BGauss RUV350 E-Scooter Full Review బిగాస్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదొక బిందాస్ బండి.. ఫుల్ రివ్యూ
దేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌ని శాసించేందుకు బిగాస్ (BGauss) సంస్థ సిద్ధం అవుతుంది. సరికొత్త స్కూటర్ RUV350 (రైడర్స్ యుటిలిటీ వెహికల్)ని ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఈ స్కూటర్‌తో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో తనదైన ముద్రను వేసేందుకు ముందుకు వస్తుంది. ఈ EV స్టార్టప్ నుంచి వచ్చే స్కూటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కంపెనీ లైనప్ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ మన దేశ రహదారి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడింది. ఈ సరికొత్త స్కూటర్ RUV350ని మా డ్రైవ్స్‌పార్క్ బృందం పూణెలోని చకన్‌లో గల కంపెనీ ఫెసిలిటీ సెంటర్ వద్ద టెస్ట్ రైడ్ చేసింది. ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి రైడింగ్ ఇంప్రెషన్స్, స్పెసిఫికేషన్ వివరాలు మీ కోసం..
డిజైన్ & ఫీచర్లు: ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న స్కూటర్లతో పోల్చితే BGauss RUV350 భిన్నంగా కనిపిస్తోంది. ఈ స్కూటర్ డిజైన్ థాయ్‌లాండ్ వంటి ఆగ్నేయాసియా దేశాల వీధుల్లో తిరిగే స్కూటర్ల మాదిరిగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి ప్రస్తుతం ఉన్న D15 ప్రో వలే ఈ సరికొత్త స్కూటర్ కనిపిస్తుంది. ఇది స్క్యేర్ హెడ్‌లైట్‌ని కలిగి ఉంటుంది. క్రోమ్ సరౌండ్ హ్యాండిల్‌బార్‌పై అమర్చబడి అక్కడే టర్న్ సిగ్నల్స్ ఉంటాయి.

ఫ్రంట్ ఆప్రాన్ సెంట్రల్ సెక్షన్ గ్లోస్ బ్లాక్ సెక్షన్‌ను కలిగి ఉంది. ఇది మెరుస్తూ కనిపిస్తుంది. దానిపైనే BGauss లోగోను కలిగి ఉంటుంది. 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ని మూడు కలర్ ఆప్షన్స్ (గ్రే, ఆరెంజ్ మరియు ఎల్లో)లో ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. ఇది డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో లభిస్తుంది. మెటల్ బాడీ ప్యానెల్‌లపై స్టిక్కరింగ్‌ని గమనించవచ్చు.
RUV350 లో విశాలమైన ఫ్లోర్‌బోర్డ్ ఉంది, దానితో పాటు సాఫ్ట్-క్లోజ్ సీటుతో పాటు సింగిల్-పీస్ గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉంది. టెయిల్‌లైట్ చాలా కాంపాక్ట్‌గా కనిపిస్తుంది. టర్న్ సిగ్నల్స్ మరియు స్కూటర్ ఇతర లైటింగ్ ఎలిమెంట్స్‌తో అన్ని LED యూనిట్స్‌తో ఉన్నాయి. 5-అంగుళాల TFT డిస్‌ప్లే IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ నోటిఫికేషన్స్, రైడింగ్ మరియు ఛార్జింగ్ పర్సంటేజ్ వంటి ఫీచర్లను సూచిస్తుంది.

ఇదే డిస్ప్లేలో మీరు ఏ రైడింగ్ మోడ్‌లో ఉన్నారో కూడా తెలియజేస్తుంది. హ్యాండిల్‌బార్‌కు కుడి వైపున ఉన్న బటన్‌లను ఉపయోగించి దీనిని నియంత్రించవచ్చు. అండర్-సీట్ స్టోరేజ్ ఏరియా చాలా ఇరుకుగా ఉందని చెప్పవచ్చు. దీనిలో కేవలం చిన్న సైజు సగం హెల్మెట్‌కి సరిపడా ప్లేస్ మాత్రమే ఉంది. ఇక్కడే మీరు ఛార్జింగ్ పోర్ట్‌ను పవర్‌ట్రెయిన్ ఆన్/ఆఫ్ స్విచ్‌ని అందించడం చూడవచ్చు.
కొంచెం ఎక్కువ స్టోరేజ్ కోసం కావాలనుకునే వారికి ముందు ఆప్రాన్‌లో చిన్న పాకెట్‌లు ఉన్నాయి. ఇందులో మీ ఫోన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను మీ కిరాణా సంచులను హుక్ అప్ చేయడానికి హుక్‌తో పాటు ఉండేలా చూశారు. దీని పక్కనే మీరు USB ఛార్జింగ్ పోర్ట్‌ను గమనించవచ్చు. ఫ్లోర్‌బోర్డ్ కింద కూడా మీకు సరిపడా సరుకులు తీసుకెళ్లే ప్లేస్ ఉంటుంది. అందువల్ల స్టోరేజీ తక్కువగా ఇచ్చారు.

