Hero Xtreme 250R Review: పవర్‌ఫుల్ ఇంజిన్, స్టన్నింగ్ లుక్స్‌తో ఎక్స్‌ట్రీమ్ 250R.. ఫెర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

2023లో, హీరో మోటోకార్ప్ తన భవిష్యత్తు కోసం రూపొందించిన సమర్థమైన ప్రణాళికలను ప్రదర్శించేందుకు ఇటలీలోని మిలాన్‌లో జరిగిన EICMA మోటార్‌సైకిల్ షోను సరైన వేదికగా భావించింది. నవంబర్‌లో ఇటలీలో జరిగిన ఈ ఈవెంట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి Concept 2.5 R Xtunt అనే పేరుతో ప్రదర్శించబడిన బైక్. ఒక సంవత్సరం తర్వాత, ఆ విప్లవాత్మక కాన్సెప్ట్‌తో Hero Xtreme 250Rను మనకు తీసుకొచ్చింది. ఇది దేశంలోని అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన నేకెడ్ బైక్. ఈ బైక్‌ను ఇటీవల, రాజస్థాన్‌లోని ఉదయపూర్ -(సిటి ఆఫ్ లేక్స్) చుట్టుపక్కల ఈ కొత్త హీరో ఫ్లాగ్‌షిప్ బైక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ డ్రైవ్ చేసింది. దీన్ని నడిపిన సమయంలో మాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

డిజైన్ & ఫీచర్లు: హీరో కాన్సెప్ట్ 2.5 R ఎక్స్‌టంట్ నేకెడ్ బైక్ డిజైన్ ఎంతో అగ్రెసివ్‌గా ఉంది. అయితే ఎలాంటి లైట్లు, యాక్టివ్ ఏరో, స్లిక్ టైర్లు పూర్తిగా లేకపోవడం వల్ల ఇది రేస్ ట్రాక్ కోసం తయారు చేయబడినట్లు అనిపించింది. 2.5 R ఎక్స్‌టంట్ ప్రొడక్షన్-స్పెక్ వెర్షన్‌గా, కొత్త ఎక్స్‌ట్రీమ్ 250R దాని కాన్సెప్ట్ మోడల్ కంటే కొంచెం తక్కువ అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

Hero Xtreme 250R Review Riding

అయినప్పటికి దాని స్టైల్ మాత్రం పవర్‌ఫుల్ అండ్ బోల్డ్ లుక్‌ను కలిగి ఉంది. ఇది క్రేజీగా అనిపిస్తుంది. దీని ముందు భాగంలో, త్రిభుజాకార ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ యూనిట్ చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. దానిలో ఇంటిగ్రేటెడ్ H- ఆకారపు DRL ఉంటుంది. దీని వెనుక భాగంలో గోల్డెన్ కలర్ USD (Upside Down) ఫ్రంట్ ఫోర్క్స్ ఉండగా, ఇవి 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను సపోర్ట్ చేస్తాయి.

వీటికి పైభాగంలో కోణమై ఉన్న ఫ్రంట్ ఫెండర్ మరింత స్పోర్టీ లుక్‌ను ఇస్తుంది. ముఖ్యంగా సైడ్ నుంచి చూసినట్లయితే పక్కనుంచి చూస్తే, ఎక్స్‌ట్రీమ్ 250R డిజైన్లో అత్యంత ప్రభావవంతమైన అంశం దాని మసులార్ ఫ్యూయల్ ట్యాంక్. ఇది బైక్‌కు మరింత అగ్రెసివ్ లుక్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

Hero Xtreme 250R Review

ఈ బైక్‌లో రైడింగ్ సమాచారం చూపించే LCD డిస్‌ప్లే ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా మొబైల్‌తో కనెక్ట్ అయి నావిగేషన్, కాల్స్, మెసేజ్ నోటిఫికేషన్లు పొందే వీలుంది. ఫ్యూయల్ ట్యాంక్ భాగంలో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, దీని ద్వారా రైడింగ్ సమయంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

దీని ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లు, రెండు భాగాల సీటింగ్, స్టబ్బీ ఎగ్జాస్ట్ బైక్ అగ్రెసివ్ లుక్‌ను మరింత పెంచుతాయి. వెనుక భాగంలో LED టెయిల్ లైట్లు ఉన్నాయి, అలాగే 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై వెడల్పైన వెనుక టైర్ మరింత స్టైలిష్ లుక్‌ను అందిస్తుంది.

Hero Xtreme 250R Review Riding Suspension

మెకానికల్ స్పెసిఫికేషన్లు- శక్తివంతమైన కొత్త ఇంజిన్: హీరో ఎక్స్‌ట్రీమ్ 250R బైక్ 250cc లిక్విడ్-కూల్డ్, 4-వాల్వ్, DOHC, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌‌ని కలిగి ఉంది. ఇది 9,250rpm వద్ద 30bhp పవర్, 7,250rpm వద్ద 25Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు స్లిపర్ అండ్ అసిస్ట్ క్లచ్ అందించబడింది, ఇది హైవే రైడింగ్‌ను మరింత సాఫీగా మార్చుతుంది

ఎక్స్‌ట్రీమ్ 250R బైక్ 43mm USD ఫ్రంట్ ఫోర్క్ నుండి సస్పెండ్ చేయబడిన స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది. 6 స్థాయిల ప్రీలోడ్ సర్దుబాటుతో గ్యాస్-చార్జ్డ్ మోనోషాక్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో 320mm పెటల్ డిస్క్, వెనుక భాగంలో చిన్న 230mm పెటల్ డిస్క్ ఉంటాయి. ఇవి స్విచ్ చేయగల డ్యూయల్ ఛానల్ ABS ద్వారా రైడింగ్ మరింత సాఫీగా ఉంటుంది.

