బజాజ్ ప్రేమికుల మనసు దోచే 'బజాజ్ పల్సర్ P150' రివ్యూ: చూసారా..!!
భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ అడుగుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు దానికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. 2001 నుంచి కూడా ఈ బైక్ ప్రేమికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పల్సర్ విభాగంలో 150 మరియు 180 బైకులు మాత్రమే కాకుండా N250, F250, N160 కూడా ఉన్నాయి.
కాగా ఇటీవల బజాజ్ ఆటో దేశీయ విఫణిలో పల్సర్ విభాగంలో మరో సర్వ్ కొత్త గేమ్ చేంజర్ విడుదల చేసింది. అదే 'బజాజ్ పల్సర్ పి150' (Bajaj Pulsar P150). ఈ బైక్ ఇటీవల మేము రైడ్ చేసాము. కావున ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమంగా ఉందా.. లేదా, డిజైన్ ఏ విధంగా ఉంది, ఇంజిన్ పర్ఫామెన్స్ ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

Bajaj Pulsar P150 డిజైన్ మరియు ఫీచర్స్:
భారతీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త 'బజాజ్ పల్సర్ P150' డిజైన్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఈ బైక్ యొక్క హెడ్‌లైట్ N160 మరియు N250 మాదిరిగా అనిపిస్తుంది. కానీ ఇది కొత్తగా ఉంటుంది. ఇది బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ యూనిట్ కావున చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి కొంత పైన LED పైలట్ ల్యాంప్ చూడవచ్చు. ఇవి N160 మరియు N250 మోడల్స్ మాదిరిగా కాకుండా సింగిల్-పీస్ యూనిట్.
ఇంకా ఇందులో మీరు గమయించినట్లయితే హెడ్‌ల్యాంప్ పైన ఉండే చిన్న ష్రౌడ్ ఎలిమెంట్ మరియు ఇండికేటర్స్ వంటివి ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా ఈ బైక్ లో మీరు ఎంచుకునే కలర్ బైక్ యొక్క 17-ఇంచెస్ వీల్స్ మరియు అండర్ బెల్లీ ప్రొటెక్షన్ సెటప్‌పై కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఇచ్చి చూడటానికి చాలా ఆధునికంగా అనిపిస్తుంది. తప్పకుండా బజాజ్ ప్రేముకులను ఆకర్శించడంలో విజయం పొందే అవకాశం కూడా ఉంది.

కొత్త బజాజ్ పల్సర్ P150 బైక్ 14 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. దానికి పక్కనే కొంత ముందు ఛార్జ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అంతే కాకుండా బజాజ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే కన్సోల్ అని పిలిచే సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో మీరు చూడవచ్చు. ఇది బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్ కి అందిస్తుంది.
ఈ బైక్ లో మరో తెలుసుకోవాల్సిన అంశం అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. ఇది ఈ బైక్ లో కొత్తది. కావున మునుపటి మోడల్స్ కంటే కూడా కొత్తగా అనిపిస్తుంది. ఈ బైక్ లో సింగిల్ సీట్ మరియు స్ప్లిట్ సీట్ కాన్ఫిగరేషన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇది మీరు ఎంచుకునే వేరియంట్ (సింగిల్ లేదా డ్యూయల్ డిస్క్) మీద ఆధారపడి ఉంటుంది. ఈ సీటింగ్ అనేది రైడింగ్ పొజిషన్‌ను కొంత మారుస్తుంది.

