ఈవీ అట్రియో ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ; ధర తక్కువ & మంచి పర్ఫామెన్స్ ఇంకా ఎన్నెన్నో..

భారతదేశం అభివృద్ది పైవు పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహన విభాగానికి అధిక డిమాండ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో దృష్టి సారించిన భారతీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ కంపెనీలలో ఒకటి ఈవీ(EeVe).

భారత మార్కెట్లో ఈవీ బ్రాండ్ 2020 డిసెంబర్‌లో అట్రియో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే ఇటీవల కాలంలో మేము ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో తెలుసుకుందాం.. రండి.

డిజైన్ మరియు స్టైల్:

ఈవీ అట్రియో చూడగానే ఆకర్షించేవిధంగా ఉంది. ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. కంపెనీ దీనిని యువ రైడర్లను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్కూటర్ షార్ప్ లైన్స్ కలిగి ఉండి, యాంగ్యులర్ స్టైలింగ్‌లో ఉంటుంది. ఇదేవిధమైన డిజైన్ ముందుభాగంలో కూడా చూడవచ్చు.

ఈ స్కూటర్ యొక్క ముందుభాగంలో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్. హెడ్‌ల్యాంప్ హై మరియు లో బీమ్ కోసం ఇండ్యూజ్యువల్ ఎల్ఈడీ పాడ్‌లను కలిగి ఉంటుంది. ట్విన్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఆప్రాన్ అప్ ఫ్రంట్‌లో ఎక్కువ స్థలాన్ని తీసుకుంటుంది.

ఆప్రాన్ పైభాగంలో ఎయిర్ ఇంటేక్ ఉండటం వల్ల, స్కూటర్ చాలా స్పోర్టిగా కనిపిస్తుంది. దాని పైన 'ఈవీ' బ్యాడ్జింగ్ ఉంది మరియు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ హ్యాండిల్ బార్ కౌలింగ్‌లో ఉంచారు.

ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫ్లోర్‌బోర్డ్ ఎత్తులో ఉంచబడింది మరియు స్కూటర్ బాడీ స్పోర్టి గ్రాఫిక్స్ కలిగి ఉంటుంది.

ఈ స్కూటర్ యొక్క వెనుక దిగువ భాగంలో రెండు వైపులా డ్యూయల్-టోన్ స్వింగార్మ్ కవర్ ఉంటుంది. ఇది స్వింగార్మ్ మరియు కొంచెం సస్పెన్షన్ మరియు ఎలక్ట్రిక్ మోటారును కవర్ చేస్తుంది. స్కూటర్‌లో ప్లాస్టిక్ డ్యూయల్-టోన్ ఎలిమెంట్‌తో కూడిన పెద్ద గ్రాబ్ రైలు కూడా ఉంది.

వెనుక భాగంలో సెంట్రల్ టెయిల్ లాంప్ చుట్టూ టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ తో పెద్ద టైల్ లాంప్ ఉంది. రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ హోల్డర్‌ను మడ్‌గార్డ్‌లో అమర్చారు. ఈ స్కూటర్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కావున రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులుగా, 'ఈవీ' అని వ్రాయబడిన ప్లేట్ మాత్రమే లభిస్తుంది.

ఈవీ అట్రియో రెండు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్ అండ్ బ్లాక్ మరియు బ్లూ అండ్ బ్లాక్ కలర్స్.

ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్:

ఈవీ అట్రియో వినియోగించడానికి అనుకూలమైన అద్భుతమైన స్కూటర్. ఇందులో ఎక్కువ ఫీచర్స్ అందుబాటులో లేనప్పటికీ దీని ధరకు సరైన ఫీచర్స్ మాత్రం తప్పకుండా లభిస్తాయి.ఈవీ అట్రియో ఎలక్ట్రిక్ స్కూటర్ లోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో,