Hero Xtreme 250R Review Specifications

ఎక్స్‌ట్రీమ్ 250R 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ పై 110/70 (ఫ్రంట్) అలాగే 150/60 (రియర్) టైర్లు ఉన్నాయి. ఇవి బైక్‌కు మన్నికను, రోడ్ గ్రిప్‌ను అందిస్తాయి. ఈ బైక్ కొలతలను చూసినట్లయితే 2,023mm పొడవు, 828mm వెడల్పు, 1,062mm ఎత్తును కలిగి ఉంటుంది. వీల్‌బేస్‌ 1,357mmగా ఉంది. సీటు ఎత్తు 806mm, గ్రౌండ్ క్లియరెన్స్ 167mm. హీరో Xtreme 250R 167.7kg బరువుతో ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ 11.5-లీటర్లు.

రైడింగ్ అనుభవం - పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డైలీ యూజ్‌కు బెస్డ్: సరికొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 250R నిజంగా ప్రత్యేకంగా నిలుస్తనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని డిజైన్ పిచ్చి లుక్స్‌తో అందరినీ ఆకర్షిస్తుంది. హీరో దీని పనితీరు విషయంలో ఏమాత్రం తగ్గనివ్వలేదు. స్ట్రీట్ ఫైటర్ లుక్‌తో పాటు బలమైన ఇంజిన్‌ని అందించింది. రోడ్లపై సాఫీగా రైడింగ్‌ను అందిస్తుంది.

Hero Xtreme 250R Review In Telugu

స్మూత్ గేర్ షిఫ్టింగ్, బలమైన టార్క్ డెలివరీతో ఈ బైక్ హైవేలు, ట్రాఫిక్ రెండింటికీ అనువుగా ఉంటుంది. డిజైన్ పరంగా యూత్‌కు బాగా నచ్చే స్టైలింగ్, రైడింగ్ పరంగా స్పోర్టీ ఫీల్, కంఫర్ట్ రెండూ ఇందులో సమపాళ్లలో ఉంటాయి. ఇది 250cc ఇంజిన్ శక్తివంతంగా పని చేస్తుంది, తొలుతే స్ట్రాంగ్ పికప్ అందిస్తూ ఫస్ట్ గేర్ లోనే పవర్‌ఫుల్ స్టార్ట్ ను ఇస్తుంది.

గేర్‌లను మార్చినప్పుడు, స్పీడ్ మీటర్ పెరగడం చూస్తున్నప్పుడు పనితీరు మరింత అద్బుతంగా అనిపిస్తుంది. 6వ గేర్ హైవేపై ప్రయాణించడానికి అనువైనది. ఈ గేర్‌లో ఇంజిన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా మూడు అంకెల వేగంతో సులభంగా ప్రయాణించగలదు. అయితే, 4000-5250rpm మార్క్ వద్ద ఎక్కువగా లీనియర్ పవర్ డెలివరీలో ఒక చిన్న ఫ్లాట్ స్పాట్ మేము గమనించాం.

Hero Xtreme 250R Display

ఎక్స్‌ట్రీమ్ 250R సస్పెన్షన్ చక్కగా ట్యూన్ చేయబడింది, రోడ్లలో ఉన్న గుంతలు, అడ్డదారులు తేలికగా హ్యాండిల్ చేయగలదు. కఠినమైన రోడ్లపై సులభంగా ప్రయాణిస్తుంది. కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్, మంచి కుషనింగ్ ఈ బైక్‌ను లాంగ్ రైడ్స్‌కు అనువుగా మారుస్తాయి. 50:50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కారణంగా బైక్ లైట్‌వెయిట్‌గా అనిపిస్తుంది. మలపుల వద్ద ఈజీగా వెళ్లినప్పటికి, అయితే MRF Zapper టైర్స్ కారణంగా హై స్పీడ్‌లో పూర్తి కాన్ఫిడెన్స్ అందించలేకపోతుంది.

బ్రేకులు శార్ప్‌గా ఎఫెక్టివ్, ట్రాక్ మోడ్‌లో మరింత మెరుగైన బ్రేకింగ్ అనుభూతిని అందిస్తాయి. అయితే, ట్రాక్ మోడ్‌లో డ్యూయల్-ఛానల్ ABS ఎక్కువ శక్తిగా ఇంటర్వీన్ అవుతుంది, దాంతో కొంతమంది రైడర్లకు అసౌకర్యంగా అనిపించొచ్చు. అయితే ఇది టైర్ల నుంచి వచ్చే అవకాశం ఉంది. ప్రయాణంలో ఉన్నప్పుడు మీరు రెండు మోడ్‌ల మధ్య ABSని మార్చలేకపోవడం లోపంగా చెప్పవచ్చు. ఇది మెరుగుపరచాల్సిన అంశం.

Hero Xtreme250R Telugu Review

చివరగా: హీరో ఎక్స్‌ట్రీమ్ 250Rలో హీరో 250cc నేకడ్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో బలమైన ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న KTM, బజాజ్, హస్క్‌వర్నా లాంటి స్ట్రాంగ్ బ్రాండ్స్‌కు ఇది పెద్ద ఛాలెంజ్ కానుంది. స్టైలిష్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కలిగి ఉండటంతో ఈ బైక్‌ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే, బెటర్ హాండ్లింగ్ కోసం టైర్‌ను అప్‌గ్రేడ్‌ను చేయడం పరిగణలోకి తీసుకోవడం మంచిది.

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2025, 11:00 [IST]
English summary
Hero xtreme 250r review riding impressions specifications and all features in telugu
Read more on: #hero motocorp #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+