు ఇక్కడ మీ కోసం తీసుకువచ్చాము. ఈ బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడవచ్చు.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Bajaj Pulsar N250 డిజైన్ మరియు స్టైల్:

Bajaj Pulsar N250 మరియు F250 బైకులు చూడగానే ఆకర్షించే విధంగా ఉన్నాయి. అయితే ఈ బైకులకు ఇంత మంచి డిజైన్ చేయడం అనేది చాలా కష్టమైన పని, ఎందుకంటే కొత్త మోటార్‌సైకిళ్లు సరికొత్తగా ఉన్నప్పటికీ పల్సర్ క్యారెక్టర్ లైన్‌లను చెక్కుచెదరకుండా ఉంచాలి, కావున వీటి డిజైన్ కొంత కష్టతరంగానే ఉంటుంది, కానీ అద్భుతంగా ఉంటుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ కొత్త మోటార్‌సైకిల్‌కు ఫ్యూయల్ ట్యాంక్ నుండి వెనుక వరకు ఉండే మస్కులర్ క్యారెక్టర్ లైన్ మొదటి నుండి అన్ని పల్సర్ మోడళ్లలో ఒక స్టాండర్డ్ ఫీచర్‌గా ఉంది. అయితే ఆ తర్వాత 2006 వ సంవత్సరంలో కంపెనీ ట్విన్ వర్టికల్ స్టాక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను పరిచయం చేసింది. అది అప్పటి నుండి అన్ని పల్సర్ మోడళ్లలో ఒక ఫీచర్ గా నిలిచిపోయింది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఈ రెండు కొత్త బైకులతో చాలా ఫీచర్స్ అలాగే ఉన్నాయి. కానీ కొన్ని కొత్త మార్పులను ఈ బైకులలో మీరు గమనించవచ్చు. ఇందులో హెడ్‌ల్యాంప్ యూనిట్‌లో మోటార్‌సైకిల్ ముందు భాగం వరకు మాస్కులార్ లైన్ విస్తరించి ఉంటుంది. వర్టికల్ టెయిల్ ల్యాంప్ ఇప్పుడు అప్పర్ ఎండ్ వైపు కొద్దిగా వక్రతను కలిగి ఉండటం, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ రెండు డిజైన్ అంశాలను పక్కన పెడితే, మిగిలిన మోటార్‌సైకిల్ సరికొత్తగా ఉంటుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

పల్సర్ N250 బైక్ యొక్క డిజైన్, దాని పల్సర్ NS200 నుంచి కొంత ప్రేరణ పొందింది అని చెప్పవచ్చు. అయినప్పటికీ, ఇది చాలా స్పోర్టివ్‌గా మరియు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగంలో షార్ప్ మరియు స్టైలిష్ హెడ్‌ల్యాంప్ యూనిట్ ఉంది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో సెంటర్ స్టేజ్ టేకింగ్ ఎక్స్‌పోజ్డ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఉంటుంది. ఇది LED DRL లను కూడా కలిగి ఉంటుంది. హెడ్‌ల్యాంప్ యూనిట్ పైన అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ N250 సింగిల్-పీస్ బార్ హ్యాండిల్‌ను కలిగి ఉంది, అంతే కాకుండా ఇందులోని స్విచ్ గేర్ కూడా సరికొత్తగా ఉంటుంది. పల్సర్ N250 యొక్క లైన్లు చాలా షార్ప్ గా ఉండి, బైక్ కి చాలా దూకుడు రూపాన్ని అందిస్తాయి. ఈ లైన్లు వెనుకవైపు వరకు సాగుతాయి.

పల్సర్ N250 స్ప్లిట్-సీట్‌ను కలిగి ఉంది, ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంజిన్ కేసింగ్ ముదురు గోల్డ్ షేడ్‌లో పూర్తి చేయబడింది మరియు ఇంజన్ కింద ఒక సూపర్ స్టైలిష్ ఇంజన్ కౌలింగ్ ఉంది, ఇది బాడీ కలర్‌లో పూర్తి చేయబడింది. మోటార్‌సైకిల్‌లో సింపుల్, క్లాసీ రెడ్ అండ్ వైట్ గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. ఇవి బైక్ ని మరింత దూకుడుగా కనిపించే విధంగా చేస్తాయి.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