  • ఎల్ఈడీ లైటింగ్
  • IOT ఎనేబుల్
  • జియో-ఫెన్సింగ్ & జియో-టాగింగ్
  • యుఎస్‌బి మొబైల్ ఫోన్ ఛార్జర్
  • యాంటీ-తెఫ్ట్ లాక్
  • కీలెస్ ఎంట్రీ
  • రిమోట్ లాక్ / అన్‌లాక్ & స్టార్ట్
  • డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
  • మూడు రైడింగ్ మోడ్‌లు
  • జియో ఫెన్సింగ్ & జియో టాగింగ్ వంటి IOT- బేస్డ్ ఫీచర్స్ కొనుగోలుదారులకు మరియు ఫ్లీట్ ఆపరేటర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కీలెస్ ఎంట్రీ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం. రిమోట్ మరియు దాని ఫంక్షన్లకు అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది, కానీ మీరు దాన్ని అలవాటు చేసుకున్న తర్వాత, అది అనుకూలంగా ఉంటుంది.

    ఈవీ అట్రియో రౌండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. డయల్ చిన్నదిగా ఉన్నప్పటికీ, కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. కావున ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది స్కూటర్ స్పీడ్, కరెంట్ రైడింగ్ మోడ్, బ్యాటరీ వోల్టేజ్, మోటారు స్పీడ్ వంటి వాటిని డిస్ప్లేలో చూపిస్తుంది.

    పవర్ట్రెయిన్, పర్ఫామెన్స్ మరియు హ్యాండ్లింగ్:

    ఈవీ అట్రియో 250 వాట్ల హబ్ మోటారుతో పనిచేస్తుంది, ఇది 27Ah 72V లీడ్-యాసిడ్ బ్యాటరీకి అనుసంధానించబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ 0 నుంచి 100% ఛార్జ్ చేసుకోవడానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ 75 నుండి 85 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

    ఈవీ అట్రియో స్కూటర్ చదునైన ఉపరితలంపై మేము రైడ్ చేసినప్పుడు దాని గరిష్ట వేగం గంటకు 45 కి.మీ. కొన్ని వాలులలో స్కూటర్ గంటకు 49 కి.మీ వరకు వెళ్ళింది. కాని ఎలక్ట్రిక్ స్కూటర్ 41 కి.మీ / గం మార్కును దాటడానికి నిరాకరించిన వంపుపై వ్యతిరేక ప్రభావం కనిపించింది. యాక్సలరేషన్ చాలా మంచిది, కేవలం 8 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ వరకు వేగవంతమవుతుంది.

    ఇంతకు ముందే చెప్పినట్లుగా, ఈవీ అట్రియో మూడు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది, వీటికి 1, 2 & 3 అని పేరు పెట్టారు. యాక్సలరేషన్ అన్ని మోడ్‌లలో ఒకే విధంగా ఉంటుంది. మోడ్ 1 లో, ఈవీ అట్రియో 33 కి.మీ / గం చాలా తేలికగా తాకుతుంది, అయితే దీని గరిష్ట వేగం 35 కి.మీ / గం వరకు ఉంటుంది.

    మోడ్ 2 విషయానికి వస్తే, ఇది 40 కి.మీ / గం వరకు వెళుతుంది మరియు మోడ్ 3 దానిని 45 కి.మీ / గం. అన్ని రైడ్ మోడ్‌లలో త్రాటల్ రెస్పాన్స్ ఒకేవిధంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో వినియోగదారులు వాహనం కొనేముందు చూసేది వాహనం యొక్క మైలేజ్. అయితే ఈవి అట్రియో మంచి మైలేజ్ అందించింది. కావున కస్టమర్లు సందేహించాల్సిన అవసరం లేదు. మేము ఈ స్కూటర్ టెస్ట్ చేసినప్పుడు మాకు దాదాపు 55 కిలోమీటర్ల పరిధిని అందించింది.

    స్కూటర్‌ను టెస్ట్ చేసే సమయంలో ఛార్జ్ అయిపోయింది, కానీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అప్పటికి రెండు యూనిట్ల బ్యాటరీ పవర్ చూపించింది.

