భారతీయ మార్కెట్లో మొదటి స్థానంలో ఉన్న ఆక్టివా 125 కు గస్టో 125 పోటిగా నిలుస్తుందా..?
ఒకప్పుడు ప్రతి ఒక్కరూ బైకు కొనాలనుకునే వారు కాని ఇప్పుడు ఆ తీరు మారింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్కూటర్లను కోరుకుంటున్నారు. దీనికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి మంచి ఇంధన సామర్థ్యం, తక్కువ ధర, సులభమైన రైడింగ్, అన్నింటి కన్నా గేర్లు లేకపోడం.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన మిలిటరీ వాహనాలను కలిగిన దేశాలు
హోండా వారు మార్కెట్లోకి విడుదల చేసిన ఆక్టివా 125 స్కూటర్ దేశవ్యాప్తంగా అత్యధికంగా కొనుగోలు చేస్తున్న స్కూటర్లలో మొదటి స్థానంలో ఉంది. అయితే మహీంద్రా వారు సరికొత్త గస్టో 125 స్కూటర్‌ను ఆవిష్కరించారు. మహీంద్రా వారు గస్టో 125 స్కూటర్ హోండా ఆక్టివా స్కూటర్‌ను వెనక్కునెడుతుందా...? అందుకే వీటి మధ్యగల తేడాలు క్రింది కథనంలో అందించాము.
Also Read: రాయల్ ఎన్ఫీల్డ్ నుండి బ్లూ పెంట్ జాబ్ బుల్లెట్ ఎలక్ట్రా బైకు
హోండా ఆక్టివా125 వర్సెస్ మహీంద్రా గస్టో 125

ధర
- హోండా ఆక్టివా 125 ధర రూ. 63,000 ఆన్ రోడ్( ఢిల్లీ)
- మహీంద్రా గస్టో 125 ధర రూ. 60,000 వరకు ఉండవచ్చు(దాదాపుగా)
- టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
- ఆప్షనల్ డిస్క్ బ్రేక్స్
- అల్లాయ్ వీల్స్
- హోండా కంబైన్డ్ బ్రేక్స్ సిస్టమ్
- అండర్ సీట్ స్టోరేజ్
- ముందువైపు 12-అంగుళాలు, వెనుకవైపున 10-అంగుళాలు గల చక్రాలు
- అల్లాయ్ వీల్స్
- టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్
- అండర్ సీట్ స్టోరేజ్
- ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే అవకాశం గల సీటు
- ఇంస్ట్రుమెంట్ కన్సోల్ క్రింద గల చిన్న స్టోరేజ్
- రెబల్ రెడ్ మెటాలిక్
- మిడ్ నైట్ బ్లూ మెటాలిక్
- పియర్ల్ అమేజింగ్ వైట్
- బ్లాక్
- ఆరేంజ్ రష్ (డ్యూయల్ టోన్)
- బోల్ట్ వైట్ (డ్యూయల్ టోన్)
- మోనార్క్ బ్లాక్
- రిగాల్ రెడ్
- ఒక్కటే కాని ఎనిమిది రంగుల్లో
- 2016లో విడుదల కానున్న పది ఆకర్షణీయమైన స్కూటర్లు
- 2016 సంవత్సరానికి హార్లిడేవిడ్‌సన్ నుండి కొత్త మోడళ్లు

హోండా ఆక్టివా 125 డిజైన్
హోండా ఆక్టివా 125 డిజైన్ చూడటానికి ఎంతో ఫార్మల్ గా కనిపిస్తుంది. కాని పదునైన గ్రాఫిక్స్ మరియు స్పోర్టివ్ గా ఉండే దీని డిజైన్ దీనిని ఎప్పుడూ దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉంచింది. హెడ్ ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్స్ రెండింటిని ఒకే డికాల్‌లో అమర్చారు.

మహీంద్రా గస్టో 125 డిజైన్
మహీంద్రా గస్టో 125 స్కూటర్ డజైన్ అత్భుతంగా ఉందని చెప్పవచ్చు. దీనిని ముందు వైపున కార్లు వలె ఎయిర్ వెంట్ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. దీని ముందు వైపున గల ఇండికేటర్ ల్యాంప్స్ ను అమర్చిన ప్రదేశం ఎంతో చక్కగా ఉంది.

హోండా ఆక్టివా 125 ఇంజన్
ఈ హోండా ఆక్టివా 125 స్కూటర్‌లో శక్తివంతమైన 124 సీసీ గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు

పనితీరు మరియు మైలేజ్
హోండా ఆక్టివా 125 లో గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 8.6 బిహెచ్‌పి పవర్ మరియు 10.1 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో గల సివిటి గేర్ బాక్స్ లీటర్ కు 59 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వడంలో సహాయపడుతుంది.

మహీంద్రా గస్టో 125 ఇంజన్
మహీంద్రా గస్టో 125 స్కూటర్‌లో అత్యంత శక్తివంతమైన 124.5సీసీ కెపాసిటి గల సిగంల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

పనితీరు మరియు మైలేజ్
మహీంద్రా గస్టో 125 స్కూటర్‌లో గల ఇంజన్ దాదాపుగా 8.5 బిహెచ్‌పి పవర్ మరియు 10 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులో గల సివిటి గేర్ ఆక్టివా వంటి మైలేజ్ ఇవ్వగలదు.

హోండా ఆక్టివా 125 ఫీచర్లు

మహీంద్రా గస్టో 125 ఫీచర్లు

హోండా ఆక్టివా 125 లభించు రంగులు

మహీంద్రా గస్టో 125 లభించు రంగులు
మహీంద్రా గస్టో 125 స్కూటర్ నాలుగు విభిన్న రంగుల్లో లభించును.

తీర్పు
ఇంజన్, పనితీరు, ఫీచర్లు మరియు మైలేజ్ వంటి వాటిలో ఈ రెండు స్కూటర్లు కూడా దాదాపు సమానంగానే ఉన్నాయి. అయితే డిజైన్ పరంగా మహీంద్రా గస్టో 125 స్కూటర్ హోండా ఆక్టివా కన్నా మంచి మార్కులు కొట్టేసింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా మొదిటి సారిగా పరిచయం చేసిన సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే అవకాశం ఇందులో కల్పించారు. హోండా ఆక్టివా మీద మహీంద్రా గస్టో 125 స్కూటర్ విజయం సాధిస్తుందని మా అభిప్రాయం.



Click it and Unblock the Notifications








