యాక్టివా 125, యాక్సిస్ 125, డ్యూరో 125: వీటిలో ఏది బెస్ట్?
స్కూటర్ సెగ్మెంట్లో ఎక్కువగా 100సీసీ, 110సీసీ మోడళ్లకు అధిక డిమాండ్ ఉంటోంది. కానీ 125సీసీ సెగ్మెంట్లోని స్కూటర్ల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఇందుకు ప్రధాన కారణం, 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో ఎక్కువ మోడళ్లు లేకపోవటమే. అయితే, ఇటీవలి కాలంలో స్కూటర్ల వినియోగం పెరుగుతుండటంతో, టూవీలర్ కంపెనీలు రెగ్యులర్ స్కూటర్ల కన్నా పవర్‌ఫుల్ స్కూటర్లను కావాలనుకునే కస్టమర్లపై దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే, హోండా ఇటీవల యాక్టివా 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్లో సుజుకి యాక్సెస్, మహీంద్రా డ్యూరో డిజెడ్ 125సీసీ స్కూటర్లు లభ్యమవుతుండగా, ఈ రెండు మోడళ్లకు మరింత గట్టి పోటీగా నిలువనుంది హోండా యాక్టివా 125. ఈ నేపథ్యం, ఈ మూడు 125సీసీ స్కూటర్లలో (యాక్టివా 125, యాక్సిస్ 125, డ్యూరో 125) ఏది ఉత్తమమైన స్కూటర్ అనే అంశాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలకు ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో హోండా యాక్టివా 125, సుజుకి యాక్సిస్ 125 మరియు మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 స్కూటర్ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించండి.

ఓవర్‌వ్యూ: హోండా యాక్టివా 125
దాదాపు దశాబ్ధకాలంగా ఉన్న బోరింగ్ యాక్టివా డిజైన్‌ను అప్‌గ్రేడ్, క్రోమ్ టచ్‌తో కాస్తంత అప్‌మార్కెట్ ఫీల్ కలిగించేలా కొత్త యాక్టివా 125ను డిజైన్ చేశారు. తాజా లుక్, పెద్ద ఇంజన్, మరింత పవర్‌లతో వచ్చిన ఈ యాక్టివా 125 నేటి యువత ఎంపికలో ఫస్ట్ చాయిస్ ఉంటుంది. స్కూటర్ సెగ్మెంట్లో కొనుగోలుదారుల విశ్వసనీయతను సంపాధించుకోవడంలో యాక్టివా బ్రాండ్ ముందుంది.

ఓవర్‌వ్యూ: సుజుకి యాక్సిస్ 125
హోండా యాక్టివా 125 మార్కెట్లోకి రాక ముందు వరకు, 125సీసీ ఇంజన్ కలిగిన స్కూటర్‌ను కోరుకునే వారి కస్టమర్ల ఫస్ట్ చాయిస్‌గా సుజుకి యాక్సిస్ 125నే ఉండేది. యాక్సిస్ 125 కూడా ఓ మంచి సక్సెస్‌ఫుల్ 125సీసీ స్కూటర్‌గా మార్కెట్లో నిలదొక్కుకోగలిగింది. శక్తివంతమైన ఇంజన్, ధృడమైన నిర్మాణం, కాంపాక్ట్ డిజైన్ వంటి అనేక ప్రత్యేకతలు దీని సొంతం.

ఓవర్‌వ్యూ: మహీంద్రా డ్యూరో డిజెడ్
మహీంద్రా టూవీలర్స్ కైనటిక్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ కంపెనీ ఉత్పత్తులను రీబ్యాడ్జింగ్ చేసి మహీంద్రా బ్రాండ్ క్రింద విక్రయించడం ప్రారంభించారు. అందులో, మహీంద్రా డ్యూరో స్కూటర్‌కి రిఫ్రెష్డ్ వెర్షనే ఈ కొత్త మహీంద్రా డ్యూరో డిజెడ్. మహీంద్రా టూవీలర్స్ ఈ స్కూటర్‌ను కొత్త 125సీసీ ఇంజన్‌తో పాటుగా కొత్త డిజైన్‌తో రీలాంచ్ చేశారు. కానీ, ఇది అంత పాపులర్ కాలేకపోయింది.

స్టైలింగ్: యాక్టివా 125
ఇటీవలే విడుదలైన హోండా యాక్టివా 125 స్టైలింగ్ విషయంలో మిగిలిన రెండు మోడళ్ల కన్నా మెరుగ్గా అనిపిస్తుంది. ధృడమైన మెటల్ బాడీ నిర్మాణం, ముందు వైపు క్రోమ్ గార్నిష్, కొత్త హెడ్‌ల్యాంప్స్ డిజైన్, కొత్త టర్న్ ఇండికేటర్స్ డిజైన్‌లతో ఇది మంచి ప్రీమియం లుక్‌ని కలిగి ఉంటుంది.

