హోండా యాక్టివా-ఐ స్కూటర్: ధర, ఫీచర్లు, రివ్యూ

By Ravi

ఒక్కొక్క వినియోగదారుడు ఒక్కొక్క రకమైన అభిరుచిని కలిగి ఉంటారు. అలాంటి విభిన్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఉత్పత్తులను ఆఫర్ చేయగలగినప్పుడు ఏ కంపెనీ అయినా తాము చేసే వ్యాపారంలో విజయాన్ని సాధించేందుకు సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) ఈ ఫార్ములాను పాటిస్తోంది కాబట్టి.

గతంలో భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎక్కడో చివరి స్థానంలో ఉన్న హోండా, ఇప్పుడు నేరుగా అగ్రస్థానంపై కన్నేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. సరే, ఇదంతా అటుంచితే, హోండా అందిస్తున్న పాపులర్ యాక్టివా స్కూటర్‌లో కంపెనీ గడచిన నెలలో ప్రవేశపెట్టిన హోండా యాక్టివా-ఐ (Honda Activa-i) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

పాత హోండా యాక్టివా, క్లాసిక్ స్కూటర్ లుక్‌ని కలిగి ఉండటంతో ఆధునిక తరం కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ను కొనాలంటే ఆలోచించే వారు. పైపెచ్చు ఈ స్కూటర్ కాస్తంత హెవీగా కూడా అనిపిస్తుంది కాబట్టి అమ్మాయిలు లైట్ వెయిట్ స్కూటర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో, పై విధంగా ఆలోచించే వారిని దృష్టిలో ఉంచుకొని, హోండా ఓ స్టయిలిష్, స్పోర్టీ మరియు లైట్ వెయిట్ యాక్టివా స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. అదే హోండా యాక్టివా-ఐ.

ఆకర్షనీయమైన డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్ (110సీసీ), సాటిలేని మైలేజ్ (60 కెఎమ్‌పిఎల్), అత్యంత సరమైన ధర (రూ.44,200 ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), సురక్షితమైన బ్రేకింగ్ (కాంబీ బ్రేక్ సిస్టమ్), భారతీయ రోడ్లకు అనుగుణంగా ధృడమైన సస్పెన్షన్ వంటి అనేక విశిష్టమైన ఫీచర్లతో కొత్త యాక్టివా-ఐ స్కూటర్ లభిస్తుంది. హోండా యాక్టివా-ఐ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో తెలుసుకుందాం రండి..!

ఇంజన్

ఇంజన్

హోండా యాక్టివాలో ఉపయోగించిన 109.2సీసీ ఇంజన్‌నే ఈ కొత్త యాక్టివా-ఐ స్కూటర్‌లోను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 8 బిహెచ్‌పిల శక్తిని, 8.74 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్

మైలేజ్

హోండా యాక్టివా-ఐ స్కూటర్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని మైలేజ్. ప్రస్తుతం హోండా ఇంజన్లలో ఉపయోగిస్తున్న 'హోండా ఈకో టెక్నాలజీ' (హెచ్ఈటి) వలన ఈ స్కూటర్ లీటరు పెట్రోలుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

కాంబీ బ్రేక్ సిస్టమ్

కాంబీ బ్రేక్ సిస్టమ్

ఈ స్కూటర్‌లో మరొక విశిష్టమైన ఫీచర్ ఈ కాంబీ బ్రేక్ సిస్టమ్ (సిబిఎస్). అత్యవసర సమయాల్లో ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్‌లో ముందు, వెనుక బ్రేక్‌లు ఒకేసారి అప్లయ్ అయ్యి, బ్రేక్ దూరాన్ని తగ్గిస్తాయి, ఫలితంగా ప్రమాద అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

ట్యూబ్‌లెస్ టైర్లు

ట్యూబ్‌లెస్ టైర్లు

ఈ స్కూటర్‌లో కూడా ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. ట్యూబ్‌లెస్ టైర్లు పంక్చర్ అయినప్పుడు, తక్షణమే గాలిపోకుండా ఉండేందుకు సహకరిస్తాయి. ఫలితంగా మీ ప్రయాణంలో అసౌకర్యం ఉండదు.

పొడవాటి సీట్, హగ్గర్ ఫెండర్

పొడవాటి సీట్, హగ్గర్ ఫెండర్

ఈ స్కూటర్‌లోని పొడవాటి సీట్ కారణంగా, స్కూటర్ నడిపే వారకి, వెనుక కూర్చునే వారికి సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో మరొక విశిష్టమైన ఫీచర్ హగ్గర్ ఫెండర్. ఇది వెనుక టైరుకు కాస్తంత పైభాగంలో అమర్చబడి ఉంటుంది. ఇది మడ్ గార్డ్ మాదిరిగా పనిచేస్తుంది. వర్షాకాలంలో ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఇంజన్‌పై అలాగే వెనుక సీటుపై కూర్చునే వారిపై నీటి తుంపర్లు, బురద పడకుండా ఇది కాపాడుతుంది.

స్టీట్ క్రింద్ స్టోరేజ్ స్పేస్

స్టీట్ క్రింద్ స్టోరేజ్ స్పేస్

హోండా యాక్టివా-ఐ స్కూటర్ క్రింద 128 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ఓ ఫుల్ ఫేస్ హెల్మెట్ లేదా లంచ్ బాక్స్ లేదా ఇతర లగేజ్‌ను భద్రపరచుకోవచ్చు.

డిజైన్ ఫీచర్స్

డిజైన్ ఫీచర్స్

స్టయిలిష్ ట్రెండీ మీటర్ కన్సోల్స్‌తో కూడిన కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇండికేటర్లు మరియు బ్రేక్ లైట్ కాంబినేషన్‌తో కూడిన టైల్ లైట్, కర్వ్ లైన్‌తో కూడిన సైలెన్సర్ గార్డ్, ముందువైపు పొడవాటి ఇండికేటర్ లైట్స్, పవర్‌ఫుల్ హెడ్‌ల్యాంప్, డీసెంట్ బాడీ గ్రాఫిక్స్ తదితర ఫీచర్లు ఈ కొత్త హోండా యాక్టివా-ఐ స్కూటర్ సొంతం.

హైలైట్స్

హైలైట్స్

హోండా యాక్టివా-ఐ ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత చవకైన స్కూటర్. ఇది మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ. మొత్తం బరువును 103 కేజీలు. కొత్త డిజైన్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టెయిల్ లైట్స్, వెడల్పాటి సీట్, హగ్గర్ ఫెండర్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్.

కలర్స్

కలర్స్

ఇది పర్పల్ మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్, పెరల్ సన్‌బీమ్ వైట్, బీజ్ మెటాలిక్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగులలో లభ్యమవుతుంది

ధర

ధర

హైదరాబాద్ మార్కెట్లో హోండా యాక్టివా స్కూటర్ ధర రూ.46,765 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India has recently launched a new variant of the Activa gearless scooter called Activa i. Priced at Rs 44,000 (ex-showroom, Delhi), Activa i is about Rs 3,000 less expensive than the regular Activa, making it the new base Honda scooter model available in India. Here is the detailed review of all new Honda Activa-i scooter.
Story first published: Wednesday, July 3, 2013, 20:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X