Hero Karizma XMR హీరో కరిష్మా XMR బైక్ డిజైన్‌, ఫీచర్లు, పర్ఫామెన్స్‌ ఫుల్‌ రివ్యూ

ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ హీరో మోటోకార్ప్​ దేశీయ మార్కెట్​లోకి ఇటీవల సరికొత్త బైక్​ హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్(Karizma XMR)ను లాంచ్​ చేసింది​. 20 ఏళ్ల క్రితమే ఈ కంపెనీ నుంచి కరిష్మా మోడల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని మార్పులు చేర్పులు తర్వాత సరికొత్త అవతారంతో హీరో మోటాకార్ప్‌ దీనిని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బైక్​ ఫుల్‌ రివ్యూ ఈ కథనం ద్వారా మీకు అందిస్తున్నాం.

డిజైన్‌: యువతను అట్రాక్ట్​ చేసే విధంగా దీనిని రూపొందించారు. కొత్త హీరో కరిష్మా XMR ను ఒక్కసారి చూస్తే దాని పాత తరం మోడల్‌కు ఎంత భిన్నంగా ఉందో తెలుస్తుంది. మొదటి కరిష్మా హోండా డిజైన్‌ అయితే.. కొత్త మోడల్‌ ZMR, R లైనప్‌లకు అప్‌డేటెడ్‌గా ఉంది. కొత్త హీరో కరిష్మా XMR స్వచ్ఛంగా హీరో డిజైన్‌. ఇది DRLలు మరియు టైల్‌లైట్ కోసం H-ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది.

Hero-Karizma-XMR

H-ఆకారంలో ఉన్న DRL వద్ద LED హెడ్‌ల్యాంప్ ఉంది.హెడ్‌ల్యాంప్ సెటప్ పైన అడ్జస్ట్‌ చేసుకునేందుకు వీలుగా విండ్‌స్క్రీన్ ఉంటుంది. కరిజ్మా XMR ఫ్రంట్ ఫెయిరింగ్‌లో రేర్‌ మిర్రర్స్‌, ఫ్రంట్ టర్న్ సిగ్నల్స్‌ ఉన్నాయి. కరిష్మా XMRలో స్పోర్ట్స్ టూరర్ యొక్క మల్టీ-లేయర్డ్ ఏరోడైనమిక్ ఫుల్ ఫెయిరింగ్ ఉంది.

ఎయిర్ ష్రెడర్‌లలో XMR మరియు Hero లోగోలు కనిపిస్తాయి. కొత్త కరిష్మా యొక్క మస్కులర్‌లో 11-లీటర్ ఫ్యూయెల్‌ ట్యాంక్ బ్లాక్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఈ ప్యానెల్‌లు కరిజ్మా XMRకి మంచి ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తుంది. కరిష్మా XMRలో ఇంకా మేజర్‌ డిజైన్ హైలైట్స్ గా ఉన్నాయి.

Hero-Karizma-XMR

కొత్త హీరో XMR లో క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్‌, బ్రాంజ్‌ ఇంజిన్ హైలైట్‌లు, 14-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్ సెటప్, స్టబ్బి ఎగ్జాస్ట్ మరియు స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్స్‌తో కూడిన టైట్‌ టెయిల్ సెక్షన్ వంటి అట్రాక్టెడ్ డిజైన్ ఫీచర్లు కలిగి ఉన్నాయి.

Hero-Karizma-XMR

ఫీచర్లు: ఈ బైక్ ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా కలిగి ఉంది. LCD బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంది. మీరు మీ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను దీంతో కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఇది, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు ఇన్‌కమింగ్ కాల్/SMS అలర్ట్స్‌ను ఇస్తుంది ఈ సెగ్మెంట్‌లో ఇలాంటి ఫీచర్‌ రావడం ఇదే మొదటిది. మీ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసుకోవడానికి వేగంగా ఛార్జింగ్ అయ్యే USB పోర్ట్ కూడా అందించింది.

