షార్ట్(పొట్టి) రైడర్స్ కోసం అతి ఉత్తమమైన స్కూటర్‌లు

By Anil

స్కూటర్‌లు నగరాలలో ప్రయాణించడాని ఎంతో సులభంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి గేర్స్‌ను కలిగి ఉండవు కాబట్టి, మరియు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సిని కలిగి ఉంటాయి.

మీరు పొట్టిగా ఉంటారు కాబట్టి ప్రతి రోజు గేర్ లేని స్కూటర్‌‌ని వాడుతున్నారు నిజమేనా? మీరు పొట్టిగా ఉండటం వలన ప్రతి చిన్న అవసరానికి స్కూటర్‌‌ని వాడాలా వద్దా అని సతమతమౌతున్నారా? మీరే కాదు మన దేశంలో చాలా మంది స్త్రీ, పురుషుల ఇలాంటి సంధర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మీ కోసం ఒక మంచి చిట్కా ఉంది అదేనండి మైదానంలో ఆటగాళ్లు కాళ్లను నేలకు తాకకుండా షూస్ దరించి ఆడుతారు కదా అలా మీరు కూడా షూస్ ధరించి రైడ్ చేయండి అపుడు మీ కాళ్లు నేలను తాకుతాయి. ఇలా చేస్తే మీరు నిజంగానే రైడర్స్ అవుతారా ఒక సారి ఆలోచించండి మీ అంతరాత్మ ఏమంటోంది. మీరు చక్కగా రైడ్ చేయడానికి ఇంకా ఏమైనా అవకాశాలున్నాయా అని అలోచిస్తున్నారా అయితే ఖచ్చితంగా మీరు సమయం వృధా చేస్తున్నట్లే.

మరి దీనికి పరిష్కారం?

ఎవరైతే 4 నుండి 5 అడుగుల ఎత్తు ఉన్నారో వారి కోసం ఇక్కడ కొన్ని స్కూటర్లు ఉన్నాయి. వాటికి సంబందిచిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది చదవండి. ఇందులో మీ ఎత్తుకు సరిపోయే స్కూటర్ ఏదో డిసైడ్ చేసుకోండి.

మహీంద్ర గస్టో

మహీంద్ర గస్టో

ఇండియాలో స్కూటర్ యొక్క సీటు ఎత్తును అడ్దెస్ట్ చేసుకునె వెసులుబాటు కల్పించిన ఏకైక టూవీలర్ కంపెనీ మహీంద్ర. మహీంద్ర తన గస్టో మోడల్‌లో ఈ అవకాశాన్ని అందించింది. ఇందులో అతి తక్కువ ఎత్తు 735 ఎమ్.ఎమ్ వరకు తగ్గించుకోవచ్చు ఇది దీనిని అతి చిన్న స్కూటర్‌గా మార్చేసింది కాని దీని శ్రేణిలో అత్యంత బరువైనది కూడా ఇదే దీని బరువు 120 కేజీలు. మీ కాళ్లు గ్రౌడ్‍ను తాకే వరకు ఈ స్కూటర్‌ యొక్క సీట్ ఎత్తును మార్చుకోవచ్చు. ఇది 8 పి.యస్ ఇంజిన్‌ను కలిగి ఉంది ఇది మీకు లీటర్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

  • సీట్ ఎత్తు: 735 ఎమ్.ఎమ్
  • స్కూటర్ బరువు: 120 కేజిలు
  • మైలేజ్: 60 కె.ఎమ్.పి.యల్
  • దీని ధర సుమారుగా: రూ.58,000 ఆన్ రోడ్
  • యమహా రే

    యమహా రే

    అతి తక్కువ ఎత్తును ఆఫర్ చేస్తున్న వాటిలో యమహా రే ఒకటి దీని ఎత్తు కేవలం 760 ఎమ్.ఎమ్ మాత్రమే. దీని బరువు కేవలం 104 కేజీలు మాత్రమే. 4-స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది 7.1 పి.యస్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది మరియు 8.1 ఎన్.ఎమ్ పీక్ టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇది లీటర్‌కి 43 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

    • సీట్ ఎత్తు: 760 ఎమ్.ఎమ్
    • స్కూటర్ బరువు: 104 కేజిలు
    • మైలేజ్: 43 కె.ఎమ్.పి.యల్
    • దీని ధర సుమారుగా: రూ.55,000 ఆన్ రోడ్

    • హోండా డియో

      హోండా డియో

      మీ కోసం మేము అందిస్తున్న మూడవ స్కూటర్ హోండా డియో. హోండా డియో యొక్క బరువు 105 కేజీలు మరియు దీని యొక్క సీట్ ఎత్తు 765 ఎమ్.ఎమ్. డియో స్కూటర్ చాలా అందమైనది మరియు ఆకర్షణీయమైనది ఇది స్త్రీ, పురుషులకు ఎంతో బాగా సూట్ అవుతుంది. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్, దీని యొక్క 4-స్ట్రోక్ ఇంజిన్ 8 బి.హెచ్.పి పవర్ మరియు 8.7 ఎన్.ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హోండా డియో మీకు ఇస్తుంది 60 కె.ఎమ్.పి.యల్.