ఈ ఫ్లోర్‌బోర్డ్ వద్ద సాధారణంగా ఛార్జింగ్ కేబుల్‌ను నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది లాక్ చేయగల స్టోరేజీతో ఫ్లోర్ మ్యాట్ కింద కనిపిస్తుంది. ఏదైనా ఖరీదైన వస్తువులను దాచడానికి ఇది ఉపయోగంగా ఉంటుంది. సీటులోపల ఉండే పవర్ స్విచ్ బటన్ మీరు స్కూటర్‌ని ధీర్ఘకాలికంగా ఒకే చోట ఉంచేలా చేస్తుంది. ఇది కూడా ఒక హైడింగ్ (స్కూటర్‌ని ఆన్ చేయకుండా) ఉండేందుకు సహాయ పడుతుంది.
స్పెక్స్ & డైమెన్షన్స్: BGauss RUV350 సంస్థకు చెందిన కొత్త హైపర్‌డ్రైవ్ ఇన్-వీల్ మోటార్ ద్వారా ఆధారితమైనది. ఇది 4.69bhp మరియు 165Nm (వీల్ టార్క్) గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మోటారు 3kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌కు కనెక్ట్ చేయబడింది. ఇది ARAI- ధృవీకరించబడిన ఫుల్ ఛార్జ్‌పై 135km (క్లెయిమ్ చేయబడిన నిజమైన పరిధి 120km) రేంజ్ అందిస్తుంది.

బ్యాటరీ ప్యాక్ ఒక గంట 55 నిమిషాలలో 1.35kW ఆఫ్-బోర్డ్ ఛార్జర్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు 0-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. పూర్తి ఛార్జ్‌కు మరో 40 నిమిషాలు పడుతుంది. ఇందులో స్లో ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా అందించబడతాయి. ఇవి ఛార్జ్ సమయాన్ని 100 శాతం కోసం మూడు గంటల 55 నిమిషాలు (840W) లేదా ఆరు గంటల 50 నిమిషాల (500W) వరకు తీసుకుంటుంది.
ఎకో రైడింగ్ మోడ్‌లో 135 కి.మీ రేంజ్ అందిస్తుందని గమనించాలి. దీని గరిష్ట వేగం గంటకు 45కిమీలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీనిలో మరో రెండు మోడ్‌లు ఉన్నాయి. రైడ్, ఇది గరిష్ట వేగాన్ని 60km/h మరియు స్పోర్ట్ మోడ్‌లో గరిష్ట వేగం 75km/h గా ఉంది. స్పోర్ట్ మోడ్‌లో 0-40km/h వేగాన్ని అందుకోవడానికి 5.4 సెకన్ల సమయం పడుతుంది.

RUV350 ముందు భాగంలో సాంప్రదాయ టెలిస్కోపిక్ ట్యూబ్యులర్ ఛాసిస్ మరియు వెనుక వైపున 4-స్టెప్స్ సర్దుబాటు చేయగల మోనోషాక్ ఉంది. 16-అంగుళాల చక్రాలు 80/80 (ముందు) మరియు 90/80 (వెనుక) టైర్‌లతో ఉంటాయి. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ కోసం 130mm డ్రమ్ బ్రేక్‌లను అందించారు. ఈ స్కూటర్ 1,928mm పొడవు, 697mm వెడల్పు, 1,200mm ఎత్తు మరియు 1,335mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.
RUV350 160mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 785mm సీటు ఎత్తును అందిస్తుంది. రహదారిపై, BGuass RUV350 సాధారణ స్కూటర్ లాగా అనిపిస్తుంది. మోటారు లీనియర్‌గా శక్తిని అందిస్తుంది. RUV350 మోడ్‌ల మధ్య మారుతున్నప్పుడు పనితీరు స్థాయిలలో మార్పులు గమనించవచ్చు. మేము ఎక్కువగా స్పోర్ట్ మోడ్‌కి ప్రాధాన్యత ఇచ్చాము. మంచి బ్యాలెన్సింగ్ కోసం చూస్తుంటే రైడ్ మోడ్ మీకు సరిపోతుంది. ఎకో పనితీరు కొంచెం ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపిస్తుంది.

కఠినమైన రోడ్లపై (ఘాట్ రోడ్స్)లోనూ ముందు భాగంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా.. వెనుక భాగం కొంచెం గట్టిగా అనిపించింది. మూలల వద్ద కొంచెం ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. వెనుక బ్రేక్ బాగా పనిచేసినప్పటికీ, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ సరైన సమయంలో యాక్టివేట్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందలు తలెత్తవు. అయితే ఫ్రంట్ బ్రేక్ ఒక్కటే కొద్దిగా అస్థిరంగా అనిపించింది.
చివరగా.. BGauss RUV350 ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న సాధారణ స్కూటర్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. పొడవైన మరియు సన్నని టైర్లతో ఈ స్కూటర్ కాస్త భిన్నంగా ఉంటుంది. వెనుక సస్పెన్షన్‌తో పాటు ఈ స్కూటర్‌లో ప్లాస్టిక్ తక్కువగా వాడకం వల్ల గట్టి బాడీని కలిగి ఉందని చెప్పవచ్చు. రోజువారి వినియోగం కోసం ఫర్ఫెక్ట్ స్కూటర్‌గా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


Click it and Unblock the Notifications