Hero-Karizma-XMR

ఇంజిన్‌: హీరో కరిష్మా XMR సరికొత్త లిక్విడ్-కూల్డ్ 210cc, DOHC సింగిల్-సిలిండర్, ఫోర్-వాల్వ్ ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఈ హై-రివింగ్ సింగిల్ 9,250rpm వద్ద 25.15bhp మరియు 7,250rpm వద్ద 20.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

సరికొత్త హీరో కరిష్మా XMR 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై 100/80 (ముందు) మరియు 140/70 (వెనుక) టైర్‌లను కలిగి ఉంది. డ్యూయల్-ఛానల్ ABS సహాయంతో రెండు చివర్లలోని పెటల్ డిస్క్‌ల ద్వారా బ్రేక్‌ వేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్‌ డిస్క్ 300mm యూనిట్ అయితే రేర్‌ యాంకర్ 220mm యూనిట్‌గా ఉంది.

Hero-Karizma-XMR

సరికొత్త Hero కరిష్మా XMR 2,068mm పొడవు, 760mm వెడల్పు మరియు 1,110mm ఎత్తుతో ఉంటుంది. ఇంకా ఇది 1,351mm లాంగ్‌ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. కరిష్మా XMR బరువు 163.5 కిలోగ్రాములు, 160mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 810mm సీట్ ఎత్తును కలిగి ఉంది.

Hero Karizma XMR ఒక స్పోర్ట్ టూరర్ లైనేజ్‌ నుంచి వచ్చింది. ఇంకా ఇది కరిష్మా పేరును కలిగి ఉన్న సరికొత్త మోటార్‌సైకిల్ దాని లెగసీని కొనసాగిస్తుంది. కొత్త లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజిన్ సిల్క్ లాగా స్మూత్‌గా ఉంటుంది. మీరు ట్రిపుల్ డిజిట్‌లకు చేరుకున్నప్పటికీ మీకు ఎలాంటి వైబ్రేషన్స్ అనిపించవు. 4,500 రివల్యూషన్స్‌ వరకు, ఇంజిన్ సింపుల్‌గా ఉంటుంది. కానీ ఒకసారి ఆ డిజిట్‌ దాటితే, పవర్ బ్యాండ్ ప్రారంభమవుతుంది.

Hero-Karizma-XMR

5,000 నుండి 9,500rpm వరకు, ఇంజిన్ ది బెస్ట్‌గా ఉంటుంది. మీరు బైక్‌పై రేసింగ్‌ చేసిన అనుభూతి ఇస్తుంది. మీరు 9,800rpm కు మీ రైడ్‌లైన్‌ను పెంచినట్లయితే తదుపరి గేర్‌కి (స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్ సహాయంతో) సజావుగా మారడం ద్వారా మీరు ఆ అనుభూతిని మళ్లీ మళ్లీ ఆస్వాదించవచ్చు.

Hero-Karizma-XMR

మీరు లాంగ్‌ జర్నీ చేయలానుకుంటే కొత్త కరిష్మా XMR ద్వారా మంచి రైడ్‌ను ఆస్వాదించవచ్చు. సాఫ్ట్‌ సీటు మంచిగా కుషన్‌తో పొందుపరిచి ఉంటుంది. ఫుట్‌పెగ్‌లు కొద్దిగా వెనుకకు ఉంటాయి. హ్యాండిల్‌బార్లు కొంచెం దిగువన ఉంటాయి. ఇందులో సస్పెన్షన్ సెటప్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంది. అయితే ఫ్రంట్ ఎండ్ కొద్దిగా మెత్తగా ఉంటుంది. ABS కూడా కొద్దిగా ఆఫ్‌గా అనిపించింది. వెనుక భాగం కంటే ముందు భాగం ప్రతిస్పందించడానికి కొంచెం సమయం తీసుకుంటుంది.

Hero-Karizma-XMR

చివరగా హీరో కరిష్మా XMR కు మార్కెట్లో మంచి డిమాండ్​ లభిస్తుందని సంస్థ గట్టి నమ్మకంతో ఉంది. యూత్‌ను అట్రాక్ట్​ చేసే విధంగా దీనిని రూపొందించారు. దీని ధర ఎక్స్‌షోరూమ్‌లో రూ. 1.73 లక్షలుగా ఉంది. ఎప్పటి నుంచో యువతకు కరిష్మా హాట్ ఫేవరెట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ బ్రాండ్ పేరుతో అద్భుతమైన రైడ్ ఆస్వాదించాలనుకునే వారికి కరిష్మా ట్యాగ్‌తో హీరో కరిష్మా XMR అద్భుతమైన ఎంపిక.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2023, 10:01 [IST]
English summary
Hero karizma xmr bike features design and engine performance full review
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+