      • సీట్ ఎత్తు: 765ఎమ్.ఎమ్
      • స్కూటర్ బరువు: 105 కేజిలు
      • మైలేజ్: 60 కె.ఎమ్.పి.యల్
      • దీని ధర సుమారుగా: రూ.56,000 ఆన్ రోడ్
      • హోండా ఆక్టివా ఐ

        హోండా ఆక్టివా ఐ

        హోండా ఆక్టివా ఐ చాలా స్మూత్ ఫినిషింగ్ కలిగిన స్కూటర్ దాదాపుగా ఎక్కువ మంది స్త్రీలు దీనిని రైడ్ చేయడానికి ఇష్టపడతారు. హోండా ఆక్టివా ఐ కి చాలా వరకు హోండా డియోకి చెందిన పీచర్స్ ఉన్నాయి. టెక్నికల్ పరంగా హోండా డియోకి గల అన్ని లక్షణాలు ఇందులో ఉన్నాయి. సీట్ ఎత్తు 765 ఎమ్.ఎమ్, బరువు 103 కేజీలు మరియు మైలేజ్ 60 కె.ఎమ్.పి.యల్

        • సీట్ ఎత్తు: 765ఎమ్.ఎమ్
        • స్కూటర్ బరువు: 103 కేజిలు
        • మైలేజ్: 60 కె.ఎమ్.పి.యల్
        • దీని ధర సుమారుగా: రూ.55,000 ఆన్ రోడ్
        • టి వి యస్ విగో

          టి వి యస్ విగో

          టి వి యస్ విగో బాడి బ్యాలెన్స్ టెక్నాలజి అనే ఒక గొప్ప ఫీచర్ కలిగి ఉన్నది అంటే ఇది ఒక గుడ్ హ్యాండ్లింగ్ స్కూటర్ అన్నమాట. ఇది 12 అంగుళాల చక్రాలను కలిగి ఉంది అనగా దీని ఎత్తు కాస్త ఎక్కువే అయినప్పటికి టి వి యస్ కంపెని దీని సీటు 770 ఎమ్.ఎమ్ ఎత్తు లో ఉండే విధంగా తయారు చేసింది, ఇది హోండా కన్నా కాస్త ఎక్కువే. దీని యొక్క 4-స్ట్రోక్ ఇంజిన్ 8 బి.హెచ్.పి పవర్‌ను ఉత్పత్తి చేస్తూ 51 కె.ఎమ్.పి.యల్ మైలేజ్‌ను అందిస్తుంది.

          • సీట్ ఎత్తు: 770ఎమ్.ఎమ్
          • స్కూటర్ బరువు: 104 కేజిలు
          • మైలేజ్: 51 కె.ఎమ్.పి.యల్
          • దీని ధర సుమారుగా: రూ.63,000 ఆన్ రోడ్
          • సారాశం

            సారాశం

            షార్ట్ రైడర్స్ కోసం మేము అందించిన మోడల్‌లో మీకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకుని టెస్ట్ డ్రైవ్ చేసి మీ ఎత్తు ఏ స్కూటర్‌తో ఐతే సరిపోగలదో దానిని కొనండి ఒక వేళ అలా సరిపోకపోతే మీకు దగ్గరలోని సీట్ మేకర్స్ దగ్గరకు వెళ్లి సీటు యొక్క మందం తగ్గంచుకోండి.

            మరొక చిట్కా మీరు స్కూటర్ నడుపుతున్నపుడు మీ కాళ్లు నేలకు అందకపోతే, మీరు సీటు ముందు బాగానికి జరిగి కూర్చోవడం వలన స్కూటర్‌ని సిగ్నల్స్ వద్ద ఆపే ముందు మునివేళ్లతో నేలను అందుకోండి అపుడు స్కూటర్ పడిపోకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే ఇటువంటి పద్ధతి అంత మంచిది కాకపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Friday, September 25, 2015, 18:12 [IST]
English summary
Scooters are the easiest means to commute in a city. They are gearless, comfortable and return good fuel efficiency.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+