ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. వచ్చేసింది..చూసారా ?

భారతదేశం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహన విభాగం కూడా వేగంగా పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో అనేక కొత్త తయారీదారులు పుట్టుకొచ్చారు. వాటిలో ఒకటి ఈవీ ఇండియా. ఇది 2018 లో స్థాపించబడిన తూర్పు భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

సంస్థ ప్రారంభించినప్పటినుంచి ఇప్పటికే దేశంలో నాలుగు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. వాటి ప్రధాన మోడల్ జెనియా. ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క మొట్టమొదటి మోడల్ మరియు ఇప్పుడు కొన్ని వారాలపాటు సుదీర్ఘంగా మాతో ఉంది. ఫ్లాగ్‌షిప్ తక్కువ-వేగం విభాగంలో భాగమైనప్పటికీ, ఇ-స్కూటర్, ఎటువంటి రిజిస్ట్రేషన్ ప్లేట్ అవసరం లేకుండా దీన్ని నడపడానికి అనుమతిస్తుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

చిన్న 250డబ్ల్యు ఎలక్ట్రిక్ మోటారుతో నిండిన ఈవీ జీనియాను మార్కెట్లో పర్యావరణ అనుకూలమైన ప్రయాణికుల స్కూటర్‌గా చెప్పవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు కొన్ని వారాలుగా మాతో ఉంది. ఈ జెనియా స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

డిజైన్ మరియు స్టైల్ :

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఖచ్చితంగా వీధుల్లో తిరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కూటర్ బోల్డ్ డిజైన్‌ కలిగి ఉండటమే కాకుండా మెనీ కట్స్, క్రీజెస్ మరియు షార్ప్ లైన్స్ కలిగి ఉంటుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందుభాగంలో ఎల్‌ఈడీ యూనిట్లతో పొడవైన డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది. ఈ హెడ్‌ల్యాంప్ యూనిట్లు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లతో అనుసంధానించబడి ఫ్రంట్ ఆప్రాన్ మొత్తాన్ని పూర్తిగా కవర్ చేస్తాయి. ఈవ్ దాని అదనపు బోల్డ్ డిజైన్ మరియు స్టైలింగ్‌కు తోడుగా అదనపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లను కూడా అందించింది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

స్కూటర్ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ షార్ప్ లైన్స్ మరియు క్రీజులతో ముందుకు సాగుతుంది. మేము టెస్ట్ చేసిన వాహనంలోని వైట్ పెయింట్ స్కీమ్ చుట్టూ ఉన్న బ్లాక్ ఎలిమెంట్స్‌తో ఉంది. సైడ్ ప్రొఫైల్ అనేక స్టిక్కర్లను కలిగి ఉంది, ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ‘జెనియా' పేరును గుర్తు చేస్తుంది. వెనుక పిలియన్ కోసం బ్లాక్ కలర్ లో పూర్తి చేసిన పెద్ద గ్రాబ్ హ్యాండిల్ కూడా ఉంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

వెనుక ప్రొఫైల్ ప్రధానంగా పెద్ద టెయిల్ లైట్ల ద్వారా వర్గీకరించబడుతుంది, దీనికి ఇరువైపులా టర్న్ సిగ్నల్ కూడా ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ టెయిల్ లైట్ల క్రింద రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

రైడ్ కంఫర్ట్ & ప్రాక్టికాలిటీ :