మోటార్‌సైకిల్ యొక్క మొత్తం డిజైన్‌ మరింత ఆకర్షనీయంగా చేసే అంశం ఏమిటంటే, ఇందులో ఉన్న చిన్న మరియు మొండి ఎగ్జాస్ట్ యూనిట్. ట్విన్-పోర్ట్ ఎగ్జాస్ట్ ఎండ్-కెన్ సిల్వర్-కలర్ కవర్‌ను పొందుతుంది. అయితే ఇది మిగిలిన మోటార్‌సైకిల్స్ లో కాంట్రాస్టింగ్ ఎలిమెంట్‌గా మారుతుంది. ఒక్క మాటలో చెపాప్లంటే కొత్త పల్సర్ N250 చూడచక్కగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Bajaj Pulsar N250 ఫీచర్స్:

కొత్త బజాజ్ పల్సర్ N250 బైక్ దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే మంచి ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ అనలాగ్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. అంతే కాకుండా ఇందుల్ప్ టాకోమీటర్ మాత్రమే అనలాగ్ బిట్, ఇది మళ్లీ చాలా సంవత్సరాలుగా పల్సర్ మోడల్‌ల సిగ్నేచర్ ఫీచర్స్ లో ఒకటి.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

N250 బైక్ లో టాకోమీటర్ మధ్యలో ఉంచబడుతుంది మరియు ఎడమవైపున టెల్-టేల్ లైట్లు మరియు కుడివైపున LCD స్క్రీన్‌తో ఉంటుంది. ఇందులోని స్క్రీన్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, ఫ్యూయెల్ లెవెల్, ఇన్స్టంట్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ​​డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. అంతే కాకుండా మీరు యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీని కూడా పొందుతారు. ఇది నిజంగా రైడర్లకు చాలా అనుకూలమగా ఉంటుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

స్విచ్ గేర్ సరికొత్తది మరియు అన్ని ఇతర పల్సర్‌ల మాదిరిగానే బ్యాక్‌లైట్‌ను పొందుతుంది. ఇందులోని స్విచ్‌ల విషయానికి వస్తే బజాజ్ ఖచ్చితంగా నాణ్యతతో రాజీపడలేదు. ఇతర ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో సింగిల్-ఛానల్ ఏబీఎస్ మరియు మీ మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసుకోటానికి USB స్లాట్ వంటివి ఉన్నాయి.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కంపెనీ ఈ కొత్త బైకులను అద్భుతంగా తీర్చిదిద్దడమే కాకుండా, అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను అందించింది. అయితే నేటి కాలంలో విడుదలవుతున్న బైకులు దాదాపుగా బ్లూటూత్ కనెక్టివిటీని పొందుతాయి. కానీ ఈ కొత్త బజాజ్ పల్సర్ N250 లో ఈ ఫీచర్ లేదు. రాబోయే రోజుల్లో ఇది ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Bajaj Pulsar N250 ఇంజిన్ పర్ఫామెన్స్ మరియు రైడింగ్ ఇంప్రెషన్స్:

బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లు మంచి పనితీరుని అందిస్తాయి. పనితీరు విషయంలో బజాజ్ తనకు తానె సతి అని కూడా చెప్పవచ్చు. ఎక్కువమంది రైడర్స్ ఈ బైకులను కొనుగోలుచేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. కొత్త పల్సర్‌లు కూడా అదే అనుభూతిని అందిస్తాయా? అనే అనుమానం కొంత మందిలో కలిగి ఉంటుంది. మేము ఈ బైక్ రైడ్ చేసాము, కావున మీ అనుమానాలన్నింటికీ కూడా ఇక్కడ ఒక పరిస్కారం లభిస్తుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

కొత్త బజాజ్ పల్సర్ N250 కొత్త ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, 249 సిసి, సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 24.1 బిహెచ్‌పి పవర్‌ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 21.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ కూడా ఉంటుంది.

కొత్త బజాజ్ పల్సర్ N250 ని స్టార్ట్ చేయగానే చాలా స్మూత్ గా స్టార్ట్ అవుతుంది. అయితే సరైన త్రాటల్ లోకి వచ్చినప్పుడు పరిస్థితులు మారుతాయి. పల్సర్ 220లో మనం అలవాటు చేసుకున్న గ్రంటీ నోట్‌గా ధ్వని మారుతుంది. ఇది పల్సర్ 220 యొక్క క్విక్కర్ వెర్షన్ లాగా ఉంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇది కొత్త పల్సర్ N250 యొక్క పనితీరు 24.1 బిహెచ్‌పి పవర్‌ అవుట్‌పుట్ మరియు 5-స్పీడ్ గేర్‌బాక్స్ కాంబో అంతగా కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ, పవర్ మరియు టార్క్‌ అవుట్ ఫుట్ వివిధ ప్రపంచాలను బట్టి మారుతూ ఉంటాయి.

