హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్: కొనవచ్చా... కొనకూడదా...?

By Anil

హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిళ్ల తయారీ ప్రారంభించి ఇప్పటికి వందేళ్లు గడిచిపోయాయి. ఏ దేశంలో చూసుకున్నా... క్రూయిజ్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా హ్యార్లీ రాణిస్తోంది.

2009లో భారత్‌లో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే నాటికి, ఇండియాలో అత్యంత ఖరీదైన మోటార్ సైకిళ్లను విక్రయించే కంపెనీలలో అతి ముఖ్యమైన సంస్థగా హ్యార్లీ నిలిచింది. తొలుత హార్లీ డేవిడ్‌సన్ ఉత్పత్తులకు ఆశించిన డిమాండ్ లభించనప్పటికీ కాలం గడిచేకొద్దీ మంచి ఫలితాలనే సాధించింది.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్లో ఉన్న సూపర్ లో(Super Low) స్థానంలోకి 1200 కస్టమ్ బైకును విడుదల చేసింది. దీనిని టెస్ట్ డ్రైవ్ చేసి, పనితీరు మరియు ఇతర రైడింగ్ అంశాలను పాఠకులతో పంచుకునే అవకాశాన్ని హ్యార్లీ డ్రైవ్‌స్పార్క్ బృందానికి కల్పించింది. క్రింది స్లైడర్లలో హ్యార్లీ 1200 కస్టమ్ బైక్ కంప్లీట్ రివ్యూ....

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

తొలిసారి చూసే వారికి హ్యార్లీ 1200 కస్టమ్ చిన్న బైకు కాదు. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల కంటే పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. హ్యార్లీ డేవిడ్‌సన్ "స్పోర్ట్‌స్టర్" సిరీస్‌లో ఉన్న ఐరన్ 883 మరియు ఫార్టీ ఎయిట్ బైకుల మధ్య స్థానాన్ని ఇది భర్తీ చేస్తుంది. టెస్ట్ రైడ్ చేసే సమయంలో ఈ బైకును ఎక్కడ పార్క్ చేసినా... జనాలు ఈగల్లా వాలిపోయేవారు.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

భారీ బరువుతో పెద్ద పరిమాణంలో ఉన్న 1200 కస్టమ్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్‌ ఫోర్క్స్‌కు పై భాగంలో గుండ్రటి ఆకారంలో ఉన్న హ్యాలోజియన్ హెడ్ ల్యాంప్ మరియు హ్యార్లీ పనితనాన్ని వివరించే పొడవాటి 17-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ తమ 1200 కస్టమ్ బైకులో దాదాపు ప్రతి పరికరాన్ని, ప్రతి విడి భాగాన్ని కూడా క్రోమ్ మెటల్‌తో తీర్చిదిద్దింది. అయితే, ఇందులో అల్లాయ్ వీల్స్, పాత డిజైన్ పద్దతిలో ఉన్న ఫ్లోటింగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న అనలాగ్ స్పీడో మీటర్లు బైకు మొత్తానికి సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ ఇందులో చిన్న డిజిటల్ స్క్రీన్ అందించింది, రైడర్, టాకో మీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిమ్ మీటర్, ఓడో మీటర్, క్లాక్ మరియు ఎంత దూరంలో ఇంజన్ ఖాళీ అవుతుంది వంటి వివరాలను ఈ డిస్ల్పేలో పొందవచ్చు.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

బైకు మొత్తం చూడటానికి ఓల్డ్ డిజైన్ శైలిలో నిర్మించినట్లు అనిపిస్తుంది. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రెట్రో డిజైన్‌ స్టైల్‌ను యధావిథిగా కొనసాగించారు. సీట్ ఎత్తు 725ఎమ్ఎమ్ ఉన్నప్పటికీ ఇంకా ఎత్తుగానే అనిపిస్తుంది. దీని బరువు హ్యార్లీ ఫోర్టీ ఎయిట్ బైకు కన్నా కాస్త అధికంగానే ఉంది. పొడవు కూడా ఉండాల్సిన దానికన్నా ఎక్కువే.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

