డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

దేశీయంగా స్క్రాంబ్లర్ సిరీస్ మినహాయిస్తే, మోన్‌స్టర్ సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ రైడర్స్ కోసం చెప్పుకోదగ్గ మోడల్ డుకాటి నుండి రాలేదు. అయితే సరిగ్గా ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డుకాటి విపణలోకి మోన

By Anil Kumar

ఇండియన్ మార్కెట్లోని డుకాటి టూ వీలర్ల లైనప్‌లో మోన్‌స్టర్ అత్యంత కీలకమైన బ్రాండ్. గత 25 ఏళ్లుగా ఇటాలియన్ సూపర్ బైకుల తయారీ దిగ్గజం డుకాటి మోన్‌స్టర్ బైకులను ఎన్నో వెర్షన్‌లలో పరిచయం చేసింది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

దేశీయంగా స్క్రాంబ్లర్ సిరీస్ మినహాయిస్తే, మోన్‌స్టర్ సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ రైడర్స్ కోసం చెప్పుకోదగ్గ మోడల్ డుకాటి నుండి రాలేదు. అయితే సరిగ్గా ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డుకాటి విపణలోకి మోన్‌స్టర్ 797 బైకును లాంచ్ చేసింది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

డుకాటి ఇండియా ప్రకారం, మోన్‌స్టర్ కుటుంబంలో ఇదే అత్యంత సరసమైన మోడల్. అంతే కాకుండా, 400సీసీ బైకుల నుండి అప్‌గ్రేడ్ అయ్యేవారికి డుకాటి మోన్‌స్టర్ 797 బైకు బెస్ట్ ఛాయిస్. మరి దీని ఎంపిక ఎంత వరకు మంచిది...? అయితే రండి ఇవాళ్టి రివ్యూలో డుకాటి మోన్‌‌స్టర్ 797 బైకులో బెస్ట్ అండ్ బ్యాడ్ ఏంటో చూద్దాం రండి...

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

డుకాటి మోన్‌స్టర్ 797 డిజైన్ మరియు ఇతర స్టైలింగ్ లక్షణాలు అచ్చం డుకాటి మోన్‌స్టర్ సిరీస్ బైకులనే పోలి ఉంటుంది. ధృడమైన పెద్ద పరిమాణంలో ఉన్న ఆకర్షణీయమైన ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్‌బార్, ట్రెల్లిస్ ఫ్రేమ్ మరియు డబుల్ సైడ్ స్వింగ్ ఆర్మ్ వంటివి మోన్‌స్టర్ డిజైన్‌ను ప్రతిబింబిస్తాయి.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

ఫ్రంట్ డిజైన్‌లో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ మునుపటి ట్విన్ హ్యాలోజియన్ బల్బుల స్థానాన్ని భర్తీ చేసింది. హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ను సరిగ్గా సస్పెన్షన్ సిస్టమ్ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ముందు వైపున 43ఎమ్ఎమ్ కయాబా ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున ఆఫ్ సెట్ మోనో షాక్ అబ్జార్వర్ ఉంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

హెడ్‌ల్యాంప్ మీద ఎల్‌సిడి ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే కలదు. ఈ డిస్ల్పే, టైమ్, ట్రిప్ మీటర్, ఆర్‌పిఎమ్, స్పీడ్ మరియు ఇతర రీడింగులు మరియు బైకు గురించిన మరింత సమాచారాన్ని చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ మరియు ఫ్యూయల్ గేజ్ డిస్ల్పే రాలేకపోయాయి.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

మోన్‌స్టర్ 821 బైకుతో పోల్చుకుంటే మోన్‌స్టర్ 797 సీటు ఎత్తు 805ఎమ్ఎమ్‌గా ఉంది. ఏదేమైనప్పటికీ, తక్కువ ఎత్తులో ఉన్న ఫుట్ పెడల్స్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ మరియు తక్కువ బరువు వంటివి ట్రాఫిక్‌లో దీనికి బాగా కలిసొచ్చే అంశాలని చెప్పుకోవచ్చు. అంతే కాకుండా తక్కువగా ఉన్న వీల్‌బేస్ సౌకర్యవంతమైన రైడింగ్ కల్పిస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

మేము పరీక్షించిన ఈ డుకాటి మోన్‌స్టర్ 797 బైకులో ఆప్షనల్ ఎల్ఇడి ఇండికేటర్లు మరియు హెడ్‌ల్యాంప్ మీద ఫ్లై స్క్రీన్ వంటివి ఉన్నాయి. అదే విధంగా బైక్‌కు స్పోర్టివ్ తత్వాన్ని తెచ్చే రియర్ సీట్ కౌల్‌ను కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు.

డుకాటి మోన్‌స్టర్ 797 ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షిస్తుంది. మోన్‌స్టర్ బైకులో యుఎస్‌బి ఛార్జింగ్ సాకెట్ కలదు, అయితే ఇది సీటు క్రింద ఇవ్వడం జరిగింది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

సాంకేతికంగా డుకాటి మోన్‌స్టర్ 797 బైకులో గాలితో చల్లబడే 803సీసీ కెపాసిటి గల డెస్మోడ్యూ ట్విన్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇదే ఇంజన్ డుకాటి స్క్రాంబ్లర్ బైకులో కూడా ఉంది. యూరో-4 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇది 73బిహెచ్‌పి పవర్ మరియు 67ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