    ఈవీ అట్రియో టెలిస్కోపిక్ ఫోర్క్ పైకి ముందు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్‌లపై నడుస్తుంది. సస్పెన్షన్ చాలా మృధువైనదిగా ఉంటుంది, కావున ఈ స్కూటర్ ఎలాంటి రహదారిలో అయినా సజావుగా సాగుతుంది. ఈ స్కూటర్ లో బ్రేకింగ్ సిస్టం చాలా అద్భుతంగా ఉంది. కావున దీనిని ఎలాంటి సందర్భంలో అయినా నిలిపివేయవచ్చు.

    ఈ స్కూటర్ యొక్క బ్రేకింగ్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో డ్రమ్‌ బ్రేక్స్ కలిగి ఉంటాయి. ఏ స్కూటర్ లో బ్యాటరీ ప్యాక్ ఫ్లోర్‌బోర్డ్ కింద ఉంచబడుతుంది. ఇది స్కూటర్ తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని పొందడానికి సహాయపడుతుంది మరియు ఇది ఫుట్‌బోర్డ్‌ను కొంచెం పెంచుతుంది. ఫలితంగా, రైడింగ్ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది.

    ఈవీ అట్రియోపై మేము ఒక రోజు ప్రయాణించిన తరువాత, ఇందులో మరింత సౌకర్యవంతమైన సీటింగ్ ఉంటె బాగుండేదని ఆశిస్తున్నాము. ఇది కాకుండా, ఈవీ అట్రియో రైడింగ్ చాలా అద్భుతమైన రైడింగు అనుభవాన్ని అందించింది. సీటు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు కుషనింగ్ కూడా బాగుంటుంది.

    ధర :

    ఈవీ అట్రియో ధర మార్కెట్లో 64,900 రూపాయల వరకు ఉంటుంది. ఇది బేర్-బేసిక్ స్కూటర్లకు పైన ఉంచుతుంది. కాని ప్రస్తుతం భారత మార్కెట్లో అమ్మకానికి ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల కింద ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ ధరకు లభిస్తున్న ఈ స్కూటర్ లో మంచి ఫీచర్స్ ఉన్నాయి, కావున వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

    ప్రత్యర్థులు :

    భారత మార్కెట్లో ఈవీ అట్రియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఓకినావా ఆర్ 30, ఒకినావా లైట్, హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా ఎల్ఎక్స్, ప్యూర్ ఇవి ఎట్రాన్స్ ప్లస్, ఆంపియర్ రియో ప్లస్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

    వారంటీ :

    ఈవీ కంపెనీ 2 సంవత్సరాలు లేదా 20,000 కిలోమీటర్ల వారంటీతో అట్రియోను విక్రయిస్తుంది. అన్ని వారంటీ ప్రయోజనాలకు అర్హత పొందడానికి, ఎలక్ట్రిక్ స్కూటర్ షెడ్యూల్ వ్యవధిలో సర్వీస్ చేయవలసి ఉంటుంది. ఇది కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

    డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

    భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగం అనేక విధాలుగా విభజించబడింది. ఇందులో రూ. 1 లక్షకు పైగా ఖరీదు చేసే ప్రీమియం హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే చివరి స్థానంలో కొన్ని బేర్-బేసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఇది చాలా దయనీయం.

    అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్న ఈవీ అట్రియో అటు బేర్ బేసిక్స్ స్కూటర్ కాదు, ప్రీమియం స్కూటర్ కూడా కాదు మధ్యలో ఉంది. దేశీయ మార్కెట్లో రూ. 64,900 వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ అట్రియో. ఇది ఈ విభాగంలో ఉత్తమంగా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో కూడా. మొత్తం మీద ఒక్క మాటలో చెప్పాలంటే, ఈవీ అట్రియో తన వినియోగదారులకు చాలా అనుకూలమైన అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుందని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము.

Most Read Articles

English summary
EeVe Atreo Electric Scooter Review. Read in Telugu.
Story first published: Thursday, July 8, 2021, 16:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X