ఈవీ జీనియా సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని సీట్లు పెద్దవిగా ఉండటమే కాకుండా రైడర్ మరియు పిలియన్ రెండింటికీ మంచి మొత్తంలో కుషనింగ్‌ను అందిస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీ ప్యాక్ బూట్‌లో ఉంది, ఇది తక్కువ ఫుట్‌బోర్డ్ కలిగి ఉండటానికి అనుమతిస్తుంది. ఇది రైడర్ కి చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఏదేమైనా పెద్ద బ్యాటరీ ప్యాక్ సీటు కింద ఉంచడంతో ఏదైనా నిల్వ చేయడానికి బూట్‌లో ఖాళీ స్థలం లేదు. రైడర్ వస్తువులను ఉంచగల మరొక ప్రదేశం ఫుట్‌బోర్డ్‌లో ఉంది. ఫోన్, వాలెట్ మరియు ఇతర చిన్న వస్తువులను ముందు ఆప్రాన్ వెనుక ఇచ్చిన స్టోరేజ్ స్థలంలో ఉంచవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి యుఎస్‌బి పోర్ట్‌ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఈవీ జీనియాపై సస్పెన్షన్ సెటప్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రైడ్ క్వాలిటీ మరింత మెరుగుపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను ఉపయోగిస్తుంది. సస్పెన్షన్ చక్కగా ఏర్పాటు చేయబడింది. ఇది చాలా మృదువైనదిగా ఉంటుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ లోని బ్రేకింగ్ సిస్టం. గంటకు 25 కి.మీ / గంట వేగంతో ప్రయాణించగల ఈ స్కూటర్ కోసం కంపెనీ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను అందిస్తోంది. ఇది వెహికల్ ని తక్షణమే నిలిపివేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ లో ముందు మరియు వెనుక బ్రేకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఫీచర్స్ మరియు ఎక్విప్మెంట్ :

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క ప్రధాన మోడల్. ఇందులో అనేక ఫీచర్స్ మరియు ఎక్విప్మెంట్స్ అందించబడ్డాయి. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్ కాకుండా, పుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, ఓడోమీటర్ మరియు ట్రిప్‌మీటర్ వంటి అన్ని బేసిక్ ఇన్పర్మేషన్ అందిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లేపై మూడు మోడ్‌లు కూడా ఉన్నాయి. అయితే, ప్రస్తుతానికి, మోడ్‌ల ద్వారా దాని పనితీరు మరియు పవర్ డెలివరీలో మాకు తేడా కనిపించలేదు.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఎలక్ట్రిక్ స్కూటర్ పార్క్ మోడ్‌తో కూడా వస్తుంది, ఇది సేఫ్టీ ఫీచర్. ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని వివిధ ఫంక్షన్ల కోసం స్విచ్‌లు ఉంచబడ్డాయి. క్రిందికి చూడకుండా కూడా రైడర్ సులభంగా వీటిని యాక్సెస్ చేయవచ్చు.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

స్టైలిష్ అల్లాయ్ వీల్స్, హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు, కీలెస్ ఎంట్రీ మరియు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఈవీ జీనియాలో అందించబడ్డాయి. ఇందులో ఉన్న 60V 20Ah లిథియం-అయాన్ బ్యాటరీని స్కూటర్ నుండి తొలగించి విడిగా ఛార్జ్ చేయవచ్చు.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఇది కాకుండా ఈవీ నేరుగా ఛార్జింగ్ పోర్టు ద్వారా, ముందు సీటుకు దిగువన ఛార్జింగ్ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇల్లు లేదా ఆఫీస్ లో స్టాండర్డ్ ప్లగ్ పాయింట్‌కు కనెక్ట్ అయినప్పుడు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సాయం పడుతుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే ఛార్జీపై మొత్తం 65 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది, ఇది ప్రస్తుతం టెస్టింగ్ లో ఉంది మరియు దీని గురించి మరింత సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఫస్ట్ ఇంప్రెషన్స్ :

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది ఇప్పటికీ టెస్టింగ్ దశలో ఉంది. దీని గురించి పూర్తి సమాచారం త్వరలో మీకు అందుబాటులోకి తీసుకు వస్తాము. అప్పటివరకు వాహనప్రియులు వేచి చూడక తప్పదు. కానీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో కొంత సమయం గడిపాము. కాబట్టి మా ఫస్ట్ ఇంప్రెషన్స్ చాలా సానుకూలంగా ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తేలికైనది మాత్రమే కాకుండా మంచి ఫీచర్స్ కలిగి ఉండి, స్టైలిష్ గా కనిపిస్తుంది మరియు అద్భుతమైన రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉండే స్కూటర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఈవీ జీనియా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ ఇంప్రెషన్స్.. చూసారా ?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ కోసం కొంత సమయం వేచి చూడాలి. ఈ స్కూటర్ ఏ విధంగా పనిచేస్తుంది, వాహనదారులకు ఏవిధంగా అనుకూలంగా ఉంటుంది, అనే దాని గురించి పూర్తి సమాచారం త్వరలో రానుంది.

Most Read Articles

English summary
Eeve Xeniaa Long-Term First Report Review. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X