ఒక్క నెలలో 2,15,161 స్ల్పెండర్ బైకుల విక్రయం
భారతీయ వ్యక్తిగత రవాణాలో ద్విచక్ర వాహనాలు ఎంతో ముఖ్యమని వినియోగదారులు మరో మారు నిరూపించారు. ముఖ్యంగా ఉత్తమ మైలేజ్‌నిచ్చే వాహనాలకు ఎక్కువ మంది పట్టం కట్టారు.
Also Read: విడుదలకు సిద్దమైన పది ఆకర్షణీయమైన స్కూటర్లు
గత ఏడాదిలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకున్న టాప్-10 టూ వీలర్ల గురించి మరియు వాటి ఆన్ రోడ్ ధరల గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

10 . బజాజ్ సిటి
పదవ స్థానానికి పరిమితం అయిన ఈ బజాజ్ సిటి గత ఏడాది డిసెంబర్ నెలలో దాదాపుగా 34,480 వరకు అమ్మకాలు జరపింది. మరొక అశ్చర్యకరమైన అంశం ఎంటంటే బజాజ్ నుండి సిటి బైకు మాత్రమే ఈ జాబితాలో స్థానం సంపాదించింది.
- బజాజ్ సిటి ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 41,000 లు
- టీవీఎస్ జూపిటర్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 55,000 లు
- హీరో గ్లామర్ టూ వీలర్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 63,000 లు
- హోండా సిబి షైన్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 63,000 లు
- హీరో మాయెస్ట్రో ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 55,000 లు
- హీరో ప్యాసన్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 54,500 లు
- టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 35,000 లు
- హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 50,000 లు
- హోండా ఆక్టివా ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 53,000 లు
- హీరో స్ల్పెండర్ ఆన్ రోడ్ ధర దాదాపుగా రూ. 49,500 లు
- సిఎస్ 400 స్పోర్ట్స్ బైకును తీసుకు వస్తున్న బజాజ్ టూ వీలర్స్
- టీవీఎస్ అపాచే 200 4వి బైకు గుట్టు రట్టు...?
- కవాసకి వెర్సేస్ 650 అడ్వెంచర్ టూరర్ @ 6.6 లక్షలు

09. టీవీఎస్ జూపిటర్
టాప్ 10 లో తొమ్మిదల స్థానాన్ని టీవీఎస్ వారి స్కూటర్ జూపిటర్ కైవసం చేసుకుంది. టీవీఎస్ టూ వీలర్స్ సంస్థ గడిచిన నెలలో దాదాపుగా 47,217 యూనిట్ల జూపిటర్ విక్రయాలు జరిపింది.

08. హీరో గ్లామర్
మన అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసిన హీరో గ్లామర్ బైకు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. హీరో మోటో కార్ప్ వారు దేశ వ్యాప్తంగా గడిచిన నెలలో 48,748 గ్లామర్ టూ వీలర్లను అమ్మగలిగారు.

07. హోండా సిబి షైన్
టాప్ టెన్ జాబితాలో హోండా వారు తమ సిబి షైన్‌తో ఆరంగ్రేటం చేశారు. జపాన్ కు చెందిన హోండా టూ వీలర్స్ వారు గడిచిన నెలలో దాదాపుగా 51,047 యూనిట్ల షైన్ టూ వీలర్లను అమ్మగలిగారు.

06. హీరో మాయెస్ట్రో
ఆరవ స్థానంలో హీరో వారి మరొక ఉత్పత్తికి స్థానం లభించింది. హీరో మోటోకార్ప్ వారు గడిచిన నెలలో 52,084 యూనిట్ల మాయెస్ట్రో స్కూటర్లను విక్రయించారు.

05. హీరో ప్యాసన్
హీరో వారి ప్యాసన్ టూ వీలర్లను సిటిలో కన్నా పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా గమనించవచ్చు. అవును ఎందుకంటే వారే దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. హీరో మోటోకార్ప్ వారు గడిచిన డిసెంబరు నెలలో 55,765 యూనిట్ల ప్యాసన్ టూ వీలర్లను విక్రయించారు.

04.టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్
టీవీఎస్ టూ వీలర్స్ వారు మార్కెట్లో ప్రస్తుతం అందిస్తున్న ఏకైక 2-స్ట్రోక్ టూ వీలర్ ఎక్స్‌ఎల్ సూపర్. గత నెలలో అత్యధికంగా అమ్మకాలు సాధించిన వాటిలో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. టీవీఎస్ టూ వీలర్స్ సంస్థ 56,521 యూనిట్ల విక్రయాలను జరిపింది.

03. హీరో హెచ్ఎఫ్ డీలక్స్
దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్న మూడవ టూ వీలర్ హీరో హెచ్ఎఫ్ డీలక్స్. హీరో మోటో కార్ప్ వారు గడిచిన నెలలో ఏకంగా 93,451 హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనాలను విక్రయించారు.

02. హోండా ఆక్టివా
దేశ వ్యాప్తంగా స్కూటర్ల అమ్మకాలలో తిరుగులేని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అత్యధికంగా అమ్మకాలు సాగించిన టూ వీలర్లలో ఈ అక్టివా తొమ్మిదవ స్తానాన్ని కైవసం చేసుకుంది. హోండా టూ వీలర్ల సంస్థ దేశీయ మార్కెట్లో గడిచిన నెలలో దాదాపుగా 1,74,154 ఆక్టివా స్కూటర్లను విక్రయించింది.

01. హీరో స్ల్పెండర్
దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్న టూ వీలర్లలో హీరో మోటో కార్ప్ వారి స్ల్పెండర్ బైకు మొదటి స్థానంలో నిలించింది. హీరో మోటోకార్ప్ వారు గడిచిన డిసెంబరు నెలలో ఏకంగా 1,84,856 యూనిట్లను విక్రయించింది. 2014 డిసెంబర్ లో ఏకంగా 2,15,161 యూనిట్లను విక్రయించింది.



Click it and Unblock the Notifications