ఈ కొత్త బైక్ 3,000 ఆర్‌పిఎమ్ దిగువన, ఇంజిన్ వణుకుతుంది, అంతే కాకుండా కొంచెం తట్టడం జరుగుతుంది. అయితే 3,000 ఆర్‌పిఎమ్ తర్వాత, పరిస్థితులు మారతాయి. ఇది అన్ని గేర్‌లలో చాలా టార్కీగా అనిపిస్తుంది మరియు మిడ్‌రేంజ్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీరు 5,000 ఆర్‌పిఎమ్ మరియు 8,000 ఆర్‌పిఎమ్ మధ్య ఉంచినప్పుడు ఈ ఇంజిన్ యొక్క మెరుగైన పనితీరుని ఆస్వాదించవచ్చు.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

మొత్తానికి ఇంజిన్ స్మూత్‌గా అనిపిస్తుంది, కావున ఎక్కువ వైబ్రేషన్‌లు ఉండవు. 8,000 ఆర్‌పిఎమ్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంజిన్ కొంచెం ఒత్తిడికి లోనవుతుంది. అయితే ఇది రైడర్ కి ఎటువంటి సమస్యను కలిగించదు. 100కిమీ/గం తర్వాత, మీకు 6వ గేర్ అవసరమని భావించడం ప్రారంభించండి మరియు ఇక్కడే బజాజ్ ఎక్కువ మంది కొనుగోలుదారులను మనసును గెలుచుకునే అవకాశం ఉంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

ఇక కొత్త బజాజ్ పల్సర్ N250 యొక్క హ్యాండ్లింగ్ విషయానికి వస్తే, ఇది హ్యాండ్లింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని సింగిల్-పీస్ బార్ హ్యాండిల్ ఉన్నప్పటికీ ఇది దూకుడుగా ఉండే రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంది. పల్సర్ N250 చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. సస్పెన్షన్ హ్యాండ్లింగ్‌కు సహాయం చేయడానికి గట్టి వైపు కొద్దిగా అమర్చబడింది. మొత్తానికి ఇది మంచి హ్యాండ్లింగ్ బైక్. రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని తప్పకుండా కలిగిస్తుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Bajaj Pulsar N250 కలర్ ఆప్సన్స్, ధర & ప్రత్యర్థులు:

Bajaj Pulsar N250 బైక్ కేవలం రెండు కలర్ ఆప్సన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అవి రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే కలర్స్. ఈ రెండు కలర్స్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే టెక్నో గ్రే కలర్ బైక్ మాత్రం చాలా మెరుగ్గా మరియు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

Bajaj Pulsar N250 ధర రూ. 1.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ సెగ్మెంట్‌లోని అతి తక్కువ ఖరీదైన మోటార్‌సైకిళ్లలో Bajaj Pulsar N250 ఒకటి.

Bajaj Pulsar N250 బైక్ యమహా FZ25 మరియు సుజుకి జిక్సర్ 250 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. క్వార్టర్-లీటర్ సెగ్మెంట్‌లోని కొన్ని ఇతర మోటార్‌సైకిళ్లలో బజాజ్ డామినార్ 250, KTM 250 డ్యూక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తానికి ఈ బైక్ ఒక అద్భుతమైన బైక్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

సరికొత్త Bajaj Pulsar N250 రివ్యూ.. ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

Bajaj యొక్క ఈ కొత్త బైక్ మంచి డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ప్రారంభించబడినప్పుడు, బజాజ్ దానికి లిక్విడ్-కూలింగ్ మరియు ఆరవ గేర్‌ను ఎలా అందించాలి అనే దాని గురించి చాలా మంది ఫిర్యాదు చేయడం కనిపించింది. కానీ ఈ మోటార్‌సైకిల్ NS200 కి ప్రత్యామ్నాయం కాదు, దానిని మీరు గుర్తించాలి.

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మోటార్ సైకిల్ ని ఆధారంగా చేసుకుని, రానున్న పల్సర్ బైకులను తయారు చేయనున్నారు. బజాజ్ యొక్క కొత్త పల్సర్ F250 గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఫాలో అవ్వండి. పల్సర్ F250 గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.

Most Read Articles

English summary
Bajaj pulsar n250 telugu review riding impressions engine specs performance features details
Story first published: Friday, November 5, 2021, 22:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X