మంచి రైడింగ్ అనుభవాన్ని మరియు డుకాటి పనితీరును ప్రతిబింబించేలా ఈ ఇంజన్‌ను డెవలప్ చేసి డిజైన్ చేశారు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. గేర్‌ షిఫ్టర్స్ కూడా చాలా సులభంగా ఉంటాయి. అయితే, మేము రైడ్ చేస్తున్నపుడు దీనిని న్యూట్రల్ ఉంచినపుడు బైకు ఎంతో భారంగా కదులుతున్నట్లు అనిపిస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

ఇందులోని క్లచ్ అడ్లర్ పవర్ టార్క్ ప్లేట్ క్లచ్ పరిజ్ఞానంతో వచ్చింది. సింపుల్‌గా చెప్పాలంటే దీనినే స్లిప్పర్ క్లచ్ అని కూడా అంటారు. ఇది, రైడర్ ఇంజన్‌ను వెంటనే ఆఫ్ చేయడానికి గేర్లను వెనువెంటనే తగ్గిస్తున్నపుడు దాని ప్రభావం వెనుక చక్రం మీద పడకుండా రియర్ వీల్‌ను లాక్ చేస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

ఊహించని విధంగా, ఖరీదైన ప్రీమియం మోటార్ సైకిళ్లలో వచ్చే కొన్ని అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ ఇందులో మిస్సయ్యాయి. ప్రత్యేకించి, రైడ్-బై-వైర్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్ ఫీచర్లు రాలేదు. అయినప్పటికీ, ఇది అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని కలిగిస్తుంది. బాష్ నుండి సేకరించిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చింది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

ఎలక్ట్రిక్ స్టార్ట్ మీద బొటన వ్రేలుతో బలాన్ని ప్రయోగించినపుడు, ఎల్-ట్విన్ సిలిండర్ ఇంజన్ నుండి వచ్చే శబ్దం చాలా గర్వంగా అనిపిస్తుంది. మోన్‌స్టర్ మీద రైడ్ చాలా చక్కగా ఉంటుంది. దీనికి తోడు, అవసరానికి తగ్గట్లుగా అన్ని సందర్భాల్లో అద్భుతమైన టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ సహజత్వం వలన హై స్పీడ్ క్రూయిజింగ్ మరింత ఎంజా‌య్‌నిస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

మిడ్ రేంజ్ బైకుల్లో డుకాటి మోన్‌స్టర్ 797 శక్తివంతమైన మరియు ధృడమైన బెస్ట్ పవర్ బైక్. ఓవర్‌టేకింగ్ చాలా సులభంగా జరిగిపోతుంది మరియు ఎలాంటి సందర్భాల్లోనైనా గేర్లను తగ్గించాల్సిన అవసరం అస్సలు రాదు. సునాయసంగా 5,000ఆర్‌పిఎమ్ చేరుకున్న తరువాత ఇది గంటకు 210 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

బ్రేకింగ్ విధుల కోసం ముందు వైపున బ్రెంబో మోనోబ్లాక్ ఎమ్4.32 కాలిపర్స్ గల నాలుగు పిస్టన్లు ఉన్న ట్విన్-320ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 245ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ ఉంది.

మోన్‌స్టర్ 797లో పటిష్టమైన పిరెల్లీ డియాబ్లో రొస్సో-II టైర్లు ముందు వైపున 120/70/జడ్ఆర్17 మరియు వెనుక వైపున 180/55/జడ్ఆర్17 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. అధిక వేగం వద్ద మరియు మలుపుల్లో అద్భుతమైన గ్రిప్ కలిగి ఉంటాయి.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

నేక్డ్ సూపర్ బైకు మోన్‌స్టర్ 797 మీద సీట్లు చాలా ఆశ్చర్యపరుస్తాయి. ప్రత్యేకించి, రైడర్ మరియు పిలియన్‌కు ఎంతో సౌకర్యాన్ని కల్పిస్తాయి. మోన్‌స్టర్ 797 సిటీ రైడింగ్‌లో ఆగుతూ వెళ్లిన ప్రతిసారీ ఇంజన్ కాస్త వేడెక్కుతుంది. కానీ, ఓవరాల్ రైడింగ్‌లో ఇంజన్ వేడి పెద్దగా దరి చేరదు. అంతే కాకుండా, సిటీలో 16కిమీలు మరియు హైవే రైడింగ్‌లో 18కిమీల మైలేజ్‌నిస్తుంది.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మోన్‌స్టర్ శ్రేణిలో సరసమైన బైకుల మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేయడానికి ప్రవేశపెట్టిన మోన్‌స్టర్ 797 దాని పరిధి మేరకు చక్కటి విలువలను కలిగి ఉంది. 300 నుండి 400సీసీ బైకుల సెగ్మెంట్ నుండి మరింత శక్తివంతమైన బైకులకు అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే కస్టమర్లకు డుకాటి మోన్‌స్టర్ 797 పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

డుకాటి మోన్‌స్టర్ 797 టెస్ట్ రైడ్ రివ్యూ

ఒక బైకును రివ్యూ చేసేటపుడు, దాని ధరను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. ప్రత్యేకించి బడ్జెట్ ధరలో పర్ఫామెన్స్ బైకులను ఎంచుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ముఖ్యమైనది. డుకాటి మోన్‌స్టర్ 797 విషయానికి వస్తే, దీని ధర రూ. 8.5 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఇతర నేక్డ్ వెర్షన్ బైకులతో పోల్చితే దీని ధర కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. డుకాటి మోన్‌స్టర్ 797 విపణిలో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మరియు కవాసకి జడ్900 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Ducati Monster 797 Road Test Review - The Gentle Italian Behemoth
Story first published: Saturday, April 28, 2018, 10:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X