స్టైలింగ్: యాక్సిస్ 125
సుజుకి యాక్సిస్ 125 ఓ సింపుల్ లుకింగ్ ఫ్యామిలీ స్కూటర్. దీని డిజైన్ చాలా సింపుల్‌గా ఉండటం వలన నేటి మోడ్రన్ యూత్ దీనికి అట్రాక్ట్ కాకపోవచ్చు. స్త్రీ, పురుషులు ఎవ్వరికైనా ఈ స్కూటర్ చక్కగా సూట్ అవుతుంది. కానీ, యాక్టివా 125 డిజైన్‌తో పోల్చుకుంటే, ఇది అంత ఆకర్షనీయంగా అనిపించకపోవచ్చు.

స్టైలింగ్: డ్యూరో డిజెడ్ 125
మహీంద్రా డ్యూరో డిజెడ్ 125 స్కూటర్ కూడా చాలా సింపుల్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. డ్యూరో డిజెడ్, యాక్సిస్ స్కూటర్లను పక్కపక్కనే ఉంచి, ముందు వైపు నుంచి చూస్తే, ఈ రెండు స్కూటర్లలో అనేక పోలికలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ, డిజైన్ విషయంలో యాక్టివా 125 స్కూటరే బెటర్ అనిపిస్తుంది.

సీటింగ్, కంఫర్ట్: యాక్టివా 125
యాక్టివా 125లో అప్‌రైట్ రైడింగ్ పొజిషన్ కోసం వెడల్పుగా, ఫ్లాట్‌గా ఉండే సీటును జోడించారు. ఇది కేవలం రైడర్‌కే కాకుండా పిలియన్ రైడర్‌కు మంచి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. పెద్ద అల్లాయ్ గ్రాబ్ హ్యాండిల్, అల్లాయ్ ఫుట్ రెస్ట్స్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ వంటి పలు కంఫర్టబల్ ఫీచర్లు దీని సొంతం.

సీటింగ్, కంఫర్ట్: యాక్సిస్ 125
సుజుకి యాక్సిస్ సీటింగ్ పొజిషన్ కూడా యాక్టివా 125 మాదిరిగానే అనిపిస్తుంది. ఫ్లాట్‌గా, వెడల్పుగా ఉండే సీట్ రైడర్‍కు మరియు పిలయర్ రైడర్‌కు కంఫర్టబల్ రైడ్‌ను ఆఫర్ చేస్తుంది. యాక్సిస్ స్కూటర్‌లోని ముందున్న ఫ్లోర్‌బోర్డ్ యాక్టివా అంత విశాలంగా ఉండదు.

సీటింగ్, కంఫర్ట్: డ్యూరో డిజెడ్
మహీంద్రా డ్యూరో డిజెడ్ స్కూటర్ సీట్ కూడా ఇతర రెండు స్కూటర్ల మాదిరిగానే రైడర్‌కు, పిలయన్ రైడర్‌కు సౌకర్యంగా ఉంటుంది. అయితే, పొడవుగా ఉండే వ్యక్తులకు సీటింగ్ పొజిషన్ మాత్రం కాస్తంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం, ఎత్తులో ఉండే ఫ్లోర్‌బోర్డ్.

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్టివా 125
హోండా యాక్టివా 125లో 124.9సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హార్స్‌పవర్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ వి-మ్యాటిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 59 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది (సగటు మైలేజ్ 45-50).

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: యాక్సిస్ 125
సుజుకి యాక్సిస్‌లో 124సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.58 హార్స్‌పవర్‌ల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
సుజుకి యాక్సిస్ సగటును లీటరుకు 40-50 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్: డ్యూరో డిజెడ్
మహీంద్రా డ్యూరో డిజెడ్‌లో 124.6సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8 హార్స్‌పవర్‌ల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 56.25 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది (సగటు మైలేజ్ 40-45).

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్టివా 125
హోండా యాక్టివా 125లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ సస్పెన్షన్ వలన యాక్టివా 125 ఎలాంటి రోడ్లపై అయినా కంఫర్టబల్ రైడ్‌ను అందిస్తుంది. ఇందులో ముందు వైపు అమర్చిన 12 ఇంచ్, 5-స్పోక్ వీల్స్ మరొక అదనపు ఆకర్షణ. ఈ వీల్‌కు అమర్చిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్రేకింగ్ కాన్ఫిడెన్స్‌ను మరింత పెంచుతుంది. వెనుక వైపు 10 ఇంచ్ వీల్, 130 మి.మీ డ్రమ్ బ్రేక్‌తో లభిస్తుంది. ఇది కూడా ఇతర హోండా స్కూటర్ల మాదిరిగానే కాంబీ బ్రేక్ సిస్టమ్‌తో లభిస్తుంది (బ్రేక్ వేసినప్పుడు రెండు బ్రేక్‌లు అప్లయ్ అవుతాయి)