ఇంజన్ విషయానికి వస్తే, ఈ బైకును యాక్సిలరేట్ చేసేటప్పుడు మీ ముఖంలో ఆటోమేటిక్‌గా చిరునవ్వు రావడం ఖాయం. భారీ బరువును లెక్క చేయకుండా దూసుకెళుతుంది. హ్యార్లీ 1200 కస్టమ్ బైకులో 1,202సీసీ సామర్థ్యం గల వి ట్విన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందించింది.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల ఇది 3,500ఆర్‌పిఎమ్ కనీస ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

మెట్ట మరియు ప్రతికూల రహదారి పరిస్థితుల్లో యాక్సిలరేటర్ పెంచేకొద్దీ అన్ని అవరోధాలను సునాయసంగా అధిగమించే కెపాసిటి దీనికి ఉంది. అయితే, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఆప్షనల్‌గా లభిస్తోంది) మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో మిస్సయ్యాయి. ఈ రెండు ఫీచర్లు లేకపోవడంతో తడిసిన రోడ్ల మీద రైడింగ్ కాస్త రిస్క్ అని చెప్పవచ్చు.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ 1200 కస్టమ్ మొత్తం 270 కిలోల బరువు ఉన్నప్పటికీ, గజిబిజి ట్రాఫిక్‌తో కూడా రద్దీ రోడ్లలో కూడా సౌకర్యవంతమైన ఈజీ రైడ్ సాధ్యమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిగతా వాటితో పోల్చితే అంతగా వేడెక్కదు.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ 1200 కస్టమ్ బైకు మూడంకెల వేగాన్ని అందుకుంది మరియు సాధారణ తారు రోడ్ల మీద 120కిలోమీటర్ల వేగాన్ని క్షణాల్లోనే అందుకుంది. అయితే, ఐడ్లింగ్‌లో ఉన్నపుడు వైబ్రేషన్స్ మరియు కుదుపులు అధికం, మూవింగ్‌లో ఉన్నపుడు వైబ్రేషన్స్ వస్తుంటాయి.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

1200 కస్టమ్ బైకులో 5-స్పోక్ 16-అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు ముందువైపు 130 మరియు వెనుక వైపున150 కొలతల్లో ఉన్న మిచేలియన్ స్కార్చర్ టైర్లు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు వైపున సింగల్ డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేక్ సిస్టమ్ కలదు.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైకు సిటి రైడింగ్‌లో లీటర్‌కు 15కిలోమీటర్లు మరియు హై వే రైడింగ్‌లో లీటర్‌కు 21కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. భారీ ఇంజన్ ఉన్న క్రూయిజర్ బైకు ఈ మైలేజ్ ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమే. 17-లీటర్ల ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపితే 230 నుండి 250కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేయవచ్చు.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

తీర్పు

హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ క్రూయిజర్ బైకు ధర రూ. 8.90 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. భారీ ప్రైజ్ రేంజ్‌లో ఉన్న 1200 కస్టమ్ బైకు ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు విభిన్న రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్ల పరంగా నిరాశను మిగిల్చింది.

 హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్ బైక్ టెస్ట్ డ్రైవ్

హ్యార్లీ డేవిడ్‌సన్ 1200 కస్టమ్‌ను ఎంచుకునే కస్టమర్లకు విసృత శ్రేణి యాక్ససరీలను అందిస్తోంది. బైక్ వైబ్రేషన్స్ మరియు పైన తెలిపిన ఫీచర్లను మినహాయిస్తే, ఈ ధరల శ్రేణిలో 1200 కస్టమ్ క్రూయిజర్ మంచి సెలక్షన్ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Harley-Davidson 1200 Custom Review
Story first published: Wednesday, September 20, 2017, 17:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X