బజాజ్ పల్సర్ పి15 బైక్ వెనుక భాగంలో సిగ్నేచర్‌గా మారిన స్ప్లిట్ LED టెయిల్‌లైట్ ఉంటుంది. కొత్త మోనోషాక్ సెటప్ మరియు విస్తృత 110/80 సెక్షన్ రియర్ టైర్ కూడా మీరు ఇందులో స్పష్టంగా చూడవచ్చు. దాదాపు అన్ని డిజైన్ ఎలిమెంట్స్ దాని మునుపటి మోడల్స్ ని గుర్తు చేసినప్పటికీ బరువు కొంత తక్కువగానే ఉంటుంది. పల్సర్ 150 తో పోలిస్తే పి150 డ్యూయల్-డిస్క్ వేరియంట్ బరువు 10 కేజీలు తక్కువగా ఉంటుంది.
Bajaj Pulsar P150 స్పెక్స్ & రైడింగ్ ఇంప్రెషన్స్:
కొత్త Bajaj Pulsar P150 బైక్ సరికొత్త 149.68 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 హెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రానికి పవర్ డెలివరీ చేస్తుంది. కావున ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది.
కొత్త పల్సర్ P150 యొక్క ఇంజిన్ మంచి పనితీరుని అందిస్తుందని తెలిసింది. ఫ్లాట్ టార్క్ కర్వ్ కారణంగా P150 యొక్క ఇంజిన్ చాలా ట్రాక్టబుల్ మరియు కంపనాలు కూడా లేకుండా పనిచేస్తుంది. ట్రాక్టబుల్ ఇంజన్ అంటే, మీరు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను తక్కువగా పైకి క్రిందికి మార్చవలసి ఉంటుంది, కావున అలాంటి సమయంలో మీకు నగరంలో మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఈ బైక్ లో ఉన్న అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ నుండి విడుదలయ్యే సింగిల్-సిలిండర్ పవర్‌ప్లాంట్ నుండి సౌండ్‌ట్రాక్ అంత చిన్న ఇంజిన్‌కు బస్సీగా ఉంటుంది. ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు మోనో షాక్ ఉంటుంది. కావున ఇది ఎలాంటి రహదారిలో అయినా సజావుగా ముందుకు సాగుతుంది. ఇందులోని 110 మిమీ వెనుక టైర్ కూడా రైడింగ్ లో ఉత్తమ పనితీరుని చూపిస్తుంది.
మేము రైడ్ చేసిన బైక్ పల్సర్ P150 డ్యూయల్-డిస్క్ వెర్షన్. ఇది మంచి కుషనింగ్ అందించింది. రైడర్ సీటు చుట్టూ కూడా తగిన స్థలం ఉంటుంది. పిలియన్ సీటు కూడా చాలా అనుకూలంగా ఉంది. కావున లాంగ్ రైడ్ లో కూడా చాలా మంచి అనుభూతిని అందిస్తుంది. ఇందులోని 795 మిమీ సీటు పొట్టి రైడర్‌లకు కొంచెం పెద్దగా అనిపించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ బైక్ సైజ్ జీరో సెంట్రల్ ప్రొపోర్షన్‌లు మరియు తేలికైన నిర్మాణం వల్ల సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.
బజాజ్ పల్సర్ పి150 టాప్-స్పెక్ డ్యూయల్-డిస్క్ మోడల్ క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు రైడర్ స్పోర్టీ పొజిషన్‌లోకి రావడానికి అనుమతిస్తాయి. అదే సమయంలో రైడర్‌లు తమ కాళ్లతో ఫ్యూయల్ ట్యాంక్ పట్టుకోగలిగేలా సీటుపై కదలవచ్చు. అయితే, కొద్దిగా వెనుకకు అమర్చిన ఫుట్‌పెగ్‌లు మరియు ఎత్తైన ఫ్యూయెల్ ట్యాంక్ రైడింగ్ చేసేటప్పుడు కొంత కఠినంగా అనిపించే అవకాశం ఉంటుంది.
ఇక బ్రేకింగ్ విషయానికీ వస్తే, పల్సర్ P150 యొక్క డ్యూయల్-డిస్క్ వెర్షన్ 260 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక 230 మిమీ డిస్క్‌ను కలిగి ఉంది. సింగిల్-ఛానల్ ABS సెటప్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. కావున షార్ప్ బ్రేకింగ్ మీరు అనుభవించవచ్చు. మొత్తం మీద ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్ పనితీరు కూడా తప్పకుండా బైక్ రైడర్లను ఆకర్షిస్తుంది.
Bajaj Pulsar P150 పై మా అభిప్రాయం:
బజాజ్ పల్సర్ P150 అనేది బజాజ్ యొక్క కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పుట్టుకొచ్చిన నాల్గవ కొత్త పల్సర్. కావున ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకూండా ఇది ఉత్తమ పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంది, కావున తప్పకుండా ఆధునిక కాలంలో ఈ బైక్ పల్సర్ ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