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: యాక్సిస్ 125
సుజుకి యాక్సిస్ 125లో ముందు వైపు స్వింగ్ ఆర్మ్ టైప్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు టైప్ సస్పెన్లను ఆఫర్ చేస్తున్నారు. యాక్టివా 125 మాదిరిగా కాకుండా, ఇందులో రెండు వైపులా 10-ఇంచ్ వీల్సే ఉంటాయి. ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉండదు. ఇరువైపులా 120 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో కాంబీ బ్రేక్ సిస్టమ్ వంటి టెక్నాలజీ లేదు.

సస్పెన్షన్, వీల్స్, బ్రేక్స్: డ్యూరో డిజెడ్
సుజుకి యాక్సిస్ మాదిరిగానే మహీంద్రా డ్యూరో డిజెడ్ కూడా 10-ఇంచ్ వీల్స్‌తో లభిస్తుంది. ఇందులో ఇరువైపులా 130 మి.మీ. డ్రమ్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు. ఈ స్కూటర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్, వెనుక వైపు హైడ్రాలిక్ స్వింగ్ ఆర్మ్ టైప్ సస్పెన్షన్లను ఆఫర్ చేస్తున్నారు.

ఇతర ఫీచర్లు: యాక్టివా 125
డిజిటల్ అనాలాగ్ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన స్విచ్‌లు.

ఇతర ఫీచర్లు: యాక్టివా 125
18-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, స్లైడింగ్ కవర్‌తో కూడిన కీ, క్లిక్ (కన్వీనెంట్ లిఫ్ట్ అప్ ఇండిపెండెంట్ కవర్) వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: యాక్సిస్ 125
పూర్తిగా అనలాగ్ క్లస్టర్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 20 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ.

ఇతర ఫీచర్లు: యాక్సిస్ 125
వెనుక బ్రేక్ లివర్ కోసం బ్రేక్ లాక్ ఆప్షన్, స్లైడింగ్ కవర్‌తో కూడిన కీహోల్, అండర్ సీట్ స్టోరేజ్ కోసం ఇగ్నిషన్ కీ స్లాట్‌నే ఉపయోగించుకోవటం వంటి ప్రత్యేకతలు దీని సొంతం

ఇతర ఫీచర్లు: మహీంద్రా డ్యూరో డిజెడ్
పూర్తి అనలాగ్ క్లస్టర్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, 20 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, ఫ్రంట్ గ్లవ్ బాక్స్, 6 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్, వెనుక బ్రేక్ లివర్ కోసం బ్రేక్ లాక్ ఆప్షన్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్‌లో లభిస్తాయి.

ఈ మూడు స్కూటర్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధరల షీట్‌ను ఈ స్లైడ్‌లో చూడండి.

వ్యాల్యూ ఫర మనీ
హోండా యాక్టివా 125 స్టయిలిష్, మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉండి ఈ సెగ్మెంట్లో నెంబర్ వన్‌గా ఉంది. తొలిచూపులోనే ఇది కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇతర స్కూటర్ల అందంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని ఇంజన్ కూడా ఇతర మోడళ్ల కన్నా మరింత ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఈ మూడు స్కూటర్లు ఇంచు మించు ఒకే రకమైన మైలేజీనిస్తాయి.

చివరిమాట
హోండా యాక్టివా 125లోని ఫ్రంట్ ఆప్షనల్ డిస్క్ బ్రేక్ మరియు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌లు రోడ్డుపై మంచి బ్రేకింగ్ కాన్సిఫెడన్స్‌ను ఇస్తాయి. మిగిలన రెండు స్కూటర్లలో రెగ్యులర్ డ్రమ్ బ్రేక్స్ మాత్రమే లభిస్తున్నాయి. సస్పెన్షన్ విషయంలో కూడా హోండా యాక్టివా మెరుగ్గా ఉంటుంది. అయితే, మిగిలిన రెండు స్కూటర్లతో పోల్చుకుంటే, యాక్టివా 125 అధిక ధరను కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఇధి ధరకు తగిన విలువను ఆఫర్ చేస్తుంది.
కాబట్టి, ధరకు కాకుండా నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చే వారికి యాక్టివా 125 బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. బడ్జెట్‌లో 125సీసీ స్కూటర్ కోరుకునే వారికి సుజుకి యాక్సిస్ 125 చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం ధరను మాత్రమే పరిగణలోకి తీసుకునే వారు డ్యూరో డిజెడ్‌ను ఎంచుకోవచ్చు.


Click it and Unblock the Notifications








